Link: https://www.youtube.com/live/dorsIQG8SOs?t=4862
దైవజనులు రంజిత్ ఓఫీర్ గారి సమాధానం:
- 🏥 గేహజీ స్వస్థత: కరెక్టే.. ఈ విషయం నేను లోగడ ఒకసారి ఏదో ప్రసంగంలో చెప్పాను, ఇంటర్నెట్ లో ఆల్రెడీ ఉన్నది. గేహజి మళ్ళీ మారుమనసు పొంది ఆ స్వస్థత పొందాడు.
- 📜 ధర్మశాస్త్ర నిబంధన: యాక్చువల్ గా అతడు కుష్టురోగి అయితే ఇశ్రాయేలు ధర్మశాస్త్రం ప్రకారము ఆ ఊరు బయట ఉండాలి. అయితే అతడు రాజుగారి సన్నిధిలో సేవలో ఉన్నట్లుగా మనం చూస్తామన్నమాట. రెండవ రాజులు 8వ అధ్యాయంలో గేహజి మళ్ళీ రాజు దర్బారులో కనబడతాడు. “రాజు దైవజనుడి పనివాడగు గేహజీతో మాట్లాడి ఎలీషా చేసిన గొప్ప కార్యములన్నిటిని నాకు తెలియజెప్పమని” ఆజ్ఞ ఇచ్చాడు.
- 🔄 పశ్చాత్తాపం – హీలింగ్: అతడు కుష్టు రోగముతో ఉండిన వాడైతే రాజ దర్బారులో సేవలో ఉండడానికి అవకాశం లేదు. అతన్ని ఊరు బయట పెడతారు, అది ధర్మశాస్త్రానుసారం. వాడు రాజు దర్బార్లో ఉన్నాడంటే వాడికి స్వస్థత కలిగింది. కనుక వాడు పశ్చాత్తాప పడి మారుమనసు పొంది ఉంటాడు అని లేఖనాధారాన్ని బట్టి మనం నమ్మొచ్చు.
- 🛡️ సందేశం: అతని స్వస్థత గురించి డైరెక్ట్ గా రాయబడలేదు కానీ, జనరల్ గా ధర్మశాస్త్రంలో కుష్టురోగి ఊర్లో ఉండటానికి వీలు లేదు, రాజ సన్నిధిలో ఉండటానికి అసలే వీలు లేదు. వాడు మళ్ళీ స్వస్థత కలిగితేనే వాడిని ఊర్లోకి రానిస్తారు. లేకుంటే వాడు ఊరిలోకి వస్తే అపవిత్రుడు అని నోరు కప్పుకొని పెద్ద హడావుడి చేయాలి. అలాంటిది రాజుగారి దర్బార్లో ఉన్నాడంటే హీలింగ్ కలిగింది, అతడు పశ్చాత్తాప పడి ఉంటాడు అని మనం నమ్మవచ్చు.
