పూర్తి ప్రశ్న: అయ్యగారు, 2025 క్రిస్మస్ పండుగ ప్రపంచవ్యాప్తంగా అద్భుతంగా జరిగినట్లు కనిపిస్తుంది. ఒకవైపు సువార్త వ్యతిరేకత, మతోన్మాద దాడులు పెరుగుతున్నా, ఈ సంబరాలు ఇంత ఉధృతంగా జరగడాన్ని మీరు ఎలా చూస్తారు? 🎄🛡️
💡 సమాధానం (దైవజనులు రంజిత్ ఓఫీర్ గారి వివరణ) 🎙️📖
ఈ ఉత్సాహభరితమైన క్రిస్మస్ సంబరాల గురించి దైవజనులు ఇలా వివరించారు:
దేవుడు అపహసించుచున్నాడు: రెండో కీర్తనలో దావీదు మహారాజు రాస్తాడు.. “అన్యజనులు ఏల అల్లరి చేయుచున్నారు, జనములు ఏల వ్యర్థమైన దానిని తలంచుచున్నవి?”. భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధముగా ఆలోచన చేయుచున్నారు కానీ, ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు, దేవుడు వాళ్ళని చూసి అపహసించుచున్నాడు. మతోన్మాదులే ఒప్పుకుంటున్నారు.. చాప కింద నీరు లాగా క్రైస్తవ్యం వ్యాపిస్తా ఉందని. 🌊✨
దేవుని కార్యం: వాళ్ళు మన కూటాలను అడ్డగిస్తున్నారు, చర్చిలు కూలగొడుతున్నారు, పాస్టర్లను చంపుతున్నారు, దొంగ కేసులు పెడుతున్నారు. అయినా సరే పరిశుద్ధాత్మ కార్యం జరుగుతానే ఉంటది. ఇది దేవుని కార్యం కానీ మనిషి కార్యం కాదు. యదార్థంగా అన్వేషించే ప్రతివానికి హృదయ నేత్రాలు తెరుచుకొని సువార్తలోని సత్యము అర్థం కావడమే దేవుని కార్యం. 🛡️🔥
అద్భుతమైన సంబరాలు: మునుపు ఎన్నడూ జరగనంత అద్భుతంగా ఈ సంవత్సరం అన్ని యూరోపియన్ కంట్రీస్, అమెరికా, ఆస్ట్రేలియా, ఇండియాలో జరిగింది. మన అగాపే చర్చెస్ లో కూడా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, ఖాతా మీద సామాన్లు తెచ్చి మరి భోజనాలు పెట్టాం. అప్పుల పాలైనా సరే ప్రజలు విరగబడి వచ్చారు. నీతి సూర్యుడైన యేసుకు వ్యతిరేకంగా ఎవడు మాట్లాడినా వాళ్ళ పరువే పోతుంది తప్ప సూర్యుడు ప్రకాశిస్తానే ఉంటాడు అని అయ్యగారు వివరించారు. ☀️🙌
🎥 వీడియో టైమ్డ్ లింక్: 🔗 http://www.youtube.com/watch?v=Kf3tufwMWlQ&t=28s
