(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: చైనా ఏదో తప్పుచేసినందుకు అలాగే చైనా ప్రధాని క్రీస్తును దూషించినందుకు వచ్చింది అనేందుకు ఇవన్ని తొందరపాటు వ్యాఖ్యలు. చైనాలో వైరస్ కూడా తగ్గి పోయింది, అదేదో దేశమంత తుడిచిపెట్టుకు పోయేటట్టుగా లక్షలమంది చనిపోయేటట్టుగా ఏమి అవ్వలేదు. ఆ వైరస్ని Detect చేసారు. అంత్యదినాలలో కొన్ని జరుగుతాయి అవేంటంటే నేనే దేవున్ని అని చెప్పుకునేవారు, యుద్దములు, యుద్ధసమాచారములు, అబద్ధక్రీస్తు, తెగుళ్లు ఇవన్నీ కూడా యేసు ప్రభు రెండవరాకడకు ముందు జరుగుతాయి. అందులో తెగుళ్లు అంటే కంట్రోల్ చేయలేనటువంటి జబ్బులు, ఇంకా కొన్ని మరణకర సంబంధమైన జబ్బులూ కూడా వస్తాయి. అవన్నీ కూడా యేసు రాకడకు సిద్ధపడమని చెబుతున్నాయి తప్ప చైనా ఒక్కటే తప్పుచేయలేదు.
యేసు క్రీస్తుని అంగీకరించకుండా ప్రతి వ్యక్తి తన హృదయాన్ని కఠిసపరుచుకుంటున్నాడో ఆ ప్రతి వ్యక్తి తప్పేచేస్తున్నాడు. వారికి కచ్చితంగా నిత్యత్వంలో శిక్ష ఉంటుంది. నిత్యత్వంలో ఎందుకు దేవుడిచ్చే రక్షణను త్రోసివేస్తున్నారు కాబట్టి. ఇకపోతే కొన్ని దేశాలనే దేవుడు శిక్షించడం కొన్ని దేశాలే తప్పుజేసాయ్ వాళ్ళకే తెగుళ్లు అంటే రెండవ రాకడలో అన్ని దేశాలకు తెగుల్లు వస్తాయ్. కాబట్టి ఆ కరోనా గురించి issue చేయడం భావ్యం కాదు.