Link: https://youtu.be/2GLTpE8hsU4?t=3710
దైవజనులు రంజిత్ ఓఫీర్ గారి సమాధానం:
- భక్తులకు దేవుడు ఎందుకు కీడు చేస్తాడు? రోమా 8:28 లో “దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుచున్నవి” అని ఉంది. 🛡️
- దేవుని ప్రేమించే వాళ్ళకు (తన బిడ్డలకు) సైతాను కీడు చేద్దాం అనుకున్న దాన్ని కూడా దేవుడు మేలుగా మార్చేస్తాడు. (డానియల్ ప్రణీత్ బ్రదర్ రాసిన “అపవాది తలచిన ఆ కీడులన్నీ మేలైపోవు” అనే పాటలో ఈ విషయమే ఉంది). 🎶
- దేవుడు అందరికీ మేలు మాత్రమే చేస్తాడు అనడం అబద్ధం! ఎవడు దేనికి పాత్రుడో (అర్హుడో) వాళ్ళకు మాత్రమే దేవుడు ఆ కీడును చేస్తాడు. అదే న్యాయం (Justice). ⚖️
