626.ప్రశ్న (KSM 247): 🏠 లూకా సువార్త 10వ అధ్యాయం ఐదవ వచనంలో… ఫలానా ఇంటిలోనికి మాత్రమే వెళ్ళాలి, ప్రవేశించాలి అని ఎలా నిర్ణయించుకుంటారు వీళ్ళు, ఎందుకంటే అందరి ఇళ్లలోకి వెళ్లొద్దు అన్నాడు అది?

Link: https://youtu.be/a9IlAHYmmPk?t=6065

దైవజనులు రంజిత్ ఓఫీర్ గారి సమాధానం:

  • మనం ఒక గ్రామానికి సువార్తకు వెళ్ళకముందే, మనల్ని ఎవరు రిసీవ్ చేసుకుంటారో వాళ్ళను పరిశుద్ధాత్మ దేవుడే ముందే సిద్ధపరిచి ఉంటాడు. అందరూ ఎగబడి మనల్ని పిలవరు. 🚪
  • మానవుల మనస్తత్వం గురించి వాళ్ళను సృష్టించిన దేవునికి బాగా తెలుసు. ఒక ఇంట్లో మనం భోజనం చేసి, మళ్ళీ ఊరంతా తిరగడానికి వెళ్తే, మిగతా వాళ్ళు పిలిచి ముందున్న వాళ్ళ మీద చాడీలు (పితూరీలు) చెబుతారు. 🗣️
  • “వాళ్ళు మంచోళ్ళు కాదండి” అని ఒకరు, “వీళ్లిద్దరూ మంచోళ్ళు కాదని” మూడో వాడు చెబుతాడు. దీనివల్ల మనం సువార్త చెప్పేది మానేసి వీళ్ళ దుర్వార్తలు వినాల్సి వస్తుంది. మన బుర్ర ఖరాబు చేస్తారు. 🤦‍♂️
  • అందుకే దైవజనుడు ఎంత సెక్యూడెడ్ గా (ఏకాంతంగా) ఉంటే అంత మంచిది. “ఆయిల్ ఆయిల్ తిరక్కండి, నేను సిద్ధపరచిన వాడి ఇంట్లోనే మీరు వెళ్ళిపోయేదాకా ఉండండి” అని యేసయ్య చెప్పాడు. 🏡
  • సువార్తకు ఇద్దరిద్దరిని (Two by Two) వెళ్ళమనడానికి కారణం: ఇద్దరు ఉన్నప్పుడు చాడీలు చెప్పడం తగ్గుతుంది. మరియు ఇద్దరు భక్తులు ఉన్నచోట సైతానుకి ధైర్యం సరిపోక పారిపోతాడు. వానికి ఏకాంతం, చీకటి కావాలి గానీ నడి రోడ్డుమీద భక్తులు వస్తుంటే వాడు కనబడలేడు! 👥

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram