216. ప్రశ్న : మార్కు 7:33 లో చెవుడు, నత్తి గలవానికి స్వస్థతనిస్తున్నారు కదా! యేసయ్య అప్పుడు ఏకాంతముగా తోడుకొని వెళ్ళి చెవిలో వేలుపెట్టి, ఉమ్మివేసి నాడిని ముట్టి ఆకాశము వైపు చూసి నిట్టూర్పు విడిచి అంటే చాలా ఎక్కువగా బాధపడునట్లుగా, నీవు స్వస్థత పడుదువు అనగానే స్వస్థత పడుతాడు మరి ఇంతగా చేశారు అంటే, ఆకాశము వైపు చూసి నిట్టూర్పు విడిచారు అంటే ఏదైనా అర్థం ఉందా?

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)

జవాబు:      ఏమి లేదు ఒక విషయం ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభువువారు ఆయన మన మానవ స్వభావంలో మనతో అన్ని విషయాలలో ఆయన సహానుభావం కలిగినవాడు అని పౌలు చెప్తాడు కదా! గనుక ఇతడు అంగవైకల్యంతో ఏమేమి బాధలు పడ్డాడో అవన్నీ కూడా యేసుప్రభువారు అనుభవించాడు. యేసుప్రభువారు తమతో ఉన్నటువంటి వారి గురించి బాధపడ్డాడు.  అయ్యో వాళ్ళు ఇట్లా పంపించేస్తే మూర్చబోతారు అని అంటాడు యేసు ప్రభువువారు.  వాణ్ణి ప్రక్కకు తీసుకుపోయి, వాని జీవితంలో వాడుపడ్డ బాధలన్నీ కూడా, ఆయన సర్వజ్ఞాని గనుక, చూసి చేసి ఆ విధంగా బహుగా బాధపడి ఆయన కూడా ఒక సంఘీభావం తెలిపి, ఆయన ఆ ఒక్క సారే కాదు అనేక సార్లు తన శిష్యుల యొక్క భయాలను, ఆందోలనలనూ, బాధలనూ, వాళ్ళ అవసరాలనూ, వేదనలనూ మన వారి యావత్తు బాధలో ఆయన బాధ నొందెను అని ఉంది బైబిలులో.  ఇశ్రాయేలీయుల యొక్క బాధలన్నింటిలో ఆయన కూడా బాధనొందెను. ఆయనలో మానవుడి ప్రతీ ఫిలింగ్స్ ఉంటాయి.