❓ ప్రశ్న: భవిష్యత్తులో రాబోయే అబద్ధ క్రీస్తు (Anti-Christ) పరిపాలనలో క్రైస్తవులు ఎలా నిలబడాలి? 666 ముద్ర వేయించుకోకుండా, అన్ని సౌకర్యాలు కోల్పోయినా విశ్వాసంలో స్థిరంగా ఉండటం ఎలా సాధ్యం? (0:47:02)
YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి
దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (03m 39s)
- 🌍 ఏక ప్రభుత్వ స్థాపన: ఇంకొక్క 10-15 సంవత్సరాలు గడిచే కొద్దీ.. ప్రపంచమంతా ఏక ప్రభుత్వం వచ్చేస్తుంది. ఆ ఏక ప్రభుత్వము ఒక అరబ్బు రాజు పరిపాలిస్తాడు. వాడు “నేనే దేవుణ్ణి” అని ప్రకటించుకుంటాడు. నన్ను దేవునిగా మొక్కి, ఆరాధించి, నా నెంబరును మీ నొసల మీద గానీ, కుడి చేతి మీద గానీ వేసుకుంటేనే మిమ్మల్ని బ్రతకనిస్తాను అంటాడు.
- 🧱 భయంకరమైన శ్రమలు: అప్పుడే మీకు ఉద్యోగాలైనా, తిండి గింజలైనా, రేషన్ షాపుకైనా అనుమతి ఉంటుంది. నన్ను దేవునిగా ఆరాధించకుండా ఇంకా ఏ దేవుణ్ణి నమ్మినా సరే.. మిమ్మల్ని చంపేస్తాను అని చెప్పే భయంకరమైన క్రూర మృగము వాడు. ఒక 15-20 సంవత్సరాల లోపల వాడు వస్తున్నాడు. అప్పుడు ఏం చేస్తారు?
- ⚖️ విశ్వాస వీరుల మాదిరి: ఇప్పుడు రిజర్వేషన్ నష్టపోతున్నామని భయపడి మేము హిందువులుగా చెప్పుకుంటాము, క్రైస్తవులం కాము అని డిక్లేర్ చేస్తాము అని ఎవరైనా బలహీనులు అనుకుంటే.. రేపు క్రీస్తు విరోధి పరిపాలనలో మీరు ఎలా నిలబడతారు? మనకు కావాల్సింది షద్రకు, మేషాకు, అబెద్నెగో లాంటి విశ్వాస వీరులు.
- ✨ స్థిరమైన నమ్మకం: “నాకు ఏ బెనిఫిట్స్ అయినా రద్దు చెయ్, ఉద్యోగం లేదని చెప్పు, తిండి గింజలు ఇవ్వకపోయినా సరే.. చంపినా సరే యేసుప్రభువును వదిలే ప్రసక్తి లేదు” అనే స్థిరమైన నమ్మకం ఉండాలి. యేసయ్య కాపాడుకుంటే ఇక్కడే ఉంటాం, లేదంటే ఆ మహిమలోకానికి వెళ్ళిపోతాం.
- 🏆 సిద్ధపాటు: ఈ మైండ్ సెట్ ప్రతి క్రైస్తవుడికి రావాలి. వాడు వచ్చినప్పుడు మీరు ఎలా నిలబడతారు? శ్రమల కొరకు ఇప్పుడే మెంటల్ గా ప్రిపేర్ కండి. రంజిత్ ఓఫీర్ ను ద్వేషించిన మూర్ఖులందరికీ ఇప్పుడు జరుగుతున్న రాజకీయ సంభవాలే తిరుగులేని జవాబు. ఇవన్నీ జరుగుతాయని నేను ముందే చెప్పాను, అదే జరుగుతోంది.
Detailed English Translation:
❓ Question: How should Christians stand firm in the future reign of the Anti-Christ? How can they prepare to refuse the Mark of the Beast (666) even if it means losing all livelihoods?
- A Global One-World Government: In the next 10-15 years, a one-world government will emerge, ruled by an Arab leader. He will proclaim himself as God and decree that only those who worship him and receive his mark (number) on their forehead or right hand will be allowed to live or survive.
- Severe Tribulations: Only with this mark will one have access to jobs, food grains, or even a ration shop. He is a terrifying, cruel beast who will execute anyone who refuses to worship him. He is coming within the next 15-20 years. What will you do then?
- Example of Faith Heroes: If some are weak enough to deny their Christian identity now just to keep their reservation benefits, how will they stand during the reign of the Anti-Christ? We need faith heroes like Shadrach, Meshach, and Abednego.
- Unwavering Conviction: We must have the conviction to say, “Cancel my benefits, take away my job, deny me food, or even kill me—I will never leave Lord Jesus.” If Jesus protects us, we remain here; otherwise, we enter His glory.
- Mental Preparation: Every Christian needs this mindset. Prepare yourselves mentally for these trials now. To those who hated Ranjith Ophir for these warnings, the current political events are an undeniable answer. I predicted these things would happen, and they are unfolding exactly as said.
