221. ప్రశ్న : హైందవ గ్రంథాలను ఆధారంగా తీసుకొని మీరు హైందవక్రైస్తవం రాసారు కదా! అందులో శివతత్వం, రామతత్వం, కృష్ణతత్వం అని మీరు వెలిబుచ్చారు. అందులోని పోలికలను మీరు దేవుడితో పోల్చి ఇలా దేవలక్షణాలను పోల్చారు. కాని వీరందరు, క్రీ.పూ భూలోకానికి వచ్చారు.  అవతార పురుషులుగా అని అన్నారు? వెంకటేశ్వరస్వామి క్రీస్తు తరువాత వచ్చాడు కాబట్టి అతను కూడా అవతార పురుషుడేనా?

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)

జవాబు:      దశావతారాలలో ఒకడు వెంకటేశ్వర స్వామి కాదు. భాగవతాన్ని బట్టి, హిందూ పురాణాల్ని బట్టి కూడా కలియుగదైవము అని వెంకటేశ్వర స్వామిని అన్నారు గాని, ముందు మత్స్యవతారం, కూర్మావతారం, వామనావతరం, వరహావతారం, ఇంక ఎన్నెన్నో అవతారాలు దశావతారాల్లో ఒకటి వెంకటేశ్వరస్వామి అని హిందూపురాణాల్లోనే లేదు. ప్రాచీన గ్రంథాలలో చెప్పబడినటు వంటి అవతారపురుషులలో యేసుప్రభు పోలికలు ఉన్నవి. తరువాత మొన్నటివలే సాయిబాగారు, అందులో ముగ్గురూ బాబాలు ఒకరు శిరిడిసాయిబాబా, పుట్టపర్తిసాయిబాబా, బాలసాయిబాబా ఇంకా శిష్యసాయిబాబా కూడా రావొచ్చు మనం చెప్పలేం. గనుక కొత్తకొత్త దేవతలు వస్తూ పోవడం అనేది వారి సంస్కృతి. అలా దేవతలు అని చెప్పుకునే వారి సంఖ్య పదులలో లేదు, కోట్లలో ఉంది. గనుక అందరిలోనూ యేసుపోలికలు ఉంటాయి అనేది కాదు. దేవత అనబడే ప్రతిఒక్కర్లో యేసు పోలిక ఉంటుంది అని కాదు. ప్రధానంగా త్రిమూర్తులు బ్రహ్మా, విష్ణు మహేశ్వరా అన్నారు.  శివుడు శివతత్వమూ అన్నాను, కృష్ణతత్వం, రామతత్వం ఇవన్నీ కూడా క్రీ. పూ నాటివి. యేసుప్రభు వచ్చిన తరువాత ఇంకా సంవత్సరానికి ఒక దేవత పుడుతూనే ఉంటారు వాళ్ళకు. ఇంకా ఎన్నైనా పుట్టించు కోవచ్చు.  అది వారికి దోషం కాదు. వారి విశ్వాసం ఏమిటంటే దేవునికి పరిమితి ఏమిటండీ అని.  రాయిలో, రప్పలో, చెట్టులో, నీటిలో మనకు కనబడే ప్రకృతిలో అన్నింటిలో దేవుడు ఉంటాడు. దేవుని అంశ అన్నింటిలో ఉంటుంది. దేవుడు ఎలా తలచుకున్నా, ఎలా ఊహించుకున్నా, ఎలా పిలచుకున్నా తప్పుకాదు అనేది హిందు విశ్వాసం.  గనుక దేవతల సంఖ్యకు పరిమితి ఉండదు. ఎంతమంది అయినా, ఎవరిలోనైతే మంచి లక్షణాలు. ఉన్నాయో వారిని దేవుడిగా ఆరాధిస్తారు. శక్తులూ, అతీత శక్తులు, జ్ఞానం కనబడితే దేవుడిగా ఆరాధిస్తారు. దానికి అంతు ఉండదు ఇక. మనకు సంబంధించినది కాదు. మనకు కావాల్సినది ప్రాచీన గ్రంథాలలో చెప్పబడినటువంటి అవతారమూర్తులలో ఉన్నటువంటి వాళ్ళ వ్యక్తిత్వ లక్షణాలు, చేసిన పనులు యేసుప్రభు వ్యక్తిత్వంలో కనబడుతున్నది. దానిని మాత్రం నేను చూపించాను.  ఇదేనండీ మీరు అడిగిన ప్రశ్నకు జవాబు.