212. ప్రశ్న : అపో. 14:16లో గతములో దేవుడు సమస్తజనులను వారి వారి మార్గములో నడువనిచ్చెను అని ఉంది. అపో. 17:30 లో ఇప్పుడైతే అందరూ, అంతట మారుమనస్సు పొందాలి అని ఉంటుంది. నడువనివ్వటం అంటే ఏమిటి? గతంలో నడువనివ్వడు అంటే ఏమిటి? ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా మారుమనస్సు పొందడం అంటే ఏమిటి? అప్పుడు అలాగా, ఇప్పుడు ఇలాగా, అన్నాడా? నోవహు కాలంలో తరువాత అబ్రహామును దేవుడు పిలుస్తాడు కదా, నోవహును కూడా దేవుడు ఫలించి అభివృద్ధి పొందుడి అంటాడు. తరువాత మళ్ళీ 12వ అధ్యాయంలో అబ్రహామును దేవుడు పిలిచి నువ్వు, నేను చూపించే ప్రదేశానికి వెల్లమని చెప్తాడు. వీళ్ళమధ్యలో ఏం జరిగింది? 8 నుండి 12 అధ్యాయలమధ్య జరిగింది ఏమిటి? తరువాత అబ్రాహాము వాళ్ళ జాతికి దేవుడు మాట్లాడుతూ వస్తాడు కదా! ఆ సమయంలో మిగతా జనాంగాన్ని దేవుడు పట్టించుకోలేదా ఏమిటి? అనేది తెలియజేయండి.

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)

జవాబు:      అపో. 17:30లో ఆ అజ్ఞాన కాలమును దేవుడు చూచియూ, చూడనట్టు ఊరకుండెను.  గాని ఇప్పుడైతే అంతటనూ, అందరునూ మారు మనస్సు పొందవలెనని మనష్యులను ఆజ్ఞాపించుచున్నాడు. ఒకప్పుడు అజ్ఞాన కాలములు ఇప్పుడు విజ్ఞాన కాలములు. యేసుప్రభువువారు అవతరించి, ప్రవచనములు నెరవేర్చి, తిరిగిలేచి చనిపోయి, మరణాన్ని గెలిచి, తన సువార్తను లోకమంతా చాటించడానికి పంపించిన తరువాత ఉన్నది అజ్ఞాన కాలం కాదు. యేసు ప్రభువువారు అవతరించక ముందు ఉన్నది అజ్ఞాన కాలము. యేసు అవతరించిన తరువాత ఉన్నది విజ్ఞానకాలం. ఈ కాలమును గూర్చి అపో. 17:26 లో దేవుణ్ణి వెతకడానికి ఒక నిర్ణయకాలాన్ని ఏర్పాటు చేసాడు. అంతకముందు మీరు ఇంకో ప్రశ్న అడిగారు. ఆ కాలములో కూడా యదార్థముగా యేసును వెతకుతున్న అన్ని జాతుల మహర్షులకూ, దైవాన్వేషకులకు, దేవుడు తనను గూర్చిన జ్ఞానాన్ని బయలు పరిచాడు.  గనుకనే ఆయా మతగ్రంథాలలో సువార్తను గూర్చిన అంశాలు, రక్షకుడి గూర్చిన అంశాలు రాయబడినవి. దీని గూర్చి నేను హైందవక్రైస్తవం గ్రంథంలో నిరూపించాను. యేసుప్రభువారు అవతరించక ముందు వెయ్యేళ్ళకు ముందు, 1500 ఏళ్లకు ముందు భారతీయ మహర్షులకు దేవుడు తెలియపరచిన సువార్త సత్యాలను వాళ్ళు చతుర్వేదములలో రాసారు. అలాగే చైనా దేశపు Confusious కూడా రాసాడు.  ప్లేటో కూడా రాసాడు.  క్రీ.పూ. వెయ్యేళ్ళకు ముందు జరతుష్ఠ మహర్షి, జోరాష్ట్రర్ అనే పారశీక దేశ మహర్షి ప్రవచించాడు. అలాగే ఆయా దేశములలో ఉన్నవారికి రక్షకుని జననము గూర్చి తెలుసు.  గనుకనే తూర్పుదేశపు జ్ఞానులు వచ్చారు. యేసు అవతరించినప్పుడు. ఇతర దేశములకు యేసు అనే నామమే తెలియలేదు. గాని ఒక రక్షకుడు ఈ రీతిగా పుట్టబోతున్నాడు అనే సంగతిని దేవుడు తెలియపరిచాడు. అయితే ఆ ప్రపచనములన్నీ నెరవేర్చబడినవి. చరిత్రలో భౌతిక ప్రపంచంలో, యేసు క్రీస్తు జీవితంలో మాత్రమే పాలస్తీన దేశంలో మాత్రమే. అంతకుముందు ఎవడైనా నాకు నిరూపణ దొరుకలేదు.  నాకు సత్యం ఎవడు స్పష్టంగా చెప్పలేదు.  నాకు గ్రంథములలో ఆధారాలు ఎవరు చూపలేదు.  నాకు శాస్త్రీయాధారాలు చూపలేదు అని వాదిస్తే ఒకవేళ దేవుడు కనికరిస్తాడు. అంతేగాని, ఇప్పుడు చరిత్రలో వేదాలునెరవేరినవి, చారిత్రకంగా ప్రవచనములన్నీ, భౌతికంగా మన కళ్ళ ముందునెరవేరి, కనబడుతున్నవి. ఇప్పుడు నమ్మకపోతే వారి అవిశ్వాసానికి క్షమాపణ ఉండదు. ఎవడైనా ఒకవేళ ప్రాచీన కాలంలో బ్రతికినవాడు దేవుని దగ్గరకు వెళ్ళి, అయ్యా నీవు గొప్పదేవుడవని, నీవే సత్యదేవుడవని, చెప్పలేదు. నాకు కొన్ని ప్రశ్నలున్నవి, నాకు సమాధానాలు దొరకలేవు అని అనుంటే దేవుడు కనికరిస్తాడేమో కాని ఇప్పుడు అందరూ మారుమనస్సు పొందాలి. అంతకు ముందు ఉన్నోళ్లు ఎందుకు వదిలేశారు అంటే, వీళ్ళలో మనస్సాక్షి ప్రకారము న్యాయంగా, ధర్మంగా, జీవించినోళ్ళను దేవుడు పరదైసుకు తీసుకొని పోయి, యేసుప్రభువారి మరణము జరిగినప్పుడు ఆయన పరదైసులోనికి ఆ దొంగను కూడా దొంగను తీసుకుపోయి వాళ్ళకు సువార్త ప్రకటించినప్పుడు వాళ్ళు నమ్మారు, నమ్ముతారు అని దేవునికి తెలుసు గనుక, అప్పటికాలంలో నీకు భూమ్మిద సాక్ష్యాధారాలు దొరకక, పరదైసులో దొరుకుతాయి అని వదిలేసాడు. అది అసలు విషయం. కాని యేసుప్రభు అవతరించిన తర్వాత అన్ని సాక్ష్యాధారాలు చూసిన తరువాత ఇప్పుడు నమ్మనివాళ్ళకు క్షమాపణ లేదు. ఇకపోతే నోవహు అనే మూలపురుషుడు, ఆయన క్రీస్తుకు పూర్వము 2400యేళ్ళ నాటివాడు. అంటే ఆదాము తరువాత 1600 ఏళ్ళకు నోవహు చరిత్ర జలప్రళయం వచ్చింది. ఆ జలప్రళయం తరువాత నోవహులోనుండి షేము, హము, యాపేతు అనే ముగ్గురు కుమారులనుండి మానవ జాతి విస్తరించింది. ఆ పెద్దవాని కుమారుడు నుంచి వచ్చిన మనుమడు అబ్రాహాము అన్నమాట.  నోవహు పెద్ద కొడుకు నుండి వచ్చినవారు హెబ్రీయులు.  హెబ్రీయులనుంచి అబ్రాహాము, తరువాత చిన్నవాడు యాపేతు. యాపేతు పిల్లలలోంచి వచ్చినవారు జర్మనీయులు, ఆర్యులు, ఇరాన్, ఆ మధ్యలో ఏమి జరిగింది అంటే కేవలం నాలుగువందల సంవత్సరాల కాలం. నోవహు పిల్లలలోనుండి ఒకణ్ణి దేవుడు ఎన్నుకొని రక్షకుడు పుట్టడానికి అనుకూలమైన ఒక భక్తిగల జనాంగమును విగ్రహారాధన చేయకుండా, సత్యదేవుని గూర్చి జ్ఞానం కలిగి, సత్యదేవునికే ప్రతిష్ఠితులైన ఒక జనాంగమును దేవుడు సృష్టించడానికి ఒక మనిషిని ఎన్నుకొని ఎంపిక చేసుకున్నాడు. నోవహు తరువాత అతని మొదటి కొడుకు సంతానంలోనుండి అబ్రాహాము ఒక విశ్వాసయోధుడు దేవునికి దొరికాడు. అబ్రాహాములోనుండి రక్షకుని అవతారము కొరకు ఇశ్రాయేలు జనాంగం అనే వేదిక తయారయ్యింది. ఉన్నటు అబ్రాహాముతోనే ఎందుకు మాట్లాడాడు అంటే సర్వలోక ప్రజలందరూ కూడా ఈ విజ్ఞానకాలంలో స్టార్ట్ అయినతరువాత, సువార్త స్టార్ట్ అయిన తరువాత, సర్వలోక ప్రజలందరు రక్షణపొంది, యేసును రక్షకుడిగా అంగీకరించిన తరువాత అబ్రాహాము వంటివారు కావాలి. అబ్రాహాము వంటి విధేయత, విశ్వాసం కలిగిన వారు కావాలి అని, ఒక మాదిరి పురుషుడిగా అబ్రహామును పెట్టాడు. అబ్రాహామును మాత్రమే దేవుడు లక్ష్యపెట్టలేదు.  దేవుడు అబ్రహామును దీవించిందే సర్వలోకము కొరకు అని చెప్పాడు. నీ యందు భూమిమీద సమస్త వంశములు ఆశీర్వదింపబడును అని అన్నాడు. అబ్రహామును, అబ్రహాముగానే దేవుడు ప్రేమించలేదు. సర్వలోకాన్ని దేవుడు రక్షించడానికి ఒక సాధనంగా, రక్షకుడిని తీసుకురావడానికి సాధనంగా, అబ్రాహామును దేవుడు ప్రేమించాడు అది విషయం.