249. ప్రశ్న : హెబ్రీ 13:12లో “కావున యేసు కూడ తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమపొందెను”. అని ఉంది. అసలు అక్కడ గవిని అంటే ఏమిటి?

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)

జవాబు:      గవిని వెలుపల అంటే పట్టణము వెలుపల. పట్టణానికి ఒక కోట ప్రాకారం, పట్టణానికి గవిని ఉంటుంది కదా! ఆయన వెలివేయబడ్డాడు అనే భావం అది. మనము కూడా అన్నాడు కదా (13లో) “మనము కూడా ఆయన నిందను భరించుటకై. “ఆయన నిందను భరించుచు, శిభిరము వెలుపలికి ఆయన యొద్దకు వెళ్లుదము” అదీ మనం ఇప్పుడు చేయాల్సిన పని. ఆయన శిభిరం వెలుపల ఉన్నాడు.  మనం కూడా అక్కడికి వెళ్లాం అంటున్నాడు. మీరు విజయవాడలో ఉన్నారు, నేను హైదరాబాద్లో ఉన్నాను. నేను హైదరాబాద్ బయటికి వెళ్తే యేసయ్య ఉంటాడా? మీరు విజయవాడ బయటికి వెళ్తే యేసయ్య ఉంటాడా? అందంతా ఉపమానంగా, ప్రతీకాత్మకంగా చెప్పిన విషయం ఏమిటంటే ఊరిలో నుండి వెళ్లగొట్టబడిన అనుభవం. ఊరిలో వాళ్లందరూ వెలివేసిన అనుభవం ఆ అనుభవం లోనికి, ఆ పరిస్థితిలోనికి యేసయ్య వెళ్లిపోయాడు.  ఆ అనుభవంలోనికి మనం కూడా వెళ్లాలి. వెళ్లితే అక్కడ మనకు యేసు దొరుకుతాడని సమాజంలో కలిసిపోయి ఉన్నప్పుడు మనం యేసు దగ్గరికి చేరలేము సమాజము చేత వెళ్లగొట్టబడినప్పుడే యేసుకు సన్నిహితంగా రాగలుగుతాం. అక్కడ గవిని అనేది పట్టణం నుండి వెళ్లగొట్టబడుతున్న ఒక స్థలాన్ని చూపిస్తుంది. అందరూ బరబ్బాను కోరుకున్నారు.  కానీ యేసును వెలివేసారు అలాంటి పరిస్థితి మనకు కూడా వస్తుంది.  మనల్ని వద్దూ అని అందరూ అంటారు. ఆ నిందను భరించుచు మౌనంగా బయటికి వెళ్లిపోదాము.  అక్కడ యేసయ్య మనకు దొరుకుతాడు అనే సందేశం.