(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: చట్టబద్ధంగా దైవ సన్నిధిలో వివాహం చేసుకున్న దంపతుల మధ్య శారీరక సంపర్కం ఏ మాత్రం తప్పుకాదు. అది మహా పరిశుద్ధమైన అనుబంధం, ప్రక్రియ అయినా కూడా ఉపవాసం ఉన్న సమయంలో దానికి దూరంగా ఉండడం మంచిది, క్షేమాభివృద్ధికరం. “ప్రార్థనకు అభ్యంతరకరమైనది పాపమొక్కటే కాదు”. పాపం కాని కొన్ని మంచి పనులు కూడా ప్రార్థనకు కొన్ని సార్లు ‘ఆటంకం కలిగిస్తాయి.’ ఎందుకు అంటే ఉపవాసం అంటే దేవునికి దగ్గర జీవించటం. రాష్ట్రపతి ఉంటాడు. ఉప రాష్ట్రపతి, సర్పంచ్ ఉంటాడు. ఉప సర్పంచ్ ఉంటాడు. ఉప అంటే కొంచెం తక్కువ అంతస్థులో చాలా దగ్గరగా ఉండే ఒక స్థానము. అలాగే దేవుడు సూర్యుడైతే ఆయన ప్రక్కన తిరుగుతూ ఉండేటువంటి అనుభవాన్ని ఉపవాసం అంటాం. దేవునికి దగ్గరగా ఉండటానికి మనం ఏమిచేస్తాం అంటే మనం చాలా అవసరమైన ప్రకృతి సహజమైన Biological Needs ఉంటాయి. ఆహారం లేకపోతే బలహీనం అయిపోతాం అయినా ఆహారం కంటే దేవుని సన్నిధి ఎక్కువ అవసరం అన్నదే ఉపవాసం ఆకలేస్తుంది ప్రభువా! అయినా నేను తినను నేను అడిగిన ఈ మనవి, ఈ వరము నీవు నాకు దయచేయాలి అని అడగడం. పరిశుద్ధాత్మ, స్వస్థత, వాక్య ప్రత్యక్షత, ఒక పాపం మీద విజయం కావాలి, ఒక బంధకం తెగిపోవాలి. ఒక సమస్య పరిష్కారం కావాలి అని అడిగేటప్పుడు ప్రభూవా నాకు ఇది ఎంత అవసరం అంటే అన్నం కంటే ఎక్కువ అవసరం. అన్నం అనేది తినకుండా మనిషి ఉండలేడు కానీ ఇప్పుడు నేను ఉంటున్నా ఎందుకంటే దీనికంటే నాకు ఆధ్యాత్మిక అవసరం ఎక్కువ అని దేవుని ముందు display చేయడమే ఉపవాస ప్రార్ధన. నువ్వు అడుగుతున్న దానిమీద నీకు ఎంత Concentration, Seriousness ఉన్నది అనే దాని యొక్క Proof ఉపవాస ప్రార్థన. అలాంటప్పుడు అన్నం ఎందుకు మానేస్తున్నాం? పాపం అని మానేస్తున్నామా? పాపం అని కాదుగా నేను అడుగుతున్న ఈవి నాకు అన్నం కంటే ఎక్కువ అవసరం అని ఎలా చూపిస్తున్నామో అలాగే భార్యాభర్తల మధ్య ఉండే సంబంధం కూడా (అది కూడా ఒక భౌతిక అవసరమే) నా శరీరం అడుగుతుంది. అయినా సరే దాని కంటే ఎక్కువ నా మనస్సు ప్రార్థన మీద లఘ్నం చేస్తాను అని చెప్పుకోవడానికి, అన్నం ఎలా మానేస్తున్నామో అది కూడా అలా మానేస్తే మంచిది. అన్నంకి ఎలా దూరంగా ఉన్నామో అలాగే భార్యకు లేదా భర్తకు దూరంగా ఉండడం కూడా ఉపవాసంలో భాగమే. అయితే నేను భోజనం మాత్రమే మానేస్తాను కానీ ఇది మానను అనేది సగం ఉపవాసమే కానీ సంపూర్ణ ఉపవాసం కాదు.
ఒక భయంకరమైన సమస్య ఉన్నప్పుడు భోజనం మీదికి మన మనస్సు వెళ్లదు, లైంగిక వాంఛ మీదికి మనస్సు వెళ్లదు. మరి ప్రార్ధనలో ఉన్నప్పుడు ఎలా వెళ్తుంది గనుక హృదయ రహస్యములను పరిశోధించే దేవుడు. నిజంగా నేను అగుడుతున్న ఈ వరం, పరిష్కారం నాకు కావాలి అని మనం ఏకాగ్రత్తతో అడిగినప్పుడు ఒకవేల అనుకోకుండా కలయిక జరిగినా దాని దేవుడు పట్టుకొని వెళ్లి నరకంలో వేయడూ, శిక్షించడూ. నీ ప్రార్ధన యొక్క Concentration, intencity తక్కువైపోతుంది అంతే నీ ప్రార్థనలో 100% Force ఉండాలంటే నా శరీరానికి ఉన్న సకలమైన అవసరాలను ప్రక్కన్న పెట్టి నేను ప్రార్ధన చేస్తాను అని తీర్మానించుకోవాలి ఇలా అన్నిటికి దూరంగా ఉండి ప్రార్థిస్తే, మన ప్రార్ధన బలంగా దేవుని దగ్గరకు వెళ్తుంది.