(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: అది కయీను హేబేలును చంపకముందు దేవుడు మాట్లాడిన మాటలు. అప్పటికి హేబేలును కయీను చంపలేదు. అక్కడ హేబెలును అతని అర్పణమును దేవుడు లక్ష్యపెట్టెను. కయీనును అతని అర్పణమును దేవుడు లక్ష్యపెట్టలేదు. అప్పుడు కయీను మొహం చిన్న బుచ్చుకున్నాడు. అప్పుడు దేవుడు ఈ మాటలు అన్నాను. నీవు సత్క్రియ చేసిన యెడల తలయెత్తుకుంటావు అంటే నీవు చేసింది సత్క్రియ కాదని ఎందుకు గ్రహించడం లేదు? నేను హేబెలును, అతని అర్పణమును అంగీకరించాను, నేను నీ అర్పణమును అంగీకరించకపోతే ఏమి అనుకోవాలి – “దేవునికి ఇది నచ్చలేదు అన్నమాట. మరి ఏమి అర్పిస్తే మంచిది? నా తమ్ముడేమో రక్తప్రోక్షణము తీసుకొచ్చాడు. బలి అర్పించాడు నేనేమో కాయగూరలు, ఈ గడ్డి తీసుకొచ్చాను ఇక్కడ రక్తం అనేది Missing. అందుచేత రక్తమును బలిపీఠం మీద ప్రోక్షిస్తే దేవునికి ఇష్టం అన్నమాట. నేను చేసిన పని సత్క్రియగా దేవుడు ఎంచలేదు. అని ఇతను గ్రహించి నా తమ్ముడు లాంటి బలి నేను కూడా తెస్తాను ప్రభువా అని ఒప్పుకుంటే బాగుండేది. నీవు చేసింది సత్క్రియ కాదు అని దేవుడు Hint ఇస్తున్నాడు. అయితే ఆ సత్క్రియ చేయకుండా నీవు ఇంకొక మార్గం ఎంచుకుంటే నీ వాకిట నీ పాపము పొంచియుండును. అప్పటికి ఆయన హత్య చేయలేదు, పాపి కాలేదు. పాపములో అడుగుపెట్టకుండా ఉండే chance అతనికి ఉండింది. “నీ యెడల దానికి వాంఛ కలుగును అది నిన్ను ఏలెను”. ఇదే మాట భార్యాభర్తలను గూర్చి కూడా అన్నాడు. హవ్వలో ఆది 3:16లో “నీ భర్తయెడల నీకు వాంఛ కలుగును; అతడు నిన్ను ఏలునని చెప్పెను!” స్త్రీ పురుషుల మధ్యలో ఈ వాంఛ ఉంటుంది. స్త్రీ భర్త లేకుండా ఉండలేకపోతుంది. గనుక భర్త ఆధిపత్యం చెలాయిస్తాడు. ఇక్కడేమో పాపమునకు నీ మీద వాంఛ కలుగును నీవు దానిని ఏలుదువనెను!” అంటే భార్యాభర్తలకు కలిగిన సంబంధం నీకు పాపానికీ కలుగుతుంది. అంటే ఇతన్ని వదిలేసి ఆ పాపం ఎక్కడికీ పోదు. నీవేమో దానిని నీ సొంత భార్యలాగా పోషిస్తావు. అది విషయం.