❓ ప్రశ్న: నిర్గమకాండం 3:14లో “నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని” ఉంది కదా.. ఉన్నవాడు, అనువాడు ఇవి రెండు పదములా? లేక ఒకే పదమా? (1:16:35)
YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి
దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (07m 04s)
- 📜 పరిపూర్ణ జ్ఞానం: “నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పెను.. ఉండుననువాడు నన్ను మీ యొద్దకు పంపెను” అని ఇశ్రాయేలీయులతో చెప్పమన్నాడు. దేవుడు అంటే ఏంటో పరిపూర్ణమైన జ్ఞానం క్రీస్తు ప్రభువును బట్టే వచ్చింది.
- 🏛️ పేరు అక్కరలేని వాడు: మోషే అడుగుతున్నాడు – “నీ పేరు ఏమిటి?” అని. అప్పుడు ఆయన అన్నాడు – “నాకు పేరేమిటి? అసలు ఫస్ట్ అఫ్ ఆల్ నాకు పేరేమిటి? పేరు అక్కరలేని వాడను నేను”. ఇప్పుడు ఈ స్టూడియోలో మనుషులందరినీ పిలవాలంటే పేరు పెట్టి పిలవాలి. “ఓ మనిషి ఇటు రా” అంటే మనుషులందరూ వస్తారు. ఫలానా పేరు పెట్టి పిలిస్తేనే స్పష్టత ఉంటుంది.
- ⚖️ అద్వితీయుడు: దేవుళ్ళ లాగా, మనుషుల లాగా వందల మంది దేవుళ్ళు ఉంటే వాళ్ళకు పేరు అవసరం. “ఓ దేవా” అని పిలిస్తే ఏ దేవుడు రావాలి? కానీ దేవుడు అనేవాడు ఒకడే ఉన్నాడు, రెండోవాడు లేడు. కనుక దేవుడా అని పిలిస్తే వచ్చేవాడు ఒకడే. నా కేటగిరీలో నేను ఒక్కడినే ఉన్నప్పుడు పేరు ఎందుకు?
- ⏳ సర్వవ్యాపి: “ఉన్నవాడను అనువాడను” అంటే – అన్ని సమయములలో ఉన్నాను, అన్ని స్థలములలో ఉన్నాను. నేను లేని కాలము లేదు, నేను లేని స్థలము లేదు. ఒక వంద ఏళ్ల కిందట మనం లేము, ఇంకో వంద ఏళ్ళ అయిపోతే మనం ఉండం. కానీ ఆయన ఎల్లప్పుడూ ఉంటాడు.
- ✨ సృష్టికర్త: “ఉండుననువాడు” అంటే అర్థం ఏమిటంటే – ఇంతవరకు ఉన్నవాడనైతే, లేనివి కూడా ఉండేటట్టు చేసేవాడను. ఒకప్పుడు గాలి లేదు, నక్షత్ర మండలాలు లేవు.. ఆయన ఉండేటట్టు చేశాడు. “నేను చెప్పినందుకు ఇంకా కొన్ని కూడా ఉంటాయి” అనే వాడను నేను అని పరిచయం చేశాడు. మనుషుల లాగా నాకు పేరు ఎందుకురా? నా కేటగిరీలో ఇంకొకడు ఉంటే కదా! అన్న పాయింట్ అక్కడ ఆయన చెప్తున్నారు.
Detailed English Translation:
❓ Question: In Exodus 3:14, God says, “I AM THAT I AM.” Are ‘I AM’ and ‘THAT I AM’ separate words or one phrase?
- Perfect Knowledge: God said to Moses, “I AM THAT I AM.” He commanded him to tell the Israelites, “I AM has sent me to you.” The perfect knowledge of what God truly is came only through Christ the Lord.
- The One Who Needs No Name: When Moses asks, “What is Your name?” God replies, “What is my name? First of all, why do I need a name? I am the One who needs no name.” In a room full of people, you need names to distinguish one from another. But God is unique; there is no second God. Therefore, when you call upon “God,” only He answers.
- Eternal Presence: “I AM THAT I AM” means He exists in all times and all places. There is no time when He was not, and no place where He is not. Humans are temporary, but He is eternal.
- The Creator’s Power: “The One who causes to be” means that He brings into existence things that were not. He introduced Himself as the One who speaks and things come into being. He asks, “Why do I need a name like humans? There is no other in My category!”
