752.ప్రశ్న: బలిపీఠం మీద నుండి మాట్లాడేవారంతా పరిశుద్ధాత్మ వశులై మాట్లాడుతారా? సేవకులు మాట్లాడేటప్పుడు సాతాను కూడా మాట్లాడతాడా? (KSM 238)
🏥 ప్రశ్న: సంఘంలో సేవకులు బలిపీఠం మీద మాట్లాడుచున్నప్పుడు ఒక్క పరిశుద్ధాత్ముడే మాట్లాడతాడా మరియు అప్పుడప్పుడు సేవకులు కూడా మాట్లాడతారా? సాతాను కూడా మాట్లాడే అవకాశం ఉందా? (00:40:04)
YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి
దైవజనులు రంజిత్ ఓఫీర్ గారి లోతైన వివరణ:
- 🗣️ అన్ని రకాలుగా మాట్లాడతారు: మానవ మనసుతో మాట్లాడే ప్రసంగికులు ఉన్నారు, పరిశుద్ధాత్మ వశులై ప్రసంగించే ప్రసంగికులు ఉన్నారు. సాతాను వశములో తాము కన్ఫ్యూజ్ అయిపోయి అందరిని కన్ఫ్యూజ్ చేసే ప్రసంగికులు ఉన్నారు. ప్రసంగికులంతా ఒకటే గాట కట్టలేము, ఒకటే మూట కట్టలేము వాళ్ళను. అందరూ ఒకే రకం కాదు.
- 🛡️ పరిశోధన అవసరం: ఆత్మవశులైన వాళ్ళను కూడా తాత్కాలికంగా సాతాను కొంచెం కన్ఫ్యూజ్ చేసి అబద్ధం ఆడించిన సందర్భాలు కూడా ఉంటాయి. ముసలి ప్రవక్త అబద్ధమాడిన ఘట్టాన్ని మనం మొదటి రాజులు 13వ అధ్యాయంలో చూడగలం. నిజమైన ప్రవక్తలు కూడా కొన్ని కొన్ని సందర్భాలలో అబద్ధం చెబుతారు.
- ⚔️ వివేచించుకునే బాధ్యత: బోధ ఎవరు చెప్పినా వివేచించుకునే బాధ్యత వినే వాళ్ళ మీద ఉంది. చాలా పెద్దాయన చెప్పాడు, చాలా గొప్ప ఫేమస్ ప్రీచర్ చెప్పాడు అని బ్లైండ్ గా నమ్మడానికి వీలు లేదు. బెరేయ విశ్వాసులు పౌలు చెప్పిన సంగతులు అట్లా ఉన్నాయో లేవో ప్రతిదినము లేఖనములు పరిశోధించుచు వచ్చిరి, అందుకు వారు ఘనులు.
- 📖 ముగింపు: వివేచించుకునే బాధ్యత విశ్వాసిదే. బైబిల్ ను బాగా చదివి ఉన్నవాడే వివేచించగలడు. అనుదిన ప్రార్థన సమయం గడుపుతున్నవాడు మాత్రమే వివేచించగలడు. డైలీ బైబిల్ స్టడీ లేనివాడు, డైలీ ప్రేయర్ లైఫ్ లేనివాడు ఏ ఆత్మ పలుకుతుందో వివేచించలేడు. అందుకే వారమంతా దేవునితో నడవాలి, వాక్యంతో సహవాసం చేయాలి.
English Summary (For Global Readers):
- Diverse Influences: Bro. Ranjith Ophir explains that preachers can speak from human intellect, the Holy Spirit, or even be confused by Satan. One cannot generalize all speakers into a single category.
- Scriptural Warning: Even true prophets can sometimes be misled by human emotions or deception, as seen with the old prophet in 1 Kings 13.
- Responsibility of the Listener: It is the duty of the believer to discern the message. Even if a famous or anointed preacher speaks, one should verify it against the scriptures, following the example of the Bereans.
- Conclusion: Only those with a consistent prayer life and daily Bible study can truly discern which spirit is operating behind a message. Believers must walk with God throughout the week, not just on Sundays.
