(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: నేను మీరు అడిగే ప్రశ్నలను ఎప్పుడో, నా గ్రంథాలలో, నా సందేశాలలో చెప్పాను, బైబిల్ చదవాలి అన్నది ఎంత సత్యమో నా గ్రంధాలు చదవాలి అన్నది కూడా అంత సత్యం. తప్పక చదవాలి, షీనారు దేశము అంటే బాబేలు గోపురము కట్టబడినటువంటి ప్రదేశము. ఆ షీనారు దేశములో కొలను కట్టుచున్నారు. “కొల” అంటే వ్యాపారానికి చిహ్నము. వ్యాపారము అనేది ఏదైనా కొలతల మీద ఆధారపడి ఉంటుంది. భూమి మీద ఎన్ని గజాలు, ఎన్ని ఎకరాలు అనే కొలత. మెజర్‌మెంటు లేకుండా ఏ వ్యాపారం జరుగదు. దీన్ని ఇద్దరు స్త్రీలు సంకుబుడిలెక్కల కొంగలవంటి, కొంగ రెక్కలవంటి రెక్కలు వారికి ఉన్నది. “సంకుబుడి కొంగ” అనేది ధర్మశాస్త్రం ప్రకారం అపవిత్రమైన పక్షులలో ఒకటి. మనం తినకూడదు, బలి అర్పించ కూడదు. గనుక దురాత్మలు, పడిపోయిన దేవదూతలన్నమాట. వాళ్ళు ఈ కొలను తీసుకొని ఆకాశమార్గంలో మోసుకు పోతున్నారు. ఎక్కడికి అంటే షీనారు దేశానికి. ఆ షీనారు దేశమే బబులోను, ఇప్పుడు ఇరాక్ అయ్యింది. అక్కడ ఒక శాలను కడుతున్నారు. అంటే ఈ వ్యాపారమంతా, ప్రపంచవ్యాపారమంతా ఇరాక్‌లో అంత్యదినాలలో Centralized అయిపోతుంది. ప్రపంచ వ్యాపారానికి కీలకమైన ఒక కంప్యూటర్ నెట్వర్క్ ఒకటి. అంత్యకాలల్లో, అబద్ధ క్రీస్తు కాలంలో, ప్రభుత్వంలో ట్రిపుల్ సిక్స్ ముద్ర కుడిచేతి మీద గాని, ముద్ర వేయించుకోక పోతే అమ్మడానికి గాని, కొనడానికి గాని అధికారం లేకుండా వాడు చేస్తాడు. అనేది మనకు ప్రకటన 13లో తేటగా చెప్పబడింది. ఆ ముద్ర వేసుకున్న వారికి మాత్రమే రేషన్ allow ఉంటుంది. ఏ వస్తువైనా అమ్మడానికి, కొనడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళ వ్యాపారాలు అన్నింటికి డేట సేవింగ్ కోసమైన సర్వర్ ఇరాక్‌లో ఉంటుంది. అబద్ధ క్రీస్తే స్వయానా ఇరాక్ నుండిగాని, సిరియా నుండి గాని, వస్తాడు అనేది యుగాంతం గ్రంథంలో చెప్పాను. ఇప్పుడు ఈ షీనారు దేశంలో ఆ సాల కట్టబడుతుంది. అక్కడ ఈ “కొల” ఉంటుంది. “తూము” అంటే కూడా కొలత. అని యుగాంతంలో నేను ముఫ్పై యేండ్ల క్రింద చెప్పాను.
మరి ఈ సమాజం ఎందుకు చదవలేదు ఈ బుక్. అంటే ఆయనకు ఫ్యామిలీ Break అయింది అని అనేటువంటి Attitude. నా ఫ్యామిలీ గొడవ ఎందుకు? ఆ గ్రంథం ఎందుకు చదవలేదు? దేవుడు అభిషేకించి పంపించిన ప్రవక్త గ్రంథం. కష్టపడి రాసిన గ్రంథాలు తప్పకుండా ప్రతి క్రైస్తవ విశ్వాసి, నా పుస్తకాలు చదవాలి. వాళ్ళ, వాళ్ళ భాషల్లో అందిస్తాను. ఇది నాకు దేవుడు పెట్టిన పని.
ఇక్కడ చెప్పబడుతున్న ప్రవచనమేమిటంటే “అంత్యదినములలో ప్రపంచ వాణిజ్య మంతా కూడా షీనారు లేక, ఇరాక్, బబులోన్ లోనే Centralized అవుతుంది. అనే విషయాన్ని ప్రవచనం చెబుతుంది. దోష మూర్తి అనే ఒక స్త్రీ కనబడింది. ఆ తరువాత ఇద్దరు స్త్రీలు ఈ కొలను తీసుకొని పోయి షీనారు దేశంలో పెడుతున్నారు. కనుక అంత్యదినములలో ఎప్పుడైతే ఈ వ్యాపారమంతా ఇరాక్‌లో Centralized అయిపోతుందో, అప్పుడు ఈ ప్రపంచమే పాపంతో నిండిపోతుంది. దేవ విరుద్ధమైన కార్యక్రమాలు, దేవదూషణలు, ఆ దేవదూషణ కరమైన నామములే ఆ స్త్రీ మీద రాయబడ్డవి అని చెప్తాడు. ఆమె, కూడా కనబడుతుంది అక్కడే ప్రకటన 17లో ఆమె దానినొసట ఇలాగు రాయబడి ఉండును వేశ్యలకును, భూమిలోని ఏహ్యమైన వాటికిని తల్లియైన మహా బబులోను వేశ్య. గనుక ఇలాంటి భూమిలో ఉన్న అపవిత్రమైన వాటన్నింటికిని ఈమె తల్లి. దోషమూర్తి అంటే ఆమెనే. ఎప్పుడైతే ఈ దోషమూర్తి ప్రపంచ వ్యవహారాలలో ప్రస్ఫుటంగా కనబడుతుందో. అప్పుడే ఈ ప్రపంచ వ్యాపారమంత ఇరాక్ లో ఉంటుంది. ఇప్పుడు మనోళ్లు చెప్పుకుంటారు చూశారా? ఇక్కడ శంబల నగరం ఉన్నది, ఇక్కడ సిద్ధాశ్రమం ఉన్నది. మన దేశమే సూపర్ పవర్ అవుతుంది అనే పగటి కలలు. అన్నీ దేశాలు నాశనమైపోయి, ఒక అరబ్బురాజు ప్రపంచనియంత అవుతాడు. అప్పుడు వీళ్ళందరు కూడా నోరుమూసుకొని వాడికి లోబడల్సిందే. యేసురక్తం ద్వారా కడగబడి, ముద్రించబడి, పరిశుద్ధాత్మను కలిగిన వాళ్ళు మాత్రమే వాణ్ణి ఎదురుకోగలుగుతారు. మిగతానామకార్థ క్రైస్తవులు, అన్ని మతాల భక్తులు కలిసి మొత్తం ఈ మహాబబులోను దేశంలో కలసిపోతారు.