(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: కత్తిని కొనుక్కొనమని చెప్పిన యేసే, నీ కత్తిని వరలో పెట్టుము అన్నాడు. ఇదే సందర్భం మత్తయి రాసిన విషయం చూడండి. మత్తయి 26:51,52 “ఇదిగో యేసుతో కూడా ఉన్నవారిలో ఒకడు చెయ్యిచాచి, కత్తిదూసి పట్టుకొను వారందరు కత్తిచేతనే నశింతురు”. గనుక లూకా 22:36లో యేసు కత్తి కొనుక్కొనమన్నారు. మత్తయిలో ప్రధాన యాజకుని దాసుని కొట్టి, వాని చెవి తెగ నరికెను. యేసు – నీ కత్తి వరలో తిరిగి పెట్టుము; “కత్తి 26:52లో నీ కత్తి వరలో పెట్టుమన్నాడు. ఈ రెండూ మాటలను క్రోడీకరించి చూస్తే, ఆయన బట్టను అమ్మి కత్తి కొనుక్కొనమన్నాడు కానీ కత్తి వాడమనలేదు. కత్తి వరలోనే ఉండేదానికి మరి కత్తి కొనుక్కొవడం ఎందుకు అంటే అది ఉండాలి కానీ వాడొద్దు. దానికి అర్థమేమిటంటే ఎదుటివానికి హాని చేయడానికి మనం సమర్థులంగా ఉండాలి. కానీ, హాని చేయొద్దు అనేది భావం. ఒక్క బలవంతుడు, బలహీనున్ని చాలా సేపటినుండి దుర్భాషలాడుతుంటే. ఆ బలహీనుడు పోరా నిన్ను క్షమించేసాను అంటే ఆ బలవంతుడిని ఈ చీపురుపుల్లలాంటి బలహీనుడు “క్షమించేసా” అంటే ఆ బలవంతుడు నవ్వుతాడు. నీకు చేతకాదు గనుక అలా క్షమిస్తా అంటున్నావు. నీ చేతకానితనానికి భక్తి ముసుగు వేసావ్ అంటాడు. అలా కాకుండా అదే పరిస్థతి reverse లో జరిగింది అనుకోండి. ఆ బలహీనుడు దుర్భాషలాడినా ఈ బలవంతుడు నిన్ను క్షమించాను పోరా అంటే ఒక విలువుంటుంది. బలవంతుడు క్షమిస్తే దానికి విలువ. బలహీనుడు క్షమించానంటే, అది బలహీనతగా పరిగణించబడుతుంది. గానీ గొప్ప తనంగా గుర్తించబడదు. అందుచేత, క్రైస్తవులందరూ శక్తి మంతులు కావాలి. ఆర్థికంగా, జ్ఞాన సంబంధంగా సామాజికంగా, శారీరకంగా కూడా మంచి బలం సంతరించుకోవాలి. “తలచుకుంటే ఏమైనా చేయగలం, అయినా సాత్వికులంగా ఉండి క్షమిస్తాం” అనే సందేశం ప్రజలలోనికి పంపించగలగాలి. అన్ని విధాలా మనం అణచివేయబడి, బలహీనులుగా చేతకాని వారిగా ఉంటే, “నేను క్షమిస్తున్నాను పో” అనే మాటకు విలువ ఉండదు. అది పరిహాసం పాలౌతుంది. అందుచేత బట్టనమ్మి కత్తికొనాలి కానీ వాడకూడదు. అదే నిజమైన క్రైస్తవ మనస్థత్వం, సాత్వికం, క్షమాపణ.