243. ప్రశ్న : మీ “అంతరిక్షంలో బుద్ధిజీవులున్నారా” అనే పుస్తకంలో దేవదూతలు జంతువులతో సంపర్కం జరుపుట ద్వారా dinosaurs పుట్టి యుండవచ్చు అన్నారు. అలా అయితే వాటి కాలం బి.సి. 4000 సంవత్సరాలు మాత్రమే అయి ఉండాలి కానీ dinosaurs కాలం లక్షల సంవత్సరాలు అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దాన్ని గూర్చి వివరణ ఇవ్వగలరు?

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)

జవాబు:      దేవదూతలు దిగివచ్చి ఇతర. జీవులతో సంపర్కం చేయడం అనేది ప్రాచీన యుగాలలో కూడా జరిగియుండవచ్చు. నా పుస్తకంలో ఏమి రాసాను అంటే దేవదూతలు అనేక batch లుగా లూసీఫర్ తప్పుచేయకముందు పడిపోయిన వాళ్లు ఉన్నారని నిరూపించాను. లూసీఫర్ పడిపోయిన వారిలో మొదటివాడు కాడు.  వాడు పాతాళంలోకి పడిపోతున్నప్పుడే కొంతమంది అక్కడి నుండి లేచి నువ్వు కూడా మా లాగా పడిపోయావా అన్నారు. అనే సంగతి యెషయా 14లో వ్రాయబడింది. గనుక ప్రాచీన యుగాలలో కూడా ఈ ప్రక్రియ జరిగియుండవచ్చు.  అప్పుడు అవి పుట్టియుండవచ్చు. వీటికి Radio carbondating method ద్వారా ఈ ఎముకల యొక్క వయస్సు నిర్ణయిస్తున్నారు. అంటే ఆ carbon లో ఉండే radiation ఎంత ఖర్చు అయిపోయింది, ఎంత ఖర్చుకావడానికి ఎంత టైమ్ పట్టింది అనేది Carbon dating method Erich Von Daniken e German The Charriots of Gods & book రాసారు. ఆ book లో Radio Carbondating అంత Accurate కాదు.  పదివేల సంవత్సరాల నుండి ఎక్కువ ఎంత దూరం ఉన్నా సరే ఒకే రకమైన Reading వస్తుంది అనే words. అక్షరాల ఆయన “The Charriots of Gods” అనే book లో రాసారు. పదివేల సంవత్సరాల పాతది ఒకటి ఉన్నది అనుకోండి, యాభైవేల క్రితంది ఏదైనా ఉంది అనుకోండి. దానికీ దీనికి Radio Carbondating లో ఖర్చు అయిపోయిన Radiation Same Reading ఉంటుందంట. మీరు ఆ book చదవండి. గనుక దేవుడు సృష్టించిన ఈ సృష్టిలో “జ్ఞానుల జ్ఞానమును వ్యర్ధపరచెదనని” దేవుడు అన్నాడు కదా! గనుక వారికి దొరకకుండా దేవుడు ఒక నాలుగువేల యేండ్ల క్రిందటి ఎముకలో లక్ష సంవత్సరాల Radio Carbon ఖర్చు అయ్యేటట్లు దేవుడు చేయగలడు. గనుక ఈ మూడు ఉన్నాయి.

1. ఆదాముతో ప్రారంభమైన యుగంకంటే ముందు అటువంటి సంపర్కం జరిగియుండవచ్చు.

2. ఈ dating అనేది శాస్త్రవేత్తలది correct కాకపోవచ్చు.

3. గనుక ఏది ఏమైనా పడిపోయిన దేవదూతలు జంతు సంపర్కం చేసారు వాళ్లను చూసి ఆ కనాను దేశంలో ఉ oడే నివాసులు కూడా జంతువులతో సంపర్కం చేసారు అని బైబిల్లో ఉంది. దాన్ని దేవుడు నిషేదించాడు.

అదీ విషయం.