(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: ఆ రెండూ వేరు వేరు సందేశాలు. “పురుష సూక్తం” లో ఉన్న విషయం ఏమిటంటే అసలు కాలమే దేవుడని కాలము అనే దాంట్లో ఉన్న విభిన్న భాగాలు ఈ ఋతువులు. కాలము అనే గర్భం లోపల ఈ ఋతువులన్నీ ఉన్నాయి. గనుక ఇవి యజ్ఞ పురుషుడైన వానికి, కట్టెలు లేకుండా యజ్ఞం జరగదు. గనుక ఒక ఋతువు కట్టెలు, ఒక ఋతువు అగ్ని, ఇలా ఆపదించి రాయడం పురుషసూక్తంలో విషయం. అదొక వేదాంతపరమైన అంశం. కాలాత్మకుడైన పురుషుడు ఆ కాలంలో ఈ భాగములు అన్నీ ఉన్నవి. ఈ కాల పురుషుడే రేపు యజ్ఞం కూడా అవుతాడు. కాల పురుషుడు యజ్ఞం అయినప్పుడు యజ్ఞానికి కట్టెలు కావాలి. అగ్ని కావాలి ఇతరితర కావాలి. ఈ ఋతువుల్లో ఒకటి అగ్ని లాగా పని చేస్తుంది, ఒకటి కట్టెలు లాగా పనిచేస్తుంది. ఇవి లేకుండా యజ్ఞం జరగదు. చాలా లోతైన వేదాంతపరమైన Prevelation ఆ పురుషసూక్తంలో చెప్పారు. కానీ బైబిల్లో ఉన్నది totally వేరే విషయం. బైబిల్లో ఉన్నది. ఏమిటంటే అంతకుముందు భౌతికప్రపంచంలో ఋతువులు లేవు. అంతా సమసీతోష్ణంగా ఉంటుంది. అంతరిక్షంలో నుండి వచ్చే Ultra Violet లాంటి హానికరమైన కిరణాలు రాకుండా filter చేయబడి ఒక చల్లని కాంతి, వేడి filterout అయ్యేటట్లు భూగ్రహం చుట్టూ ఒక నీళ్ల పొర దేవుడు ఏర్పాటు చేసాడు. అయితే జలప్రళయంలో ఆకాశపు తూములు విప్పబడ్డాయి. అప్పుడు భూమి చుట్టూ ఉన్న నీటి పొర పోయింది. ఆ తర్వాత సూర్య కిరణాలు direct గా భూమ్మిద పడుతున్నాయి. దాని వల్ల రకరకాల వ్యాధులు సోకడం జరిగింది. ఎప్పుడైతే ఈ నీళ్ల పొర పోయిందో అప్పుడు భూమ్మిద ఋతువులు ఏర్పడ్డాయి. ఈ ఖగోళ చక్రపరిభ్రమణం ద్వారా భూమి మీద వాతావరణ స్థితిగతులు వేరు వేరుగా ఉంటాయి. అనే సంగతి దేవుడు ఇక్కడ చెబుతున్నాడు. ఇక్కడేమో భౌతికంగా భూలోకంలో ఋతువులు ఎందుకు ఏర్పడ్డాయో చెబుతున్నాడు. పురుషసూక్తంలో కాలపురుషుడు, విరాట్పురుషుడు యజ్ఞం అయినప్పుడు ఆయనకొరకు, ఆయనే కాలం గనుక యజ్ఞంలో అవసరమైన భాగాలుగా ఆయా ఋతువులు పనిచేస్తాయి అనే నిగూఢమైన వేదాంత మార్మాన్ని పురుషసూక్తంలో చెప్పాడు. అదీ విషయం.