1071.Q: Vastu Shastra and Christianity – Spiritual Perspective (KSM 222) 🏠

❓ ప్రశ్న: క్రైస్తవులు వాస్తు శాస్త్రాన్ని పాటించవచ్చా? వాస్తు దోషం క్రైస్తవులకు వర్తిస్తుందా? ఇల్లు కట్టుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? (0:22:52)

YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి


దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (05m 30s)

  • 🧱 వాస్తు శాస్త్ర పునాది: వాస్తు శాస్త్రము మనకు లేదు. ఆ వాస్తు అనే శాస్త్రానికి మూలము ‘అష్ట దిక్పాలకులు’ ఉన్నారనే నమ్మకం. హిందువుల నమ్మకం ప్రకారం వాయుదేవుడు వాయువ్యానికి, అగ్ని దేవుడు ఆగ్నేయానికి.. ఇలా ఎనిమిది దిక్కులను ఎనిమిది మంది దిక్పాలకులు పరిపాలిస్తుంటారు అనేది పునాది. దాని మీద ఆధారపడింది వాస్తు శాస్త్రం.
  • ⚖️ బైబిలు దృక్పథం: కానీ బైబిలు ప్రకారం “ఆ దిక్కులన్నీ నిర్మించినది నీవే” అని కీర్తనకారుడు అంటాడు. అన్ని దిక్కులను పరిపాలించేది యేసయ్య మాత్రమే. మనకు అన్ని దిక్కులా యేసయ్య ఉన్నప్పుడు, వాడు చెప్పిన దిక్కున కూడా యేసయ్య ఉంటాడుగా! వాడు ఏదైనా చెప్పనీ.. అన్ని దిక్కులా నాకు ప్రభువు ఉన్నాడు అనే నమ్మకంతో ఒక మినిమమ్ (Minimum) రూల్స్ పాటించు.
  • 🏠 ప్రాక్టికల్ అవసరం: అయితే మనం ఇండియాలో ఉన్నాము గనుక, రేపు ఏదైనా ఇబ్బంది వచ్చి నీ ఇల్లు అమ్ముకోవాలంటే.. వాస్తు విరుద్ధంగా కడితే ఎవడూ కొనడు. మనకు ఆ నమ్మకాలు ఉన్నందుకు కాదు, దేశానికి ఆ నమ్మకాలు ఉన్నాయి. కనీసం గాలి, వెలుగు వచ్చేటట్టు చూసుకొని కట్టుకుంటే.. రేపు అవసరం వచ్చినప్పుడు ఎవడైనా కొనేటట్టు ఉంటుంది.
  • 🔍 సెల్ఫ్ కాంట్రడిక్షన్ (Self-contradiction): కచ్చితంగా వాస్తు అంటే అది సాధ్యం కాదు, ఎందుకంటే ఏ ఇద్దరు వాస్తు పండితులు కూడా ఏకీభవించరు. ఈ వాస్తు పండితులు చాలా మంది చినిగిపోయిన పంచె కట్టుకొని ఉంటారు. “వాస్తు నీకు తెలుసు కదా బాబు, నీ ఇంట్లోకి లక్ష్మిని తెచ్చుకోవచ్చు కదా” అని నేను అడిగితే.. “ప్రారబ్ధం అండి, భరించాలి” అంటారు. అంటే వాస్తు ఎటు తిప్పినా ప్రయోజనం లేదనే కదా!
  • 🔥 నిజమైన రక్షణ: మీరు అదేమీ పట్టించుకోకండి. మంచి దైవజనుడిని పిలిపించుకొని ఇంట్లో స్తుతి ఆరాధన పెట్టుకోండి. ప్రార్థన చేసి యేసు రక్తం చేయమని ఇల్లంతా చల్లుకోండి. ప్రతి రోజూ కుటుంబ ప్రార్థన, స్తుతి ఆరాధన అనే అగ్ని లాంటి ప్రార్థన అక్కడ పెట్టండి. అప్పుడు అన్ని దిక్కుల నుండి దెయ్యాలు పారిపోతాయి. అష్ట దిక్కులకు పాలకుడు మన యేసయ్య అని నిరూపించండి.

Detailed English Translation:

❓ Question: Can Christians follow Vastu Shastra? Does Vastu defect apply to Christians? What precautions should be taken while building a house?

  • The Foundation of Vastu: Vastu Shastra is not for us. Its foundation lies in the belief of ‘Ashtadikpalakas’—eight deities ruling eight directions (like Vayu for Northwest, Agni for Southeast). Vastu is built upon this specific religious belief system.
  • The Biblical View: The Psalmist says, “You have created all the directions.” According to the Bible, Jesus Christ is the sole ruler of every direction. If our Lord is present in every direction, He is also present in the direction mentioned by Vastu. Therefore, we should have faith that the Lord is with us everywhere.
  • Practical Consideration: However, since we live in India, if you ever need to sell your house, people may not buy it if it completely violates Vastu norms. Not because we believe in it, but because the society around us does. It’s wise to follow minimum rules for ventilation and light so that the house remains marketable.
  • Self-Contradiction: Vastu is not an exact science because no two Vastu consultants agree. Often, these consultants themselves live in poverty. When asked why they can’t bring prosperity to their own homes using Vastu, they blame fate. This proves that Vastu cannot change one’s destiny.
  • Conclusion: Do not worry about Vastu. Invite a man of God, conduct a worship service, and dedicate your home to Jesus. Establish a daily family prayer and atmosphere of praise. This spiritual fire will drive away evil from every direction. Prove that Jesus is the true Lord of all eight directions.

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram