(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: ఎవడును మీకు బోధింపనక్కరలేదు అంటే అసలు బోధకులు అనేవారే ఉండొద్దని. అలా ఒక సిద్ధాంతం ఉన్నది. అందరూ రాజులైన యాజకసమూహమే గనుక అపోస్తలులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు అవసరం లేదు. వాళ్లు ఒకప్పుడు ఉండిరిగాని ఇప్పుడు అయిపోయిందని ఆ సిద్ధాంతం వారి వాదన.
అయితే మనం 1 యోహాను 2:22 నుండి చూస్తే “యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప అబద్ధికుడెవడు? తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి కుమారుని ఒప్పుకొనని ప్రతీవాడును తండ్రిని అంగీకరించువాడు కాడు, కుమారుని ఒప్పుకొనువాడు తండ్రిని అంగీకరించువాడు, అయితే మీరు మొదట నుండి దేనిని వింటిరో అదే మీలో నిలుచుచున్నది, మీరు మొదటనుండి వినినది మీలో నిలిచిన యెడల, మీరు కూడా కుమారుని యందును తండ్రియందును నిలుతురు. నిత్యజీవము అనుగ్రహింతు ననునదియే ఆయన తానే మనకు చేసిన వాగ్ధానము. మిమ్మును మోసపరచు వారిని బట్టి ఈ సంగతులు మీకు వ్రాసి యున్నాను. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక ఎవడును మీకు బోధింపనక్కరలేదు. అదీ విషయం. సరిగ్గా అర్థం కావాలంటే పూర్వాపరాలు చదవాలి.
ఇక్కడ క్రీస్తును తృణీకరించే ఆత్మ ఒకటి ఈ లోకంలో పనిచేస్తుంది. ఎవరైతే దేవ కుమారున్ని తృణీకరించారో దేవున్ని కూడా తృణీకరించినట్లే. కుమారుడు మనకు అక్కరలేదు కానీ తండ్రి కావాలి అని చెప్పే వాళ్లు ఉన్నారు. అది మోసం అని క్రీస్తును అంగీకరించుటే త్రియేక దేవున్ని అంగీకరించుట. క్రీస్తును నిర్లక్ష్యం చేసి దేవ భక్తి సాధన సాధ్యం కాదు. అని విషయాన్ని చెబుతూ మీ మీద ముందే అభిషేకం ఉన్నది. గనుక ఈ point మీకు ఎవరూ చెప్పే అవసరం లేదు మీకు ముందే తెలుసు అన్నాడు. అంతే గాని ప్రసంగీకులే వద్దని కాదు. దీని Contextual గా తీసుకోవాలి. తప్ప దీనిని బట్టి అసలు బోధకులే వద్దు అంటే బైబిల్లో నుండి ఎఫెస్సీ 4:13 కొట్టివేయాలి. కొట్టేస్తామా? మరి అందుచేత ఇది Contextual గా చెప్పుకోవాలి తప్ప, దేవుడు అనేకమంది బోధకులు, ప్రవక్తలను ఇచ్చిన తర్వాత ఏ బోధకుడు అక్కరలేదు అని దేవుడే తన్నుతాను ఖండించుకొని మాట్లాడడు కదా. క్రీస్తును అంగీకరించుట అనే విషయము మీకు ఎంత అవసరమో మీకు ఎవరు చెప్పడం అక్కరలేదని అర్థం.