246. ప్రశ్న : మీ “పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానం” అనే గ్రంథంలో దేవుడంటే చాలా మంది నిరామయుడు, నిర్గుణుడు అంటారు కానీ అది కాదు అని రాసారు కదా! మరి మీరు రాసిన “ఏమి దాచగలను ప్రభువా” అనే పాటలో నిరామయ అని రాసారు. కదా!

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)

జవాబు:      నిరామయుడు అంటే సమస్య లేనివాడు అని అర్థము. అది తప్పు అని నేను చెప్పాను. దేవునికి సమస్య లేకపోవడం ఏమిటి “విశ్వచరిత్ర” “దేవుని విశ్వ ప్రణాళిక” చదవండి అసలు సృష్టి ఆరంభం కంటే ముందే నిత్య చీకటి అనే సమస్య దేవునికి ఉన్నది. ఆ నిత్య చీకటి అనే సమస్యను పరిష్కరించుకోవడానికే దేవుడు సృష్టి అంతా మొదలు పెట్టాడు. గనుక దేవుడు నిరాకారుడు అన్నమాట తప్పు ఆకారం ఉన్నవాడే దేవుడు నిర్గుణుడు అనే మాట తప్పు గుణం ఉన్నవాడే. దేవుడు నిరామయుడు అనే మాట కూడా తప్పు.  ఆయనకు సమస్యంటూ ఒక్కటి ఉన్నది అనేది. నేను అప్పుడు చెప్పిన విషయం అయితే యేసు క్రీస్తు ప్రభు వారు అవతరించిన తర్వాత. దేవునికి ఉన్న సమస్యలకు పరిష్కారం యేసు ప్రభువారు సమస్యతో ఆయన చరిత్రను మొదలు పెట్టాడు.  ఆ సమస్యను పరిష్కరించే ప్రణాళికలో భాగంగానే దేవదూతలను చేసాడు.  తర్వాత మనుషులను చేసాడు.  తర్వాత తానే మనిషై భూమి మీదికి వచ్చినప్పుడు మనుషుల సమస్యలే కాదు దేవుని సమస్య కూడా పరిష్కారం అయింది. గనుక యేసుప్రభు యజ్ఞంలో మానవుడు విశ్రాంతి పొందడమే కాదు దేవునికి కూడా క్రీస్తులో విశ్రాంతి ఉంది. యేసు ప్రభు అవతారం ద్వారా దేవుడు నిజంగానే సమస్య లేనివాడు అవుతున్నాడు. వాళ్ల Concept ఏమిటంటే దేవునికి మొదటినుండే సమస్య లేదని మన Concept ఏమిటంటే మొదట ఉండిన సమస్య క్రీస్తు అవతారం ద్వారా దేవునికి పరిష్కారం అయింది అనే మన Concept. దేవునికి ఎప్పుడూ కూడా సమస్య లేదని వాళ్ల ఉద్దేశ్యం. సమస్య ఉన్నది సృష్టి చేయుట, సృష్టి పతనము మళ్లీ విమోచించుట ద్వారా ఈ క్రమంలో దేవుడే మనిషి కావడం ద్వారా ఉండిన సమస్య ఇప్పుడు తీరిపోయింది అనేది మన సువార్త.