(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: దేవుని సృష్టిలో, దేవుడు సృష్టించినటువంటి మానవ సమాజములో ప్రతి వ్యక్తి కూడా ప్రత్యేకమైన, విశిష్టమైన వ్యక్తిగానే దేవుడు చేస్తాడు. కనుక మీకు పుట్టబోయే దేవుని ప్రణాళిక ఏమిటో, దేవుడు మరి కుమార్తెను, ఇస్తాడో, కుమారున్ని ఇస్తాడో, ఒకవేళ కుమారుడు, లేదా కుమార్తెను ఇస్తే సమాజంలో వారిని ఎక్కడ నిలబెట్టుకోవాలో, ఎలా వాడుకోవాలో అనేది, నియమించిన దినములలో ఒక్కటైనా జరగకముందే నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితము లాయెను అని దావీదు 139 కీర్తనలో మీరు ఆశించి పొందగలిగే ఆ ప్రణాళిక, ఆ స్థితి, ఆ అంతస్థుకంటే దేవుడు ఎన్నో రెట్లు అద్భుతమైన ప్లాన్ మీ బిడ్డపట్ల కలిగి ఉన్నాడు అని నమ్మండి. దేవుని చిత్తానికి అప్పగించుకోండి. అప్పుడు మీరు యేసుప్రభువునందు, రక్షణార్ధమైన జీవితంలో పెంచుతారు. యేసుప్రభులోనికి వచ్చి, సత్యంలోనికి వచ్చిన తరువాత వారు సీనాయి కొండ అంత ఉన్నత శిఖరంలో ఉంటారు. మీరు ఆ విషయంలో అనుమానించవద్దు. భయపడవద్దు. దేవుడు మిమ్మల్నీ, మీ పిల్లల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు.