(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: క్రైస్తవ సంఘం ఆచరించవలసిన సిద్ధాంతము, క్రమము మనకు పునాది వేయడానికి దేవుడు పౌలు భక్తుడిని నియమించాడు. యేసు ప్రభు వారు చేసిన పనులు క్రైస్తవ సంఘంగా మనం చేయాలి అనుకుంటే యేసు ప్రభు ఎనిమిదో దినమున సున్నతి పొందాడు మనం అదికూడా పొందాలి. యేసు ప్రభు వారు సిలువ యజ్ఞం చేసిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు దిగివచ్చి అపోస్తలులను ఆయన పంపించి వారికి ఒక బోధను బయలు పరచినప్పుడు సంఘానికి పునాది ఏర్పడింది. గనుక మనము అపోస్తలులు చేసిన ప్రకారం చేయాలి. మనకు మాదిరి చూపడానికి ఆదివారం ప్రభుబల్ల పౌలు ఆచరించి చూపించాడు గనుక ప్రతీ ఆదివారం ఆచరిస్తున్నాము. అంతకన్నా ముందు జరిగినది నన్ను ప్రతీ గురువారం చేయమని కాదు. అసలు ప్రభురాత్రి భోజనం ఎందుకంటే యేసు ప్రభు అన్నారు – నేను మరలా వచ్చువరకు ఈ ప్రకారం చేసి నా మరణమును ప్రకటించుమన్నాడు. మరణమును ప్రచురించుట ఆదివారం ఎందుకు చేస్తున్నాం అంటే పునరుత్థాన దినం గనుక ఆ రోజు ఎందుకు Important అంటే యేసు లేచిన దినం. ఈ రొట్టె విరచుట ఎందుకంటే యేసు ఇలా విరవబడ్డాడు మరణించాడు అని. ఆదివారము రొట్టెవిరచుట అంటే పునరుత్థాన దినమున మరణమును ప్రచురించుట. ఆదివారం రొట్టె విరిస్తే మరణం యొక్క సాక్ష్యం, పునరుత్థాన యొక్క సాక్ష్యన్ని రెండూ కలిసి ఉంటాయి. అది గురువారం చేస్తే ఉండదు.