❓ ప్రశ్న: 1 తిమోతి 1:19లో చెప్పబడిన ‘విశ్వాస విషయంలో ఓడబద్దలైపోవడం’ (Shipwreck of Faith) అంటే ఏమిటి? రక్షణ కోల్పోయి, సత్యాన్ని వదిలేసిన వారి ఆధ్యాత్మిక స్థితిని దేవుడు ఈ ఉపమానంతో ఎందుకు పోల్చాడు? (1:47:33)
YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి
దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (03m 27s)
- 🛡️ ఒక ఉపమానం (Idiom): అది ఒక ఇడియం, ఒక ఉపమానము. విశ్వాస విషయములో ఓడబద్దలైపోయినట్లు ఉన్నారు అన్నాడు. అంటే షిప్ రెక్స్ ఆఫ్ ఫెయిత్ (Shipwreck of faith). విశ్వాసాన్ని ఒక ఓడతో పోల్చారు.
- 🧱 మరణమే శరణ్యం: ఇప్పుడు సముద్రం మధ్యలో ఉన్నాం. అక్కడ ఏదో ఒక మంచు కొండనో, టైటానిక్ లాగా ఏదో ఒకటి గుద్దుకొని పగిలి ఓడ బద్దలైపోయింది. వాడు అక్కడి నుంచి సముద్రం వీధి వడ్డుకు రాగలడా? రాలేడు. అవతల ఒడ్డుకు వెళ్ళలేడు, ఎటు రాలేడు. బయలుదేరిన ఒడ్డుకు రాలేడు. అక్కడ ఎక్కడ బ్రతికే అవకాశం లేదు. అంటే ఇంకా వాడికి మరణమే శరణ్యము.
- ⚖️ ఆధ్యాత్మిక సర్వనాశనం: నో రికవరీ, నో ఎస్కేప్ (No recovery, no escape). అలాగా విశ్వాస విషయంలో.. ఇంకా వాడు పరలోకానికి వెళ్ళలేక, లోకంలోకి వెనక్కి రాలేక వాడు ఆధ్యాత్మికంగా సర్వనాశనం అయిపోయిన పరిస్థితి.
- ✨ భ్రష్టుల స్థితి: కొంతమంది సత్యాన్ని వదిలేసి, దేవుణ్ణి వదిలేసి, దేవుణ్ణి దూషించి భ్రష్టులు అయిపోయిన వాళ్ళు ఉన్నారు కదా.. అలాంటి వాళ్ళు విశ్వాస విషయంలో నడి సముద్రంలో ఓడ బద్దలు అయిపోయిన వాడిలాంటి వారు. వారి రక్షణ ఓడ మునిగిపోయింది, వారు ఆధ్యాత్మికంగా నాశనమైపోయారు అని దీని అర్థం.
Detailed English Translation:
❓ Question: What does the term ‘Shipwreck of Faith’ mentioned in 1 Timothy 1:19 mean? Why did God use the analogy of a broken ship to describe the spiritual state of those who abandon the truth?
- A Biblical Idiom: This is an idiom, a parable. The scripture says they have made a “Shipwreck of faith.” Here, faith is compared to a ship that carries us through the journey of life.
- Death as the Only Outcome: Imagine being in the middle of the ocean. If the ship hits an iceberg, like the Titanic, and shatters, can the person reach the shore? No. They can’t move forward to the destination, nor can they return to where they started. There is no chance of survival out there. In such a state, death is the only inevitable outcome.
- Spiritual Devastation: It is a state of ‘No recovery, no escape.’ Similarly, in matters of faith, such individuals can no longer reach Heaven, nor can they truly return to the world; they are spiritually devastated.
- The State of Apostates: There are those who abandon the truth, leave God, and even blaspheme Him, becoming apostates. Such people are like someone whose ship has shattered in the middle of the deep sea. Their vessel of salvation is lost, and they are spiritually ruined.
