248. ప్రశ్న: యేసుక్రీస్తు ప్రభు రెండవ సారి వచ్చేటప్పుడు గుర్రంమీద వస్తాడని ఉన్నది కదా! ఆ గుర్రం ఎక్కడిది? అది భూమి మీద ఉన్న గుర్రమా?

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)

జవాబు:      అది పరలోకపు గుర్రం పరలోకంలో గుర్రాలు ఉన్నాయి. ఏలియాను తీసుకువెళ్లడానికి, అగ్ని రథములు, గుర్రములు వచ్చాయి. ఎలీషా పర్వతం చుట్టూ కూడా మొత్తం రథములతోను గుఱ్ఱములతో దేవదూతల సైన్యం నిండియున్నది, ఎలీషా ఉన్న పర్వతం చుట్టురా.  గనుక పరలోకంలో జంతు జాతి ఉన్నది. అక్కడ గుఱ్ఱాలు ఉన్నాయి. ఆ గుర్రాలు గ్రహాంతర యానాలు చేస్తాయి. అవి అక్షయ దేహాలు కలిగిన గుఱ్ఱాలు.