(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: God created SEX (Gender). God created male and Female together, gave a commandment to bring for children and fill the earth with population. దేవుడు ఆదాముకు తోడుగా మగాడిని చేయలేదు. కానీ ఒక ఆడామెని చేసి మీరిద్దరు కలిసి పిల్లల్ని కనమన్నాడు. ఎలా కనాలి? కలిసి మోకరించి ప్రార్థన చేసి కంటారా? కాపురం చేసి కంటారా? అదే biological process కదా! గనుక ఇద్దరికి వేరు వేరు ఆకృతులు, శరీర అవయవాలు దేవుడు సృష్టించి మీరు కలిసి సహజీవనం చేసి శారీరకంగా, లైంగికంగా సంబంధం కలిగి ఉండి మీరు పిల్లల్ని కని భూమిని జనాభాతో నింపండి. ఇది దేవుడు చేసింది. దేవుడు పిల్లల్ని కనలేడు అనేది దేవదూషణ. కీర్తనలు 2:7లో “నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కనియున్నాను” అన్నాడు. దేవుడు ఒక కొడుకును కన్నాడు. కాలం ప్రారంభం కాకముందు అనాదిలోనే అప్పుడు స్త్రీ లేదే మరి. మానవునికి / పురుషునికి సంతానం కావాలంటే ఒక స్త్రీ కచ్చితంగా కావాలి. లేకపోతే ఎట్టి పరిస్థితిలోను పిల్లలు పుట్టడానికి అవకాశం లేదు. కానీ దేవునికి అలా కాదు. ఆయనకు already కుమారుడు ఉన్నాడు. కాబట్టి ఆయన కుమారుడిని కనలేడు అనకూడదు.మ. అది దేవదూషణ. There’s nothing God cannot do.