(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: ఈ ప్రశ్న అడిగిన వారికి చరిత్ర తెలియదు అని అర్థం. అసలు రామున్ని క్రైస్తవులు ద్వేషించాల్సిన అవసరం ఏమున్నది? ఎందుకు ద్వేషించాలి? పురాణాలు రాశారు. పురాణాలు ఏంటంటే జరిగినటువంటి మూలకథ కొంచెం ఉన్నది దాన్ని కొంత అతిశయోక్తులతో కలిపి వాళ్లు ఆ పరిణామానికి వ్రాసుకున్నారు. ఇది వాస్తవం. ఇప్పుడు అయోధ్య అనే నగరం ఉత్తరప్రదేశ్ (UP) లో ఉన్నది. అయోధ్య అనే నగరం వాల్మీకి రామాయణంలో ప్రస్థావించబడింది, వాళ్లు సూర్య వంశపు రాజులు అని చెప్పు కోవడం జరిగింది. ఇశ్వాకు అనే వంశం అనేది ఒకటి చరిత్రలో ప్రస్థావించడం జరిగింది. వాళ్లు మా వంశానికి మూలకర్త సూర్యుడు అని చెప్పుకున్నారు. అలాగే చంద్రవంశపు రాజులు మన భారతదేశాన్ని ఏలారు. వాళ్లు ఏం చెప్పుకున్నారంటే మా వంశం చంద్రునికి పుట్టారు. చంద్రుడుమా మూలపురుషుడు అని చెప్పుకున్నారు. చంద్రునికి పుట్టాము అని మరియు సూర్యునికి పుట్టాము అని చెప్పుకున్నవారు ఉన్నారు. ఈ రెండు వంశం వారు అయోధ్యను ఏలారు. అయోధ్యను “సాకేతపురం” అని అన్నారు. అలా అయోధ్యని రాజధానిగా చేసారు. మనం దీన్ని చరిత్రగా చూస్తే శ్రీరాముడు అనేరాజు మంచి నడవడిక గల రాజు. నీతిగా నడుచుకోవాలి, తప్పుచేయకూడదు, పరస్త్రీని ఆశించవద్దు, అసత్యం ఆడకూడదు. అనే మంచి ఆశయాలు గల ఒక రాజు బి.సి. 1000 సం॥లో జన్మించాడు. తరువాత రామున్ని దేవున్ని చేసారు బుద్ధునిలాగా. ఎలాగంటే విష్ణుమూర్తే రాముడిగా పుట్టాడు, విష్ణుమూర్తే బలరాముడిగా పుట్టాడు, బుద్ధుడిగా కూడా పుట్టాడు అని అంటారు.
రాముడు ఎప్పుడు నేనే దేవున్ని అని చెప్పలేదు, నన్ను ఆరాధించండి అని చెప్పలేదు, నేను మీ పాపాలు క్షమిస్తా అని చెప్పలేదు. ఆయనకు ఆ రోజుల్లో తెలిసిన నీతిని అనుసరించి నడుచుకున్నాడు. అలాంటిది ఆయన్ని దేవున్ని చేసారు. రాముడు అనే చారిత్రిక పురుషుడు ఉండే ఉంటే ఆయన చేసిన తప్పేమి లేదు. తనకు తెలిసినంతవరకు యజ్ఞ, యాగాలను నమ్మాడు గనుక రక్తప్రోక్షనను నమ్మినట్టే. యజ్ఞం అనగా రక్తప్రోక్షణం లేకుండా దేవున్ని చేరలేం అని విశ్వసించడమే యజ్ఞం. ఆయనది ఏం తప్పులేదు. తన నీతిని బట్టి ఆయన జీవించాడు. నోవాహు జలప్రలయంలో అవిధేయులు చనిపోయి పరదైసులో ఉన్నప్పుడు వారిదగ్గరకు యేసయ్య వెళ్ళి బోధించాడు. అలాంటిది వారే పరదైసుకు వెళ్ళితే రాముడు ఎందుకు వెళ్ళడు? అంటే రాముడు నేను దేవున్ని అని చెప్పుకోలేదు. గనుక ఆయన నరకంలో ఉండడు. బుద్ధుడు కూడా ఏ తప్పు చేయలేదు. దేవుడు ఉన్నాడో, లేదో తెలియదు, ఉంటే ఉండచ్చు లేకపోతే లేకపోవచ్చు. దేవున్ని ఒకవేళ ఉంటే ఆయన్ని తెలుసుకోలేం గనుక ఆయన పేరుమీద మనం కొట్టుకోవడం, చంపుకోవడం, ఒకరినొకరం దూషించుకోవడం ఎందుకు? దేవున్ని తెలుసుకోవడం కన్న ఒకరినొకరం ప్రేమించుకోవాలి. ముఖ్యంగా కనబడుతున్న మనిషిని ప్రేమించు అతనికి ఏ హాని చేయకు, అని చెప్పాడు, అదే బైబిల్లో కూడా ఉంది “తను చూచుచున్న మనిషిని ప్రేమించలేని వాడు, చూడని దేవున్ని ప్రేమించలేడు”. కాబట్టి బుద్ధుడు తన మరణపడకలో ప్రవచించాడు. ఏమని అంటే “నేను నా జీవితాంతం దేవున్ని అన్వేషిస్తూ జీవించాను. కాని నాకు సత్యం అర్థంకాలేదు. కాని ఇప్పుడు నాకు మనసులో ఒక జ్ఞానం ఉదయిస్తోంది, “నేను చనిపోయిన తరువాత 500 సంవత్సరాల తరువాత పాలస్తీనాలో భూమధ్య పురంలో ‘మెతయా’ అనే వ్యక్తి అవతరిస్తాడు, మహాబుద్ధుడు పుడుతాడు. ఆయన్ని ఆ దేశప్రజలు “మెస్సయ” అనే పేరు అక్కడి పాళి భాషలో మెతయగా అయ్యింది. అయన మీకు మోక్షమార్గం మీకు ఉపదేశిస్తాడు అని చెప్పి మరణించారు అని కొన్ని బౌద్ధ కథలు ప్రచురణలో ఉన్నాయి. అలాగే కొందరు పండిత్ ఫ్రాన్సిస్ గారు కొందరు భక్తులు చెప్పారు.
ఒక ఆసక్తి కరమైన విషయం ఏమిటంటే శ్రీలంకలో main బౌద్ధ సాహిత్యం దొరికే ప్రాంతానికి నేను వెళ్ళాను. వెళ్ళి నాకు “దిగానిక” అనే గ్రంథము కావాలి అని అడిగాను, ఎందుకు మీరు క్రైస్తవుడా? అని అడిగారు, నాకు బౌద్ధ మతానికి సంబంధించి గ్రంథం కావాలి అని అడిగాను దాన్ని పరిశోధించాలి నేను అని అన్నాను. లేదు క్రైస్తవులకే గ్రంథం కావాలి. ఆ బుక్కులోని బుద్ధుడు చెప్పిన క్రీస్తుని గూర్చిన ప్రవచనం ఉంటుంది అని అన్నారు.
అలాగే కాశీలోని వేదవిశ్వవిద్యాలయంకి నా శిష్యున్ని పంపించా, ఎందుకంటే “తాండియ మహా బ్రాహ్మణం” గ్రంథం కావాలి అని అడిగితే ఎందుకు మీరు క్రైస్తవులా! మీకు ఆ గ్రంథం ఇవ్వం అన్నారు. ఎందుకంటే క్రైస్తవులకు సంబంధించే క్రీస్తుని గూర్చిన ప్రవచనాలు ఉన్నాయి. మరియు క్రీస్తు సువార్తని establish చేసే ప్రవచనాలు ఉన్నాయని వాళ్లకి తెలుసు. ‘దిగానిక’ గ్రంథంలో క్రీస్తుని గూర్చిన ప్రవచనాలు ఉన్నాయని తెలుసు. కాబట్టి యేసుని గూర్చిన సత్యం బుద్ధుడు తెలుసుకున్నాడు. తన మరణపడకలో అలాగే పరదైసులో యేసుని కలిసే ఉంటాడు. బుద్ధున్ని దేవుడిని చేసినవారు మాత్రం పరదైసుకు రారు.