256. ప్రశ్న : మీరు చేస్తున్న ఈ ప్రశ్నోత్తరి కార్యాక్రమాన్ని గురించి చాలామంది చెడుగా మాట్లాడుతున్నారు. ఓఫీర్ గారికి ఏమీ తెలియదు అని అంటున్నారు. దానిపై మీ Opinion ఏమిటి?

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)

జవాబు:      నాకేమీ తెలియదు అంటే వాళ్లకు చాలా తెలుసు అన్నమాట కదా! వారు కూడా ఇలాంటి కార్యక్రమం జరిగిస్తే బాగుంటుంది. వాళ్లకు కలిగిన జ్ఞానాన్ని దేశమంతా నేర్చుకుంటారు, దేశం బాగుపడుతుంది కదా! గనుక వాళ్లు ఒక Open Question and Answer program పెడితే అప్పుడు మేము కూడా అడుగుతాం. ఈ లోకం ఎలా పుట్టింది? మన దేశసమస్యలకు పరిష్కారం ఏంటి? అసలు సృష్టికర్త ఎవరు? అని కొన్ని ప్రశ్నలు మేము కూడా అడుగుతాం. ఒకవేళ వాళ్లకు అంత జ్ఞానం ఉంటే ఇన్ని రోజులు ఎందుకు Question and answers program పెట్టలేదు? ఇది ఒక రకమైన స్పందన.

                ఇంకొక విషయం ఏమిటంటే ఏమీ తెలియదు అని అనడం లోనే వాళ్ల మూఢత్వం బయటపడుతుంది. ఏమీ తెలియనివాళ్లు ఎవరూ ఉండరూ.

                నాకు ఒక విషయం తప్ప ఇంకేమీ తెలియదు అన్న విషయం ఎన్నో సార్లు నేనే చెప్పాను. అన్నీ ఎరిగిన వాన్ని ఒకడిని నేను ఎరుగుదును నాకు అన్నీ తెలుసు అని కాదు. నా రక్షకునికి అన్నీ తెలుసు రక్షకుడు అని నేను ప్రకటిస్తున్న యేసు నాధునికి ఆయన సర్వజ్ఞుడు అనేది నాకు తెలుసు.  ఆయనకు అన్నీ తెలుసు అన్న విషయం నాకు తెలుసు.  తర్వాత ఆయనతో నాకు వ్యక్తిగత పరిచయం ఉన్నది. గనుక నాకు ఏమీ తెలియకున్నా ప్రజలు నన్ను ఎందుకు గౌరవిస్తారు నా సముఖంలో ఆనందిస్తారు అంటే ఓఫీర్ గారికి అన్నీ తెలుసు అని కాదు. అన్నీ తెలిసిన యేసు నాధుడు ఓఫీర్ గారిని తన నోటి బూరగా వాడుకుంటాడు అని.  నా confidence కూడా అదే.  నన్ను ఆయన పిలిచి అభిషేకించి పంపించాడు.  ఈ ప్రజలు సందేహాలతో ఉన్నారు.  ప్రభువా నీవే కనికరించు అని నేను ఆయన వైపు చూస్తే దానికి జవాబు నా ద్వారా వస్తుంది అనే నమ్మకం. మహానుభావులను ఉత్తములందరీనీ తృణీకరించినవారు ఉన్నారు.  Amitha bachan గారు Superstar of India.  కానీ ఆయనను తీసికొట్టిన వారు ఈసడించిన వారు ఉన్నారు అప్పట్లో.  అలాగే గాంధీజీకి, అంబేద్కర్ గారికి, యేసు ప్రభు వారికి స్వామి వివేకానందగారికి అందరికి వ్యతిరేకులు ఉన్నారు.  గనుక ఎదైనా ఒక రంగంలో కాస్తోకూస్తో రానిస్తున్న వాళ్లను తృణీకరించేవారు, దూషించేవారు ఉంటారు. వాళ్లు దూషించినంత మాత్రాన వీళ్ల విలువ తగ్గిపోదు.