(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: నాలుగు జాములు రాత్రి; నాలుగు జాములు పగలు అంటే పగలు 12 గంటలు రాత్రి 12 గంటలు అని యేసు ప్రభు చెప్పారు. అంటే మూడు గంటలకు ఒక్క జాము, ఉదయము 6 నుండి 9 వరకు పగటిలో మొదటి జాము, 9 నుండి 12 వరకు రెండవ జాము, 12 నుండి 3 వరకు మూడవ జాము, 3 నుండి 6వరకు పగటిలో నాలుగవ జాము. తర్వాత సాయంత్రం 6 నుండి 9వరకు రాత్రి మొదటి జాము; 9 నుండి అర్థరాత్రి 12 వరకు రెండవ జాము, 12 నుండి 3 వరం మూడవ జాము, 3 నుండి 6 వరకు నాలుగవ జాము. అయితే “రేయి మొదటి జామున లేచి మొఱ్ఱ పెట్టుము” అనే మాట ఉంది. రేయి మొదటి జామున అంటే రాత్రి జాములలో మొదటి జామున అనే కాదు. అలా కాకుండా రేయి మొదటి జామున అంటే రాత్రిగా పరిగణించబడినటువంటి ఈ జాములలో మనుష్యులు మేల్కొనే ఆ సమయంలో first hour నీవు అందరికంటే ముందు మేల్కొని ఉండే వాడవై ఉండాలనే విషయం తప్ప రాత్రి మొదటి జామున అనేది మనం అక్షరాల తీసుకుంటే రోజంతా పడుకుని సాయంత్రం 6కి లేవవలసి వస్తుంది. గనుక మనం వ్యవహార సంబంధమైన భావం తీసుకోవాలి. తప్ప ప్రతీ దానికి అక్షరార్థంగా మనం భావం తీసుకుంటే సత్యంలోకి రాలేము.