1134.Q: Prophet Nathan’s Permission and God’s Correction (KSM 221) 🏰

❓ ప్రశ్న: ప్రవక్త అయిన నాతాను మందిరం కట్టమని దావీదుకు పర్మిషన్ ఇచ్చాడు కదా, మరి దేవుడు దానిని ఎందుకు నిరాకరించాడు? ప్రవక్తలు లేదా దైవజనులు చెప్పేదంతా దేవుని వాక్కేనా? దీని నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటి? (2:12:15)

YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి


దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (04m 00s)

  • 🛡️ నాతాను వ్యక్తిగత అభిప్రాయం: దావీదు తన ఇంట నుండి ప్రవక్త అయిన నాతానును పిలిపించి మందిరం కట్టాలనే తన కోరికను చెప్పాడు. అప్పుడు నాతాను “దేవుడు నీకు తోడై ఉన్నాడు, నీ హృదయమందున్నదంతయు చేయుము” అని చెప్పాడు. అంటే ప్రవక్తగా ఆయన “మందిరం కట్టేసేయ్” అని పర్మిషన్ ఇచ్చేశాడు. కానీ అది దేవుని చిత్తం కాదు.
  • 🧱 దేవుని దిద్దుబాటు: ఆ రాత్రి దేవుని వాక్కు నాతానుకు ప్రత్యక్షమై.. “నీవు పోయి దావీదుతో ఇట్లు అనుము – ఆలయం కట్టించుట నీ చేత కాదు” అని చెప్పాడు. ఇక్కడ ముందు నాతాను తన సొంత మైండ్ తో “చెయ్యి” అని చెప్పాడు. మళ్ళీ దేవుడు ప్రత్యక్షమై దాన్ని కరెక్ట్ చేశాడు.
  • ⚖️ దైవజనుడు దేవుడు కాదు: దైవజనుడు దైవజనుడే కానీ దేవుడు కాదు, ఆయన కూడా కొన్నిసార్లు తన సొంత ఆలోచనలు చెప్పవచ్చు. నాతాను అంతటి ప్రవక్తే తన స్వంత ఆలోచనతో చెప్పినప్పుడు, దేవుడు దానిని మార్చాల్సి వచ్చింది. అందుకే ఏ దైవజనుడు చెప్పినా సరే, దానిని లేఖనాలతో పరీక్షించి చూసుకోవాలి.

Detailed English Translation:

❓ Question: Prophet Nathan gave David permission to build the Temple, so why did God reject it? Is everything a prophet or man of God says always the Word of God? What lesson should we learn from this?

  • Nathan’s Personal Opinion: David summoned the prophet Nathan to his house and shared his desire to build a temple. Nathan replied, “The Lord is with you; do all that is in your heart.” Essentially, as a prophet, he gave permission to go ahead with the construction. However, that was not God’s will.
  • Divine Correction: That night, the word of the Lord came to Nathan, saying, “Go and tell David—building the temple is not for you to do.” Here, Nathan initially spoke from his own mind. Later, God appeared and corrected that statement.
  • A Man of God is Not God: A man of God is just that—a servant, not God. Even they can sometimes speak from their own thoughts or perspectives. If a prophet as great as Nathan could speak from his own mind, necessitating a divine correction, it shows that we must examine everything spoken by any man of God against the Scriptures.

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram