❓ ప్రశ్న: మార్కు 4:35-41 సన్నివేశంలో పెద్ద తుఫాను రేగి పడవ నిండిపోతుంటే యేసయ్య నిద్రిస్తున్నారు. ఆ పడవలో యేసయ్యతో పాటు మీరు మాత్రమే ఉంటే మీరు ఏమి చేసేవారు? ఆ సన్నివేశం నుండి మీరు మాకు ఇచ్చే సందేశం ఏమిటి? అటువంటి క్లిష్ట పరిస్థితులు మీ జీవితంలో ఎదుర్కొన్న ఉదాహరణలు ఉన్నాయా? వాటిని ఎలా ఎదుర్కున్నారు? (0:09:04)
📺 YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి
దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (06m 12s) 🎙️
- 🎵 పాటలోని అనుభవం: ఈ సిట్యుయేషన్ మీద రాసిందే “కారు చీకటి వేళ.. హోరుగాలి వీవ.. మోకరింతు నీదుమ్రోల.. కావవే కృపాలవాల” అనే పాట. అందులో ఒక చరణం ఉంటుంది—”శ్రమల అలలు నింగికెగసి మునగ సిద్ధమాయెనా.. యేసునాథ నీవే నాదు పడవలో పరుండ చూచి.. మోకరింతు నీదుమ్రోల కావవే కృపాలవాల”. ఆయన ఉన్నాడు నా పడవలో, నేను ఉన్నాను కనుక నాకు ఎలాంటి తుఫాను ఎదురైనా యేసయ్య ఉన్న పడవ నా పడవ, కనుక నాకేం పర్వాలేదు. ఆ పాట అంతా చదువుకుంటే అదే సమాధానం దీనికి. 🎶
- 💪 నిర్భయమైన పోరాటం: నాకు ఎన్నో సార్లు సంభవించినయి పరిస్థితులు. నేను ఇక మునిగిపోయి చచ్చిపోతాను, నాకు లైఫే లేదు అన్న పరిస్థితులు వచ్చినాయి. అప్పుడు నేను భయపడలేదు. ఈ లేఖన భాగము నుండే నేను భయపడకూడదు అనే పాఠం నేర్చుకున్నాను. ప్రాక్టికల్ గా కూడా నిర్భయంగా ఆ తుఫాను ఎదుర్కొన్నాను, బయటక వచ్చాను. అది ఎన్నో సార్లు జరిగింది నా లైఫ్ లో, ఒక్కసారి కాదు. ఎన్నో తుఫానులు! యేసయ్య ఉన్న పడవ మునిగిపోవడానికి వీలు లేదు అనే ధైర్యంతోనే ఎదురీది, ఆ పడవలో నేను సంతోషంగా ప్రార్థనలో యేసయ్య సన్నిధిలోనే సమయం గడిపి, చుట్టూ తుఫాను ఉంది, నా దగ్గర యేసయ్య ఉన్నాడు, ఆయన ముందు మోకరించి స్తుతిస్తూ తుఫానును దాటుకొని జయించి ఈ మజిలీకి వచ్చాను. 🛡️
- 👣 యాత్రికుడి పదధ్వనులు: పాటలు అంటేనే సందేశాలుగా తీసుకోవాలి తప్పకుండా. పాటలు అంటే ఒట్టిగా ఏదో సప్పుడు అయి ఉండవు, అవి భక్తుని జీవితానుభవాలు. నేను ‘యాత్రికుడి పదధ్వనులు’ అని ఉపోద్ఘాతంలో కూడా చెప్పాను—నేను దేవునితో నడిచినప్పుడు ఏర్పడిన అడుగుల సవ్వడి అని కూడా చెప్పాను. ఎవరికైనా పాట రాయడం కొరకు ఎప్పుడు నేను రాయలేదు పాట. ఆ అనుభవం నాకు కలిగింది గనుక దాన్ని స్వరబద్ధం చేసి ప్రజలకు అందించాను. 🚶♂️
- 🛣️ విశ్వాస యాత్రలో స్టేషన్లు: మీకు కలిగినటువంటి సందర్భాలు మిగతా భక్తులకు ఖచ్చితంగా 100% వస్తాయా అంటే—100% వస్తాయి. ఇప్పుడు ఇక్కడి నుంచి కూకట్‌పల్లి నుండి బీదర్ పోవాలనుకోండి, ఈ మధ్యలో చందానగర్, బిహెచ్‌ఇఎల్, సంగారెడ్డి, జహీరాబాద్ ఇవన్నీ తప్పకుండా వస్తాయి కదా! కనుక ఈ రూట్లో ఎవరు పోయినా అవే స్టేషన్లు, అవే బస్ స్టాప్‌లు వస్తాయి. అలాగే ప్రభువుని వెంబడిస్తూ సంపూర్ణ సిద్ధిలోనికి సాగిపోవాలి అనుకున్న వాడికి అవే అనుభవాలు ఎదురొస్తాయి. పౌలు నడిచిన దారిలో మనం నడిచినప్పుడు, అదే గురితో మనం నడిచినప్పుడు ఆయనకు సంభవించినవి మనకందరికీ సంభవిస్తాయి. 📍
Detailed English Translation: 🌍
❓ Question: In Mark 4:35-41, while a great storm arose and the boat was filling with water, Jesus was sleeping. If you were alone with Jesus in that boat, what would you have done? Have you faced such critical situations in your life, and how did you overcome them?
- Message Through Song: I have already written a song based on this very situation: “Karu Chikati Vela…” (In the time of pitch darkness…). One verse says: “Even if the waves of trouble rise to the sky and prepare to sink me, seeing You, Lord Jesus, sleeping in my boat, I will kneel before You… Protect me, O Fountain of Grace.” Since Jesus is in my boat, no matter what storm hits, I am safe. That song is the complete answer to this question. 🎶
- Personal Experience: Many times in my life, I faced situations where it felt like everything was over and I was about to sink. But I did not fear. I learned the lesson from this very scripture that I must not be afraid. Practically and fearlessly, I faced those storms and came out of them. A boat carrying Jesus cannot sink. With that courage, I spent my time joyfully in prayer in His presence, even while the storm raged outside, and I successfully crossed over to this stage of life. 🛡️
- Footsteps of a Pilgrim: My songs are my messages—they are the life experiences of a believer. As I mentioned in the introduction to ‘Yathrikudi Padadhwanulu’ (The Footsteps of a Pilgrim), these are the sounds of my footsteps while walking with God. I never wrote a song just for the sake of writing; I provided them to people only after experiencing them myself. 🚶♂️
- Stations in the Journey of Faith: If someone wants to travel from Kukatpally to Bidar, they will inevitably pass through Chandanagar, BHEL, Sangareddy, and Zaheerabad. These stations are unavoidable on that route. Similarly, anyone following the Lord toward spiritual perfection will encounter these same experiences. If we walk the path that Paul walked with the same goal, we will surely encounter the same ‘stations’ or trials he did. These are 100% common to all true believers. ✅
