253. ప్రశ్న : ఎస్తేరు అనే ఆవిడ అమెరికాకు వెళ్ళి బైబిలు కాలేజీలో పరిశోధన చేసి యేసుప్రభువే లేడు అని అంటుంది కదా.  ఇది ఎంతవరకు సమంజసం. యేసుప్రభు దేవుడే కాడు అని నాకు కొన్ని ఆధారాలు దొరికాయి అని interview’s ఇస్తుంది, అలా సాధ్యపడుతుందా?

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)

జవాబు:      యేసుప్రభు దేవుడే కాడు అనుటకు ఆమెకి ఏం ఆధారాలు దొరికాయి? ఆమె బైబిల్ కాలేజీలో చేరినాక నాకు వచ్చిన ప్రశ్నలకి వాళ్లు ఎవరు సమాధానం చెప్పడంలేదు కనుక యేసు దేవుడు కాడు అంటున్నావ్ మరీ ముక్కుసూటిగా నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా, నీవు నమ్మిన హిందుమతంలో నీకు ఏం ప్రశ్నలు రాలేవా! ఎవరు సృష్టికర్త అని ప్రశ్న రాలేదా? ఇద్దరు మగవాళ్ళకే అయ్యప్ప ఎలా పుట్టాడు అని ప్రశ్నరాలేదా? ఒక పురుషుడు ఎలా కన్నాడు? మాంధాత విషయంలో ప్రశ్నరాలేదా? చెవుల్లోంచి ఎలా పుడతాడు అని రాలేదా? ప్రశ్నలు లేని మతం ఏది ఉండదు.

                ఆమె క్రిస్టియన్ నుండి వెళ్ళింది కదా! మరి హిందు మతంలోని అనేకమంది హిందుమతం మీద నమ్మకం ఉండి, తమ మతంకోసం మా ప్రాణాలైనా ఇస్తాం.  అవసరమైతే ప్రాణాలు తీస్తాం అని అన్నవాళ్లు చాలా మంది క్రీస్తు సువార్త ప్రకటిస్తూ ప్రాణాలు విడిచారు. క్రీస్తుని నమ్మి రక్షకునిగా అంగీకరించి బైబిల్ చదివి నాస్థికులం అయ్యాం, అని చెప్పిన వారు కొందరు ఉన్నారు. నాస్తికత్వం నుండి దేవున్ని తెలిసికొని ఎంతోమంది కరుడుకట్టిన ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నాస్తికులే తరువాత యేసుప్రభువే దేవుడని నమ్మి ఆయన కొరకు ప్రాణాలు ఇచ్చారు.

                అటునుండి ఇటువచ్చిన వారు అనేకులు ఉన్నారు, కాని బైబిల్ చదివి నాస్తికులం అయ్యాం అనేవారు తక్కువ మంది. ఎక్కువ మంది ఉన్నది కరెక్టా! తక్కువ మంది ఉన్నది కరెక్టా? బైబిల్ని చదివి నాస్థికులం అయ్యాం అనేవాళ్లు ఇద్దరో, ముగ్గురో కాని బైబిల్ చదివి దేవున్ని అంగీకరించిన వారు వేలమంది లక్షలమంది, ఈ ఇద్దరు ముగ్గురు నాస్థికులు భ్రష్టులు, వేలమందిని నమ్ముతామా? ఇద్దరు, ముగ్గురిని నమ్ముతామా! ఇది భ్రష్టత్వం అంటాం?