236. ప్రశ్న : రాబోవు వాడవు నీవేనా అని యోహాను ఎందుకు అడిగాడు యోహానే మొదటి అధ్యాయంలో పరిచయం చేస్తూ “ఇదిగో లోకపాపములను మోసుకొని పోవు దేవుని గొఱ్ఱపిల్ల” అని ఇదంతా తెలిసికూడా రాబోవు వాడవు నీవేనా ఇంకొకరికొరకు ఎదురుచూడాలా అని ఎందుకు అడిగాడు?

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)

జవాబు:      ఎంత మహా భక్తుడైన depression అనే దానికి అతీతుడు కాదు. ఏలియా యొక్క ఆత్మయు, శక్తియు గలవాడు యోహాను. work stress, situatonal stress, spiritual warfare, ఆధ్యాత్మిక పోరాటం వల్ల కలిగే ఒత్తిడి గానీ too much గా పెరిగి పోయినప్పుడు మానసికంగా stress వస్తుంది. అయితే యోహానుకు పేరు పెట్టెటప్పుడు యోహాను అని పలక మీద రాసి వెంటనే జెకర్యా నాలుక సడలి దేవుని స్తుతించడం అందరూ దేవుని మహిమ పరచిరి అని ఉంది. ఈ శిశువు సామాన్యుడు కాడు అని ఆ మాట ఆ నోటు ఈ నోట ప్రాకిపోయింది. తల్లీ తండ్రీ చనిపోయాక ఈ పిల్లవాన్నీ essenes అనీ ఒక తెగ వారు పెంచారు. ఆ తెగవారు బహునిష్ట గలిగిన పరిసయ్యులు.  అక్కడ పెరిగిన ఈయన లేఖనాలను ఎరిగినవాడు.  ఆయన జీవితానికి ఉన్న ఒకే ఒక్క లక్షం రక్షకుడిని పరిచయం చేయడం. బాప్తిస్మం ఇచ్చుటకు నన్ను పంపినవాడు ఇలా చెప్పాడు అని సాక్షమిచ్చాడు. అంటే దేవుడు ఆయనతో మాట్లాడి నిన్ను ఇందుకే పుట్టించాను, నా అవతారాన్ని లోకానికి చూపించాలి. ఆయన ఒక ఆరు నేలలు సేవ చేసాక హేరొదియ పగబట్టి ఆతన్ని చెరలో వేయించారు. ఈ యోహాను ఏమి అనుకున్నాడంటే నా రక్షకుడు Jail కి వచ్చి నన్ను పరామర్శిస్తాడు అని ఆశించాడు. సరే రక్షకుడు చాలా busy ఒక శిష్యుడినైనా పంపాలి అని ఆశించాడు.  కానీ ఆయన రాలేదు.  ఒక శిష్యుడిని పంపలేదు.  కనీసం కలలోనైనా రాలేదు. నా ప్రాణాలకు హామీ లేదు. నిజంగా ఆయన రక్షకుడు ప్రభువైతే ఆయన కొరకు నేనింత తెగిస్తే ఒక్కసారి కూడా పలకరించడా అని ఆలోచించి, ఆయనకు depression వచ్చి “రాబోవు వాడవు నీవేనా” అని అడిగాడు.  ఆయన కూడా మనలాంటి మనిషే గనుక depression లో ఆయన ఆ మాట అన్నాడు. మనం కూడా అప్పుడప్పుడూ దేవునికి అలాగే ప్రార్ధన చేస్తాం. నేను అడిగింది ఏది నువ్వు ఇవ్వడం లేదు ఇదేనా ప్రేమా? ఇదేనా త్యాగం? అని మళ్లీ పడుకుని next day కి మనస్సు మారిపోతుంది. మనిషి ఎప్పుడూ stable గా ఉండడు. ఎంత మహాభక్తుడైనా under weight of stress అలా అయిపోతుంది. ఎందుకు అలా అడిగాడు అంటే ఆయన expect చేసినట్లు రక్షకుడు చేయలేదు కాబట్టి. అదీ విషయం.