❓ ప్రశ్న: 68వ కీర్తన నాలుగవ వచనంలో—”దేవుని గూర్చి పాడుడి ఆయన నామమును బట్టి స్తోత్ర గానము చేయుడి వాహనమెక్కి అరణ్యములలో ప్రయాణము చేయు దేవుని కొరకు ఒక రాజమార్గము చేయుడి యెహోవాను ఆయన నామమును బట్టి ఆయన సన్నిధిని ప్రహర్షించుడి” అని ఉంది. ఇందులో వాహనమెక్కి అరణ్యములో ప్రయాణము చేయు దేవుని కొరకు ఒక రాజమార్గము చేయుడి అన్న భావమును ఎలా అర్థం చేసుకోవాలి? ఇందులో మనం చేసే పని ఏమిటి? (0:15:16) 📖
📺 YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి
దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (04m 43s) 🎙️
- 🗣️ ప్రభువు వాహనము మరియు అరణ్య రోధనము: ఊరికే నన్ను అడగాలని అడుగుతారు తప్ప వాళ్ళకి తెలుసు. నన్ను అడగాలని అడగడం ఆయన ఏం చెప్తాడో చూద్దాం అనే సరదా! 😄 ఇప్పుడు బైబిల్ ఎవరిని ప్రాజెక్ట్ చేస్తున్నది? యేసుప్రభువునే! ✝️ గనుక వాహనమెక్కి అరణ్యంలో ప్రయాణం చేసే ఆ ప్రభువు ఇంకొక దేవుడైతే కాదు కదా! బైబిల్ చెప్తుంది అంటే ఏసుప్రభువు. కనుక ఏసుప్రభువు వారు వాహనమెక్కి అరణ్యములో ప్రయాణం చేస్తున్నాడు. అంటే ఆయన ప్రయాణం చేస్తున్న ఈ ప్రపంచము ఒక అడవిలాగా ఉన్నది. 🌳 “అరణ్యములో కేకవేయు ఒకని శబ్దం” అని అంటాడు బాప్తిసమ యోహాను. 📢 ఏదైనా మనము కేక వేసి చెప్పినా ఎవడు వినకపోతే, ఎంతసేపు చెప్పినా ఎవడు రెస్పాండ్ కాకపోతే అది ‘అరణ్య రోధనము’. 🗣️ అడవిలో ఏడ్చినట్టు ఉంటుంది, ఎవడు పట్టించుకోలేదంట. ఈ ప్రపంచం ఒక అరణ్యం లాంటిది, అక్కడ ప్రవక్త యొక్క పరిచర్య అరణ్య రోధనం లాగానే ఉంది. 🌫️ చెవిటివాని ముందు శంఖం ఊదినట్టుగా ఉంది. 🐚 అలాంటి ఈ లోకాన్ని అరణ్యంతో పోల్చాడు. 🏜️
- 🛣️ రాజమార్గము సిద్ధపరచుట – యోహాను మాదిరి: అరణ్యంలో ప్రయాణం చేసే దేవుడు ఇంకొక దేవుడైతే కాదు ఏసుప్రభువే కదా! ఆయన కొరకు ఒక రాజమార్గము చేయుడి అని అన్నాడు. 🚧 ఇదే పని “నేను ప్రభువు కొరకు మార్గము సరాళం చేస్తున్నాను” అని యోహాను బాప్తిసమ అని చెప్పాడు. ⛏️ కనుక యోహాను చేసిన పని ఇదే. దేవుని గూర్చి పాడుడి ఆయన నామమును బట్టి స్తోత్రగానము చేయుడి వాహన మెక్కి అరణ్యములలో ప్రయాణము చేయు దేవుని కొరకు ఒక రాజమార్గము సిద్ధపరిచాడు. 🛤️ ఇలా చేయండి అని మనకందరికీ పిలుపునిస్తున్నాడు. యోహాను ముందు ప్రభువు యొక్క త్రోవను సరాళం చేశాడు. అలాగే మనమందరం కూడా చేయాలి. 👣 ఇప్పటికీ లోకం అడవిలాగానే ఉంది సువార్త చెప్పినా పట్టించుకోవట్లేదు. 🔈 సంస్కరణ సిద్ధాంతం, సంస్కరణ ఉద్యమాన్ని పట్టించుకోవట్లేదు. 🚫 అంత్యకాలపు దేవుని ప్రణాళికను పట్టించుకోవట్లేదు ఒక మత విధానంలో పడి క్రైస్తవం కూడా ఒక మతం లాగా తయారైతుంది. ⛪ కాబట్టి ఇంటెలిజెంట్ గా దేవుని ప్రణాళిక ఇది ఉంది, దీంట్లో నేను పాల్గొనాలనేది ఎవరికీ కూడా స్పృహ రావడం లేదు. 🧠 అరణ్య రోధనమే ఇప్పటికీ కూడా, 45 ఏళ్లుగా మనం చేసేది కూడా అరణ్య రోధనమే ఈ అడవి లాంటి ఈ ప్రపంచంలో. 🌳
- 🐎 ప్రభువు రాకడకు సిద్ధపడుట: ఏసుప్రభు వారు వస్తున్నారు వాహనం ఎక్కి. ఆయన వాహనము అన్నాడు కానీ వాహనం ఏదో స్పెసిఫై చేయలేదు. ☁️ ఆయన కెరూబుల మీద ఆసీనుడు. 👼 ఆ తర్వాత భూమిమీద ఉన్నప్పుడు ఆయన గాడిద పిల్ల మీద ప్రయాణం చేశాడు. 🫏 రెండవ రాకడలో తెల్లని గుర్రం మీద ఆసీనుడయ్యాడు. 🐎 ఇట్లా అది ఒక సబ్జెక్ట్. ఎలాగైనా సరే ఈ ప్రపంచాన్ని యేసు రాకడ కొరకు సిద్ధపరచండి, ఆయన కొరకు మార్గము సిద్ధపరచమని చెబుతున్నాడు. 🌏 అలా సిద్ధపరిచినవాడు మొట్టమొదట బాప్తిసం ఇచ్చి యోహాను, వెనక మనమందరం. యోహాను లాగా మీరు పరిచర్య చేయమని పిలుపు అది. 📢 ఇది అంత పెద్ద డీప్ మర్మం ఏమి కాదు. మొదటి రాకడకు ఆయన మార్గం సిద్ధం చేశాడు, సరాళం చేశాడు, రెండవ రాకడ మనం మార్గం సరాళం చేద్దాం అని ఎన్నోసార్లు మనం చెప్పుకొని ఉన్నాం. ⏳
- 👂 సత్యమునకు చెవునివ్వని జనులు: సరే ఇప్పుడు మీరు ఏది చెప్పినా లేఖనం టు లేఖనం చెప్తారు. ఒక వచనం ఎత్తుకొని దానికి రిఫరెన్సు గా అనేక వచనాలను చూపెడుతూ మీరు పరిచర్య చేస్తుంటారు దైవ సందేశాన్ని రివీల్ చేస్తారు. 📖 చాలా మంది బోధకులు ఎక్కువ కాంగ్రిగేషన్ కలిగినటువంటి వారు కొన్నిసార్లు వాళ్ళు వచనమే ఎత్తుకోరు. ఒకవేళ ఒకే వచనం ఎత్తుకొని అదే గంటసేపు దాంట్లో చాలా రకాల విషయాలు తీసుకొచ్చి మాట్లాడేస్తారు. 🗣️ కానీ ప్రజలందరూ ఎక్కువ దానినే వినడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఎందుకంటే సత్యానికి చెవునివ్వరు అనే లేఖనం నెరవేరుతుంది. 📉 వాళ్లకు అంత డీపర్ డీపర్ లెవెల్ టీచింగ్ ప్రజలకి ఇష్టం లేదు. 🚫 జనులు, ప్రజలు సత్యమునకు చెవునివ్వక దురద చెవులు కలిగిన వారై కల్పనా కథల వైపు తిరుగుతారు, అది నెరవేరుతుంది. 📉 అంత్యకాలపు ఈ లోకానికి వాక్యం లోతుకు వెళ్లాలంటే ముందు విశ్వాసులకు ఆసక్తి (Curiosity) ఉండాలి కదా! ఏదో ఒకటి చెప్తారు లేండి కాసేపు విన్నట్టు విని, అది బుర్రకు ఎక్కించుకోకపోయినా కూడా “వింటే పుణ్యం వస్తుంది” అన్న కాన్సెప్ట్ లో ఉన్నారు వీళ్ళు. 🧘♂️
Detailed English Translation: 🌍
❓ Question: Psalm 68:4 says, “Sing to God… extol Him who rides through the deserts; rejoice before Him—His name is the Lord.” What does it mean to prepare a highway for God riding through the deserts? What is our role in this?
- The World as a Wilderness: The Bible projects Jesus. He is the one riding through the wilderness. 🚐 The world is compared to a desert. John the Baptist was a voice “crying out in the wilderness.” 📢 When a message is given but no one responds, it is a “cry in the desert”—ignored and unheard. 🏜️ The ministry today is often like blowing a trumpet before the deaf. 🐚
- Preparing the Highway: Preparing the way was the mission of John the Baptist. 🛤️ He made the paths straight for the Lord’s first coming. We are called to do the same today. 🚧 Even now, people ignore the reformation and God’s end-time plan. Christianity is becoming a ritualistic religion. ⛪ For 45 years, our ministry has been a cry in this wilderness. 📉
- The Lord’s Carriage: The Lord rides upon the Cherubim, rode a donkey’s colt on earth, and will return on a white horse. 🐎 The call is to prepare the world for His arrival. 🌍 John did it first; now it is our turn to prepare for His second coming. ⏳
- Itching Ears: People today don’t want deep teaching. 🚫 They have “itching ears” and turn toward myths. 📉 They listen just for the sake of merit (punyam) without internalizing the truth. 🧘♂️ The prophecy that they will not endure sound doctrine is being fulfilled. 📉
