936.Q: Fruits Worthy of Repentance (KSM 231) 🍎

❓ ప్రశ్న: మారుమనస్సుకు తగిన ఫలము ఫలించుడి అని మత్తయి సువార్త మూడు ఎనిమిదిలో అన్నాడు. మారుమనస్సుకు కొలతలు ఉన్నాయా? అంటే నూరంతలు, 30 దంతలు, 60 దంతలు ప్రతిఫలం అనేది ఎట్లా అయితే ఉందో, మారుమనసు పొందుటలో కూడా అలాంటి డిఫరెన్సెస్ ఏమన్నా ఉన్నాయా? (2:03:18)

📺 YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి


దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (07m 34s) 🎙️

  • 📊 అట్లాగే ఏమీ ఉండదు కానీ, ఇప్పుడు మీరు చెప్పిందేమో 13వ అధ్యాయం—30 అంతలు, 60 అంతలు, నూరంతలు అనేది 13వ అధ్యాయము 23వ వచనం. మంచి నేలను విత్తబడినవాడు వాక్యం విని గ్రహించువాడు, అట్టివారు సఫలులై ఒకడు నూరంతలు గాను ఒకడు 60 అంతలు గాను ఒకడు 30 అంతలు గాను ఫలించును. ఇది వాక్యమును విని గ్రహించి ఫలించే విషయం. ఈ ఫలము వేరు. ఇక్కడేమో వాని వాని డిగ్రీ ఆఫ్ రెవలేషన్ అండ్ ఒబీడియన్స్, హృదయ సున్నతి, విధేయత, ప్రత్యక్షత—ఎంతగా దేవునికి అప్పగించుకుంటాడో ఆ లెవెల్లో దేవుడు వానికి రెవలేషన్ ఇస్తాడో అంతగా ఫలిస్తాడు. అది వేరే విషయం. వాక్యం ఒకటే ప్రసంగం 100 మంది వింటారు, అదే ప్రసంగం, అదే బోధకుడు, అదే అభిషేకం, అదే ప్రత్యక్షత, అదే సమాచారం 100 మంది విన్నారు కానీ 100 మంది ఏకరీతిగా ఫలించరు. వాళ్ళ వ్యక్తిగతమైన కనెక్షన్ దేవునితో ఎలా ఉందో దాన్ని బట్టి వాళ్ళు ఫలిస్తారు. అది వేరే. 🔗
  • 🔄 ఇక్కడ బాప్తిస్మమిచ్చు యోహాను చెబుతున్నాడు—మారుమనస్సుకు తగిన ఫలము వేరు. మారుమనస్సుకు తగిన ఫలము అంటే ఏంటంటే, ఇంతవరకు నేను జరిగిస్తూ వచ్చినటువంటి చెడు మీద అసహ్యం కలగడం. ఇంతవరకు నేను చేస్తున్న తప్పుడు పనుల మీద ద్వేషము, అసహ్యము నాలో పుట్టడం అది ఫ్రూట్ ఆఫ్ రిపెంటన్స్. ఇది వేరు, వాక్యాన్ని విని ఫలించేది వేరు, పరిశుద్ధాత్మ ఫలము వేరు. ఫలము అనగాన అంతా ఒకటే కాదు ఎన్నో ఉంది. సేవలో ఫలము వేరు—ప్రభువునందు నా పనికి ఫలము మీరు కారా అని కొరింతీయులను పౌలు అడిగాడు. కనుక ఎన్ని ఉన్నాయి! మారుమనస్సుకు తగిన ఫలము, వాక్యమును విని ఫలించుట, తర్వాత పరిశుద్ధాత్మ ఫలము ఫలించుట, తర్వాత సువార్త ద్వారా ఆత్మలను కనిపించుట—ఆత్మీయ గర్భఫలం. ఇన్ని ఫలాలు ఉన్నాయి. కనుక ‘ద ఫ్రూట్’ అని కనబడగానే అది ఒకటే అనుకోవద్దు, అది డిఫరెంట్ కేటగరీస్ ఉన్నాయి. 🌱
  • 👨‍👩‍👧‍👦 ఆదామును హవ్వను దేవుడు “మీరు ఫలించి భూమిని నిండించి” అనగానే ఒక పాస్టర్ గారు ప్రసంగం చేస్తున్నారు—ఆదామును దేవుడు ఆజ్ఞాపించాడు ఫలించమని, ఏం ఫలించాలంటే గలతి ఐదు లోకి వెళ్ళిపోయాడు. ప్రేమ, సంతోషము, సమాధానం అదంతా ఆదాము హవ్వలు ఫలించినారని ప్రసంగం చేస్తున్నాడు. ఆయన ఆ జనం పాపం బలి పశువులు అయిపోయి అట్లాగే కూర్చొని వింటున్నారు. నేను లేసి వెళ్ళిపోయాను, నాకు తలకాయ నొప్పి వచ్చింది. 🤕 ఎందుకంటే మీరు ఫలించి భూమిని నిండించి అన్నాడు దేవుడు. ఈ పెద్ద మనిషి చెప్తున్నాడు ప్రేమ, సంతోషం, సమాధానం ఫలించమని ఆదాముకు చెప్పాడని. ప్రేమ, సంతోషం ఎంత ఫలిస్తే భూమి నిండిపోద్ది? ఎంత ఫలించినా నిండదు! భూమిని నింపగలిగిన ఫలము గర్భఫలము. అది భౌతిక శారీరక గర్భఫలం, పిల్లల్ని కనమని దేవుడు చెప్పాడు అనేది ఆ పెద్ద మనిషికి ఇష్టం లేదు. ఎందుకంటే మరి అప్పుడు లైంగిక సంపర్కం ఉండాలి కదా, పరిశుద్ధ జీవితం ఉన్నప్పుడు పాపం ప్రవేశించక ముందు ఉండదుగా లైంగికత అనే మూర్ఖతలో ఉన్నాడు ఆయన. పిల్లల్ని కనమని దేవుడు చెప్పాడంటే మరి పాపం చేయమని చెప్పాడా అని ఆ ఇడియాటిక్ డాక్ట్రిన్ లో ఉండి, మరి పిల్లల్ని కనమని కాదు దేవుడు ప్రేమ సంతోషం ఫలించమని చెప్పారు అంటున్నాడు. తిక్కలోడ, మరి సంతోషం ఎంత ఫలిస్తే భూమి నిండిపోతుంది? కాబట్టి ఫలము అని కనబడగానే ఆత్మ ఫలానికి లింక్ చేయడము అనేది తప్పు. సమయం సందర్భం చూసి ఇంగితం ఉపయోగించి దాని వెనక ఏముంది ముందు ఏముందో చూసి మనం అన్వయించాలి. 🧠
  • 📖 అందుకే కదా నేను కష్టపడి, దేవుడు నన్ను ప్రేరేపిస్తే దేవుని చేత నేను బలపరచబడి ప్రామాణిక గ్రంథంలో రాశాను—హౌ టు ఇంటర్ప్రెట్ ద బైబిల్. అది అందరము నేర్చుకోవాలి. ఎవడు నేర్చుకుంటే వాడికే మంచిది. నాకేమో రూపాయి రాదుగా, లక్షల రూపాయలు ఖర్చుపెట్టి ప్రింట్ చేశారు, నాకేమో డబ్బు రాలేదు అప్పు మిగిలింది. చదువుకొని మేలు పొందండి అని వదిలేసాం. బైబిల్ ని మనం కాంటెక్స్చువల్ గా (Contextual) అంటే సందర్భోచితంగా వ్యాఖ్యానించాలి. గ్రామటికల్ గా (Grammatical) వ్యాకరణబద్ధంగా అన్వయించాలి. హిస్టారికల్ గా (Historical) చారిత్రిక నేపథ్యం యక్యూరేట్ గా చూసి అన్వయించాలి. ఎక్సిజిటికల్లీ (Exegetical) అంటే మూల భాషలో ఉన్న భావాలను కూడా వెలికి తీసి అక్కడ క్లాష్ రాకుండా అన్వయించాలి. ఈ నాలుగు విధాలు చూసినప్పుడు మనం కరెక్ట్ గా పరిశుద్ధాత్మ దేవుని స్వరాన్ని మనం గుర్తుపట్టగలుగుతాం. అది విషయం. సో ఈ యోహాను చెప్పిన ఫలం వేరు, పౌలు చెప్పిన ఫలం వేరు, మత్తయి 13లో యేసయ్య చెప్పిన ఫలం వేరు. ✅

Detailed English Translation: 🌍

🍎 Question: Matthew 3:8 speaks of “producing fruit worthy of repentance.” Are there degrees to repentance, similar to the thirty, sixty, and hundredfold yield mentioned elsewhere? Are there such differences in attaining repentance?

  • Distinction in Yield: The thirty, sixty, and hundredfold yield mentioned in Matthew 13:23 refers to those who hear and understand the Word on “good soil.” This is about bearing fruit through the Word. It depends on an individual’s degree of revelation, obedience, and surrender to God. Even if 100 people hear the same sermon, they won’t all bear fruit equally. It depends on their personal connection with God. 🔗
  • The Fruit of Repentance: John the Baptist is speaking of the “fruit worthy of repentance.” This fruit is the birth of an intense hatred and loathing for the evil one has committed in the past. It is distinct from bearing fruit through the Word or the Fruit of the Spirit. The term ‘fruit’ is broad; there is fruit in ministry, the fruit of the Spirit, and the “spiritual fruit of the womb” (winning souls). 🌱
  • Interpretation Error (Adam & Eve Example): When God told Adam and Eve to “be fruitful and multiply,” a certain preacher claimed this meant they should produce love, joy, and peace. I had to leave because it was nonsensical. 🤕 How can joy or peace physically fill the earth? The ‘fruit’ God commanded there was the physical fruit of the womb—having children. To link every ‘fruit’ to the spiritual fruit of Galatians is an error. We must use context and common sense. 🧠
  • How to Interpret the Bible: This is why I wrote the book ‘How to Interpret the Bible.’ We must interpret the Bible:
    1. Contextually: Understanding surrounding verses.
    2. Grammatically: Linguistic rules.
    3. Historically: Historical setting.
    4. Exegetical: Original meaning from source languages.
      By following these four methods, we can accurately recognize the voice of the Holy Spirit. ✅

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram