225. ప్రశ్న : మత్తయి 12:26లో “సాతాను సాతానును వెళ్లగొట్టినయెడల తనకుతానే విరోధముగా వేరుపడును, అట్లయితే వాని రాజ్యమేలాగు నిలుచును? ఈ లోకంలో చాలా మంది దయ్యాలను వెళ్లగొట్టుట, స్వస్థపరుచుట చుస్తున్నాం కదా! So, how can we do that?

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)

జవాబు:      సాతాను పచ్చి మోసగాడు. ఇప్పుడు భూతవైద్యులు ఉంటారు. వారు దయ్యాలను వెళ్లగొడతాం అని చెప్తారు. ఆ దయ్యము వెళ్లినట్లు నటిస్తుంది గానీ వెళ్లదు. అక్కడ విషయం ఏమిటంటే Manifestation of evil spirit అనేది ఆగిపోతుంది.  ఎందుకంటే వాళ్లకి faith కలిగించడానికి ఈ భూతవైద్యుల మీద మంత్రగాళ్ల మీద విశ్వాసం కలిగించడానికి అంత సేపు భీభత్సంగా ప్రవర్తించిన దురాత్మ, వీడు మంత్రం చదవగానే వాడు వీడూ friends కాబట్టి సత్యదేవునికి వ్యతిరేకంగా వాళ్లకు నమ్మకం కలిగించడానికి భయానకంగా ప్రవర్తించి, ఆ మంత్రం చదవగానే silent అయిపోతుంది. అప్పుడు దయ్యం వెళ్లిపోయింది అనే భ్రమలో వాళ్లు ఉంటారు. అది దుష్టశక్తి. ఇది దైవశక్తి అనుకుంటారు కానీ వీరందరూ కూడా పడిపోయిన దేవదూతలే.  What’s happening is just a drama యేసుప్రభు నామంలో వెళ్లగొట్టినప్పుడు మాత్రమే అది మొత్తంగా వెళ్లిపోయేది.  మిగతా అప్పుడు Manifestation మానుకొని Silent గా ఉండడం తప్ప ఇంకేం జరుగదు.