Link: https://www.youtube.com/live/dorsIQG8SOs?t=4162
దైవజనులు రంజిత్ ఓఫీర్ గారి సమాధానం:
- 👗 పునరుత్థాన శరీరం: లేదు లేదు లేదు లేదు. పునరుద్ధాన శరీరము ఎలా ఉంటుంది అని అంటే.. రెండవ కోరింతి పత్రిక ఐదవ అధ్యాయంలో ఉన్నట్టు “మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకొనిన వారముగా కనబడుదుము”. వస్త్రాలను గూర్చి క్రొత్త నిబంధన అంతా ప్రకటన గ్రంధంలో కూడా రాయబడింది. జయించిన వాడు తెల్లని వస్త్రములు ధరించుకొని గొర్రెపిల్ల ఎక్కడికి వెళ్ళినను వెంబడించును అని. వారు ఆ ధవల వస్త్రధారులు, మనం దిగంబరంగా ఏమీ ఉండము.
- 🌳 ఏదేనులో బట్టలు ఎందుకు ఇవ్వలేదు?: దేవుడు పెట్టిన ఆ పరీక్షా కాలం ఉందే.. వీళ్ళు ఆ నిషిద్ధ ఫలాన్ని తింటారా లేకపోతే తినరా, దేవునికి లోబడతారా, సాతాను మాట వింటారా అనే పరీక్ష కాలము. అంతకుముందు వాళ్ళు దిగంబరంలో ఉన్నారు, వాళ్ళకి సిగ్గు తెలియదు. దేవుడు ఎందుకు బట్టలు ఇవ్వలేదంటే—ఈ పరీక్షలో రిజల్ట్ ను బట్టి వాళ్ళకు బట్టలు నిర్ణయించబడతాయి. ఏ రకమైన వస్త్రాలు వేసుకోవాలో, పరీక్షలో వాళ్ళు ఓడుతారా గెలుస్తారా దాన్ని బట్టి నిర్ణయించబడుతుంది.
- ✨ దేవదూతల వస్త్రాలు: దేవదూతలందరూ బట్టలు ధరించుకుంటారుగా బ్రదర్. ఏసుప్రభు వారి సమాధి తెరవబడిన తర్వాత ఒక దూత వచ్చి రాయిని దొర్లించేసి కూర్చున్నాడు. ఆయన వస్త్రము మెరుపు వలె దగదగ మెరుస్తా ఉంది, తెల్లని వస్త్రాలు. ఏసుప్రభు వారు ఆరోహణమైనప్పుడు కూడా ఇద్దరు మనుషులు వచ్చి తెల్లని వస్త్రాలు ధరించిన వారై నిలబడ్డారు. దేవదూతలు ఎన్నిసార్లు కనబడ్డా మంచి తెల్లని బట్టలు వేసుకొనే కనబడ్డారు.
- 👑 సూపర్ ఫైన్ బట్టలు: గనుక మనం కూడా పరలోకానికి వెళ్ళినప్పుడు, మన అంతస్తును బట్టి దేవుడు మంచి ‘సూపర్ ఫైన్’ బట్టలు మనకు అనుగ్రహిస్తాడు ఆయన.
