255. ప్రశ్న : మత్తయి సువార్త 27:10 వచనంలో యేసు ప్రభువుని 30 వెండినాణెములకు అమ్మాడు అని యిర్మియాలో ఉంది అని చెప్పారు కానీ అది జెకర్యా 11:5 లో చెప్పబడింది. ప్రసంగి 7:16ని వివరించండి.

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)

జవాబు:      బైబిల్ లో వైరుద్ధ్యములు (discepancies) అనేవి ఉన్నాయి, అని నేను చేసిన ప్రసంగాలు కూడా ఉన్నాయి. బైబిల్లో వైరుద్ధ్యాలు లేవు అనేది అతిశయోక్తి.  అది యదార్థమైనటువంటిది కాదు. ఒకచోట ఒకలాగా, ఇంకోచోట ఇంకోలాగా ఇలా ఎన్నో ఉన్నాయి.

                ఇలా ఎందుకు ఉన్నాయంటే ముద్రణా సమయంలో copy mistakes జరిగాయి అని తెలుస్తుంది. మనం theologycal గా చూస్తే ఉన్నాయి.

                మరి ఇలా ఎందుకు ఉన్నాయి దేవుడే పరిశుద్ధాత్మ ద్వారా వ్రాయిస్తే ఎందుకు mistakes ఉన్నాయి.  అలా వ్రాయిస్తే దేవుడు ఎలా సర్వశక్తిగలవాడు అవుతాడు అని అంటే, చూచి రాసినవారు తప్పు రాస్తే రక్షకుని గురించి కూడా తప్పు ఉండచ్చుగా అని అంటే “బైబిల్లో దేవుడు కొన్ని కావాలనే పొరపాట్లు allow చేశాడు.  అది దేవుని సర్వజ్ఞానం.  ఎలా అంటే బైబిల్ నిజంగా positive mindset తో చదివితే, సత్యం గ్రహించాలని చదివితే రక్షకుడు దొరుకుతాడు.  బైబిల్ మనకు ఇచ్చిందెందుకంటే రక్షకున్ని తెలుసుకోవడానికి ఇతర సమాచారాలు ఇవ్వడానికి బైబిల్ వ్రాయబడలేదు.

                ఆదాము హవ్వలకు దేవుడు చెప్పాడు.  స్త్రీ సంతానంగా పుట్టి సర్పం తల చితక్కొడతానని అక్కడ ఏదేను తోటలో చెప్పిన ప్రవచనం తూ.చ. తప్పకుండా నెరవేరింది మరియమ్మ ద్వారా.

                ఈ విధంగా రక్షకుని విషయంలో ఏం తేడాలేదు. అయితే భక్తిలేకుండా యేసు అంటే Negative ఆలోచనలతో బైబిల్ లో చదివే వాళ్లకు అర్థంకావద్దని దేవుడు వ్రాయించాడు. యేసు అంటే ఇష్టం లేని వారికి బైబిల్ లోని నిధులు దొరకపద్దని దేవుడు అలా వ్రాయించాడు. మత్తయి 13:11 యేసుఅంటే ఇష్టం ఉన్నవారికి మాత్రమే బైబిల్ అర్థం అవ్వులాగున దేవుడు వ్రాయించాడు. ప్రసంగి 7:16 అధికముగా జ్ఞాని, అధికముగా నీతి అని search చేయండి Google లో ప్రసంగం మీరు వినవచ్చు.