❓ ప్రశ్న: ‘స్ప్లిట్ రాప్చర్’ (Split Rapture) సిద్ధాంతం అంటే ఏమిటి? ఇది లేఖనానుసారమేనా? ఒకేసారి కాకుండా రెండు గుంపులుగా ఎత్తబడటం అనేది సాధ్యమా? (1:03:11)
YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి
దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (07m 52s)
- 🛡️ సిద్ధాంత వివరణ: ‘స్ప్లిట్ రాప్చర్’ థియరీ ఏంటంటే – మహా శ్రమల కాలం (70వ వారం) ప్రారంభం కాకముందే ఒక గుంపు ఎత్తబడుతుంది. తర్వాత శ్రమల గుండా వెళ్ళిన వాళ్ళు, బుద్ధి లేని కన్యకలు, విడవబడ్డ వాళ్ళు.. శ్రమల ద్వారా వెళ్లి జయించి, తాము చేసిన పొరపాటు గ్రహించి దిద్దుకొని, ఆ శ్రమలను తట్టుకొని నిలబడి హతసాక్షులు అయిపోతారు. వాళ్ళు రెండవ గుంపుగా మళ్ళీ పునరుద్ధానం చెందుతారు. ఇది స్ప్లిట్ రాప్చర్ థియరీ.
- 📖 లేఖన విరుద్ధమైన అంశం: దీంట్లో ఉన్న ఇబ్బంది ఏమిటంటే – ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను ప్రభువు దిగి వచ్చును; అప్పుడు క్రీస్తు నందుండి మృతి పొందు వారు మొదట లేతురు. పునరుద్ధానం జరగాలంటే ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దంతోను ప్రభువు దిగి రావాలి. అప్పుడు స్ప్లిట్ రాప్చర్ థియరీ ప్రకారం – ఈ ఆర్భాటముతో ప్రభువు రెండు సార్లు రావాల్సి వస్తుంది.
- ⚖️ తర్క విరుద్ధమైన బోధ: ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దంతో వచ్చినప్పుడు కొంతమంది లేస్తారు.. కానీ ఆ ఆర్భాటం లేకుండా, శబ్దం లేకుండా ఇంకొంతమంది లేస్తారు అని ఎలా చెప్తాము? లేఖనం అది ఒప్పుకోదు. అదంతా ఫూలిష్ డాక్ట్రిన్ (Foolish Doctrine), కేవలం తర్క విరుద్ధము. దాన్ని అసలు కన్సిడర్ (Consider) కూడా చేయొద్దు.
- 🧱 సిద్ధాంతపరమైన అధికారం (Doctrinal Authority): చాలా గొప్ప దైవజనులు కూడా ఈ ప్రకారమే బోధిస్తున్నారు. కానీ అందరూ సర్వజ్ఞులు కారు బ్రదర్. వాళ్ళు సువార్త కొరకు దేవుడు పిలిచిన గొప్ప వాళ్ళే కావచ్చు, కానీ డాక్ట్రినల్ అథారిటీ (Doctrinal Authority) వాళ్ళు కారు. రక్షణ విషయంలో, సిద్ధాంత విషయంలో స్పష్టతను ఇవ్వడానికి దేవుడు అంత్య దినాలలో పంపిన ప్రవక్త ద్వారానే అన్నిటికీ కుదురుబాటు వస్తుంది. అది ఇప్పుడు ఓఫీర్ మినిస్ట్రీస్ తో ప్రారంభమైంది.
Detailed English Translation:
❓ Question: What is the ‘Split Rapture’ theory? Is it scriptural? Is it possible for the church to be raptured in two separate groups rather than all at once?
- Definition of the Theory: The ‘Split Rapture’ theory suggests that one group is raptured before the Great Tribulation (the 70th week) begins. Then, those who went through the tribulation—like the foolish virgins or those left behind—realize their mistake, endure the suffering, become martyrs, and are later resurrected as a second group. This is the core of the Split Rapture theory.
- Scriptural Conflict: The primary issue here is the biblical order of events. Scripture states that the Lord will descend with a shout and the voice of an archangel, and the dead in Christ will rise first. For a resurrection to occur, the Lord must descend with this shout and trumpet call. According to the Split Rapture theory, the Lord would have to descend with this ‘shout’ twice, which contradicts the Word.
- A Logical Fallacy: How can we claim that some rise with the shout and trumpet call, while others rise without it? Scripture does not support such a view. It is a foolish doctrine and logically inconsistent. It should not even be considered as a valid biblical teaching.
- Doctrinal Authority: Many great men of God might teach this, but not everyone is omniscient. They may be great evangelists called for the gospel, but they lack ‘Doctrinal Authority.’ Clarity in matters of salvation and core doctrine comes through the prophet sent by God in these end times to bring all things into order. This restoration of truth has now begun through Ophir Ministries.
