220. ప్రశ్న : హానోకు వరకు ఏలుబడి చేసింది. మోషే వరకు కాకూడదు అని లేదుకదా, మోషే వరకు ఏలుబడి చేసినట్టే హానోకు కూడా వచ్చాడు కదా!

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)

జవాబు:      మరణం అనేది ముందు మోషే అనుభవించాడు. మోషే చచ్చిపోయాడు సమాధి చేసినట్టు ఉంది కదా, ద్వితీయోపదేశకాండము ఆఖరి అధ్యాయంలో మరణములోనికి సంపూర్ణంగా హనోకు వెళ్ళలేదు. మరణం ఓడిపోవడం ఎప్పుడంటే మరణం యొక్క గ్రిప్ లోనికి మోషేను పంపించి దేవుడు తెచ్చాడు. మోషే మరణం అనే Experience ని అనుభవించి దేవుని శక్తిచేత మళ్ళీ బయటకి తీసుకొచ్చాడు. గనుక మరణం ఓడిపోయింది. మోషే లైఫ్ నే గాని, హనోకు లైఫ్ లో కాదు. మరణానికి కొంతమందిని అప్పగించి బయటకి తేగలగడం అనేది పునరుతానం.మరణము వాళ్ళను ముట్టుకోకుండానే చేయగలను అనేదేమొ హనోకు, ఏలియాల జీవితం. రెండు విధాలుగా దేవుని మరణాన్ని భంగం చేయగలడని చూపించాడు హనోకు లాగనే ఏలియా కూడా 1కొరింథీ 15లో మరణం అనేది మోషే తరువాత జరగక పోతే సిలువ యజ్ఞం జరుగదుగా? మరణం అనే దానికి దేవుడు వాడుకున్నాడు. మోషే తరువాత కూడా దాన్ని దేవుడు కొంతకాలం ఉండనిచ్చాడు. ఎందుకంటే దేవుడు మరణాన్ని కూడా వాడుకున్నాడు. మరణం చేత సేవజేయించుకున్నాడు 1కొరింథీ 3:22లో మరణము కూడా మీ కొరకే ఉన్నది. కీర్తన 119:91 లో సమస్తము నీకు సేవజేయుచున్నది. అని అన్నాడు. అందులో మరణం కూడా ఉంది. మరణం కూడా సేవజేస్తుంది. మరణాన్ని మొత్తం తీసివేయకుండా 1 కొరింథీ 15:26లో కడపట నశింపజేయు శత్రువు మరణము. గనుక మరణం అనే దాన్ని దేవుడు కొంతకాలం ఉండనిచ్చి వాడుకున్నాడు. మరణంతో సేవ చేయించుకున్నాడు. కనుక మరణం అనేది మేలు అన్నాడు పౌలు. మరణం అంతకుముందేమొ శత్రువుగా ఉన్నాది తరువాతనేమొ తరువాత దేవుని సేవకునిగానున్నది. మరణము అనేది దేవుడి ప్రణాళికలో ఉన్నవారికి సేవకునిగా, లేనివానికేమొ భయంకరమైన శిక్ష. మరణమా నీ ముళ్లెక్కడ అన్నాడు గాని, మరణమా నీ వెక్కడ అని అనలేదు.