1074.Q: Partakers of the Altar – Israel vs. Idolatry (KSM 222) 🥩

❓ ప్రశ్న: మొదటి కొరింథీ 10:18 ప్రకారం ‘బలి అర్పించిన వాటిని తినువారు బలిపీఠముతో పాలివారు కారా’ అంటే ఏమిటి? శరీర ప్రకారమైన ఇశ్రాయేలీయులు విగ్రహారార్పణ చేస్తున్నారా? (0:35:05)

YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి


దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (03m 48s)

  • 📜 లేవీయుల పద్ధతి: శరీర ప్రకారమైన ఇశ్రాయేలును చూడుడి; బలి అర్పించిన వాటిని తినువారు బలిపీఠముతో పాలివారు కారా? అనే మాట ఉంది. ఇక్కడ మీ ప్రశ్న ఏంటంటే – శరీర ప్రకారమైన ఇశ్రాయేలు అంటే వాళ్ళు విగ్రహారార్పణ చేస్తున్నారా అని? అరెరే! కాదు నాయనా. ఇశ్రాయేలు జనాంగాన్ని ఒక్కసారి చూడండి, అక్కడ జరుగుతున్న పద్ధతి ఏంటంటే – బలి అర్పించిన వాటిని కొంతమంది తింటున్నారు. ఎవరంటే వాళ్ళు ఇశ్రాయేలులో లేవీయులైన వాళ్ళు.
  • 🧱 యాజకుల హక్కు: బలి అర్పించి, ఆ బలిపీఠంలో మేము కూడా ఒక భాగమే అని వీళ్ళు తీసుకొని స్వేచ్ఛగా తింటారు. బలి అర్పించిన తర్వాత నీవు ఎట్లా తింటావయ్యా అంటే – “బలిపీఠంలో నేను కూడా ఒక భాగమే, నాకు హక్కు ఉన్నది” అని యాజకులు తింటారు. యాజకులైన వాళ్ళు బలి ద్రవ్యాలను తింటారు ఎందుకంటే – బలిపీఠంలో మేము కూడా ఒక భాగమే అనే ప్రకటన అది. ఇది ఇశ్రాయేలులో జరుగుతున్న పద్ధతి.
  • 🛡️ పడిపోయిన దేవదూతలు: అయితే ఇప్పుడు అన్యజనులందరూ దేవతలు అనుకొని ఆరాధించే శక్తులు ఏవైతే ఉన్నాయో.. అవి దేవుని మీద తిరుగుబాటు చేసి పడిపోయిన దేవదూతలే అనేది బైబిల్ కాన్సెప్ట్ (Concept). ఒకప్పుడు దేవుని దగ్గర నమ్మకంగా ఉండి, తిరుగుబాటు చేసి పడిపోయిన వాళ్లకు కూడా శక్తులు ఉన్నాయి. వాళ్లను భూలోకంలో అన్ని జాతుల వాళ్ళు దేవతలుగా ఆరాధిస్తున్నారు.
  • ⚖️ విగ్రహారార్పితము ఎందుకు తినకూడదు?: వాళ్లకు బలిపీఠాలు కట్టినప్పుడు దాంట్లో నుంచి మనం తిన్నాము అనుకో.. ఇప్పుడు అహరోను ఏమో యెహోవా దేవుని బలిపీఠంలో భాగము, నీవు నేనేమో పడిపోయిన దేవదూతల బలిపీఠంలో భాగం అయిపోతున్నాం. అందుకు విగ్రహారార్పితము తినకండి అని చెబుతున్నాడు. అంటే మనం ఎక్కడ తింటే ఆ బలిపీఠంతో ఏకమైపోతాము అన్నమాట.

Detailed English Translation:

❓ Question: What does 1 Corinthians 10:18 mean by ‘Are not those who eat the sacrifices partakers of the altar?’ Were the physical Israelites practicing idolatry?

  • The Levitical Practice: The verse says, ‘Consider the people of Israel: are not those who eat the sacrifices participants in the altar?’ Does this mean physical Israel practiced idolatry? Not at all. Look at the system in Israel; certain people were allowed to eat of the sacrifices. These were the Levites. They ate freely as a sign that they were part of the altar’s service.
  • Priestly Right: When asked how they could eat what was sacrificed, the priests responded, “I am part of the altar; I have the right.” By consuming the sacrificial meat, they declared their partnership with the altar of the Lord. This was the established order in Israel.
  • The Concept of Fallen Angels: According to the Bible, the powers that Gentiles worship as deities are actually fallen angels who rebelled against God. Though they were once faithful, they retained certain powers after their fall and are now worshipped by various nations.
  • Why Avoid Food Sacrificed to Idols?: If an altar is built for these beings and we eat from it, we become partakers of that altar. While Aaron was a partaker of the altar of Jehovah, eating idol food would make us partakers of the altar of fallen angels. This is why the scripture warns against eating food sacrificed to idols—because you become one with the altar from which you eat.

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram