260. ప్రశ్న : పాపం అంటే ఏమిటి? యేసు రక్తం దాన్ని ఎలా పరిహరించింది?

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)

జవాబు:      పాపం అనే మాటకు అర్థం ఆయా వ్యక్తుల స్థితిని బట్టి, ఎదుగుదలలో వాళ్ల అంతస్థునుబట్టి, వాళ్లు రక్షణ పొందిన వాళ్లా, పొందని వారా, రక్షణ పొంది ఎదుగుదలలో ఏ మెట్టు మీద ఉన్నారు అనే దాన్ని బట్టి పాపము అనేదాని నిర్వచనం మారుతుంది.

1. పాపమనగా ఒక స్వభావము, పుట్టుకతోనే వచ్చిన స్వభావము “మేలైనది చేయనెరిగియు అట్లు చేయకపోవుట నాకు కలుగుచున్నది” “నేను చేయగోరుచున్న మేలును చేయక, చేయగోరని కీడునే చేయుచున్నాను” ఆ Nature పేరు Sin. అది ఆదామునుండి మనం సంక్రమించిన స్వభావ పాపము.

2. క్రియా పాపము “1 యోహాను 3లో” ఆజ్ఞాతిక్రమమే పాపము. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును.

రక్షణ పొంది దేవుని కుటంబంలో పుట్టిన తర్వాత బైబిల్లోని పరిధి, అధికారంలోనికి వచ్చాడు. గనుక బైబిల్ వద్దని చెప్పినదాన్ని చేస్తే అది తప్పు.

ఈ క్రియా పాపంలో రెండు వర్గాలు.

1. Sin of Commission

2. Sin of Ommision

Commit చేయడం అంటే పని కట్టుకొని చేయడం Ommit చేయడం అంటే చేయకుండా వదిలేయడం. దేవుడు వద్దని చెప్పిన దాని చేయడం అవిధేయత దేవుడు చేయమనిన దానిని చేయకపోవడం కూడా అవిధేయతే. గనుక ఇదీ క్రియా పాపం. విశ్వాసి ఎదిగిన కొలది పాపం అనే దాని నిర్వచనం మారిపోతుంది. యాకోబు 4:17” కాబట్టి మేలైనది చేయనెరిగియు ఆలాగు చేయని వానికి పాపము కలుగును”. ఇది పాపము యొక్క ఇంకొక నిర్వచనం. As a believer, ఈ పని చేస్తే మంచిది అని తెలుసు అయినా చేయలేదు అంటే అదే పాపమే ఇంకా కొంచం పైకి ఎదిగిన తర్వాత నా స్థానంలో ప్రభువైన యేసే ఉంటే ఏదైతే ఆయన చేయడో అది నేను చేయడం పాపం. యేసును అనుకరించి ప్రతీ అడుగు వేయాలి.

                గనుక పాపమునకు నిర్వచనం మన ఎదుగుదలను బట్టి మారుతుంది.

                యేసు రక్తం ఆ పాపమును ఎలా కడుగుతుంది అంటే పాపము ద్వారా వచ్చు జీతము మరణము అని బైబిల్ చెప్పింది. మరణం అంటే మనలో ఉన్న ప్రాణ శక్తిని మనం కోల్పోవడం జరిగింది గనుక యేసు రక్తములో

ఉన్న ప్రాణశక్తి దాన్ని compensate చేస్తుంది. మన ప్రాణశక్తి పోయింది దేవునికి సంబంధించినంతవరకు మనము మృతులమైపోయాము. అలాంటప్పుడు దేవుడే నరవతారమెత్తి, సిలువలో కార్చిన పరిశుద్ధ రక్తాన్ని నేను నమ్మితే, ఆ రక్తంలో ఉండే అనంతమైన ప్రాణశక్తి నాలోనికి ప్రవహించి, పాపము చేయుట ద్వారా ఏ ప్రాణశక్తిని కోల్పోయానో ఈ అక్షయ ప్రాణశక్తిని దేవుడు నింపుతాడు. ప్రాణము అనేది పొగొట్టుకోవడం అనే శిక్ష మనకొచ్చింది గనుక క్రొత్త ప్రాణాన్ని మనలో నింపడం అనే పని యేసు రక్తం చేస్తుంది. అందుకే రక్తం కావాల్సి వచ్చింది.