257. ప్రశ్న : మిమ్మల్ని ఈ తరంలో దేవుడు చాలా బలంగా వాడుకుంటున్నాడు సేవకులు ఎందరో విశ్వాసులు, పాస్టర్లు మీ సంఘాలలో ఉన్నారు. అయితే వాళ్లు మీతో మాట్లాడేటప్పుడు Daddy, అన్నా, Uncle అని సంబోధిస్తూ ఉంటారు. మీరు ఇంతటి సేవకులు అయినప్పుడు పాస్టరు గారు అని పిలవాలి కదా. అలా పిలవడం ఏమిటి? దీనిపై మీ స్పందన ఏమిటి?

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)

జవాబు:      ఇది పెద్ద సిద్ధాంత పరమైన విషయం కాదు. ప్రతీ మనిషికి నాయకునితో ఒక అనుబంధం ఉంటుంది. “యెహోవా మా తండ్రి కాడా, యేసుడు మా యన్న కాడా” అని ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో భక్తుడు పాట రాసాడు. “మన ప్రియ సహోదరుడైన పౌలు అని పేతురు పౌలును గూర్చి రాసాడు. పౌలు రోమా 8:29లో “తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడు అగునట్లు”. యేసు ప్రభువా అనేక మంది చిన్న తమ్ముల్లకు, చెల్లెల్లకు జేష్టుడు కావాలి. అంటే అన్నా – తమ్ముల సంబంధం అనే ఆ సృష్టికర్తయైన దేవుడే కోరుకున్నాడు. “దేవుని వాక్యమును విని, దేవుని చిత్తము జరిగించు విరే నా తల్లి, నా సహోదరుడు, సహోదరి అన్నాడు. గనుక రక్షకుడే మనల్ని తమ్ముడు, చెల్లెమ్మా అని పిలవడానికి ఇష్టపడినప్పుడు మరి ఆయన అడుగుజాడల్లో నడిచే దైవజనుడు ఎలా Distance Maintain చేస్తాడు కొన్ని Main-line churches లో అలా అయ్యగారు పాస్టర్గారు అని అనాలని ఒక ఆనవాయితీ సృష్టించారు. అది కూడా మంచి ఉద్దేశమే. అలా గౌరవిస్తే ఆ గౌరవంలో వీళ్లకు ఆశీర్వాదం ఉన్నదని అలా నియమించారు. కానీ యేసు ప్రభువారు చాలా Simple గా అందరితో కలిసిపోయేవారు. చిన్న పిల్లల్ని ఎత్తుకున్నాడు? హత్తుకున్నాడు ముద్దుపెట్టాడు. అందరితో చక్కగా Interact అయ్యారు. అందుచేత దైవజనుడిని ఇలాగే పిలవాలి అనే దాన్ని ఒక Issue చేయకూడదు. కొంత మంచి దైవజనుడిలో ఒక తండ్రిని చూసుకుంటారు ఒక అన్నయ్య అనుకుంటారు. గనుక యేసయ్యను తండ్రీ అంటే తప్పులేనప్పుడు పాస్టర్ను తండ్రి అంటే తప్పేమిటి. “క్రీస్తునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని” అన్నాడు పౌలు. గనుక దైవజనుడు అంటే ఒక Emotions లేని Robo కాదు. He is an Emotional Humanbeing. నేనైతే నా కున్న అభిమానులను సంస్థగా ఎప్పుడూ చూడను నా కుటుంబం అనుకుంటాను. Ultimate గా, ప్రేమ ఉంటే ఏదీ తప్పు అనిపించదు ప్రేమ లేనప్పుడు అన్నీ తప్పుగానే అనిపిస్తాయి. కాబట్టి అన్నిటిని మనం ప్రేమగా చూస్తే సమాజంలో ఐక్యతా. సహజీవనం అనేది, ఎక్కువ అవుతుంది. క్రీస్తు సంఘము ఒక సంస్థగా ఎక్కడా లేఖనాలలో చెప్పబడలేదు. It is not an organisation. It is a family and it is a body. కుటుంబం అన్నప్పుడు అనుబంధాలు ఉంటాయి.