615.ప్రశ్న (KSM 266): 🕊️ ఇప్పుడు ఒక వ్యక్తి… పాస్టర్ గారో లేకపోతే ప్రవక్తనో అపోస్తులో మీలాంటి వాళ్లో ఒక విశ్వాసుల మీద చేతులు ఉంచినప్పుడు ఆ వ్యక్తిలో పరిశుద్ధాత్మ దేవుడు యాక్టివేట్ అవుతాడా? దానికి ఎంత టైం పడుతుంది?

Link: https://youtu.be/NlFdukU89Gs?t=3402

దైవజనులు రంజిత్ ఓఫీర్ గారి సమాధానం:

  • సేవకులు చేతులు ఉంచినప్పుడే కాదు, చేతులు ఉంచకుండానే పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళు బోలెడు మంది ఉన్నారు. 🕊️
  • సంఘమంతా కలిసి దేవుని స్తుతిస్తున్నప్పుడు (వర్షిప్ టైంలో) సేవకులు ఆత్మలో సంచరిస్తుంటారు, అప్పుడు ఆత్మీయంగా చేతులు పెట్టడమే కానీ ఫిజికల్ గా చేతులు పెట్టడం జరగదు. అప్పుడే అనేకులు అన్యభాషలు మాట్లాడతారు, ప్రవచిస్తారు, ఏండ్ల తరబడి ఉన్న జబ్బులు కూడా పోయాయి. 🙌
  • దైవజనులు కూడా వారి 10వ ఏట, ఐపిసి చర్చిలో దైవ సేవకులు తలమీద చేతులు ఉంచితేనే పరిశుద్ధాత్మ పొందారు. హోసన్నా సహవాసంలో, పెంతుకోస్తు సంఘాల్లో, రాక్ చర్చిలో అన్యులు కూడా సేవకులు నడిపించే ప్రార్థన కూటాల్లోనే పరిశుద్ధాత్మను పొందుతున్నారు. 🙏
  • కానీ కొన్ని సంఘాలు “రక్షణ పొందడమే పరిశుద్ధాత్మ పొందడం, మళ్లా ఆత్మ అక్కర్లేదని” బోధిస్తాయి. అలా నమ్మని సంఘాల్లో పరిశుద్ధాత్మ ఎట్లు వస్తాడు? రాడు. వారి ఆధ్యాత్మిక దారిద్ర్యానికి వాళ్లే కారణం. 🚫
  • ముందు సంఘం ఒక సత్యాన్ని విశ్వసించాలి. విశ్వాసంతో ప్రార్థించినప్పుడు తప్పకుండా పరిశుద్ధాత్మ అభిషేకం, వరములు కలుగుతాయి. చేతులు ఉంచినా, చేతులు ఉంచకుండానే మన సంఘాల్లో వేల మంది పరిశుద్ధాత్మ పొందారు. ✨

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram