218. ప్రశ్న : షేము, హాము, యాపెతు వంశావళిలో కూషుగారు హాము కొడుకు కదా.  అలా కూషుగారు ఎవరిని పెళ్ళి చేసుకొని ఉన్నారు, ఆయనకు భార్య ఎట్లా వచ్చింది? నిమ్రోదు సాతాను సంతానం కదా? ఇంతకు ముందు ఉన్న వీడియోస్లో దాని గూర్చి చెప్పండి?

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)

జవాబు:     కూషు భార్య ఎవరు? అనే ప్రశ్న ఇప్పుడు మనకు ఎవరి భార్యలు తెలియదు. మొట్టమొదట నోవహు భార్య పేరు తెలియదు. బైబిలులో ఆధారం లేదు.  బైబిల్లో లో మనం తీసుకుంటే మనకు భక్తుల పేర్లు, వారి భార్యల పేర్లు కూడా తెలియదు. గనుక కూషు భార్య నిమ్రోదును కనెను అనే విషయం కూడా నేను యుగాంతంలో రాసాను. కూషు నిమ్రోదును కనెను అనే మాట ఉన్నది. కాని నిమ్రోదు నెఫీలీయులు జీవించిన కాలంలోనే రాజ్యమును స్థాపించినాడు. నెఫీలీయులు ఎవరంటే డెబ్బై అడుగుల ఎత్తుంటారు. ఇవన్నీ నేను యుగాంతం గ్రంథంలో రాసాను. కూషు భార్యకు పుట్టినపుడు కూషు కుమారుడని ఎంచబడ్డాడు గాని, వాస్తవానికి విత్తనం కూషుది కాదు.  విత్తనం కూషు విత్తనం అయితే నెఫీలీయులనే రూల్ చేసెంత పవర్ఫుల్గా ఉండడు. యేసుప్రభువారు యోసేపు కుమారుడు అని ఎంచబడెను అని ఉన్నది. కాని యోసేపు విత్తనానికి పుట్టలేదు. కాని సమాజం దృష్టిలో ఆయన అలా ఎంచబడ్డాడు. దీంట్లో మర్మ సహితంగా, లోతైనటువంటి నిగూఢమైన విధానంలో చెప్పబడినటు వంటి మర్మము. యేసుక్రీస్తు జన్మము ఎలా మర్మమో, క్రీస్తు విరోధి జన్మము కూడా ఒక మర్మమే, అని అనేక విషయాల్లో నేను చెప్పాను.  ముందుగా మీరు యుగాంతం బుక్ చదువండి.  వీనిని గూర్చి మీకు అర్థమవుతుంది.