❓ ప్రశ్న: 1 తిమోతి 1:20లో పౌలు భక్తుడు హుమెనై మరియు అలెక్సాంద్రులను ‘సాతానుకు అప్పగించాను’ అని చెప్పాడు. అసలు సాతానుకు అప్పగించడం అంటే ఏమిటి? దేవుని బిడ్డలకు ఉండే దైవిక కాపుదల (Divine Protection) తొలగించబడితే కలిగే పరిణామాలు ఏమిటి? (1:49:50)
YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి
దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (04m 20s)
- 🛡️ భయంకరమైన శిక్ష: హుమెనై మరియు అలెక్సాంద్రు.. వీళ్ళు దైవదూషణ చేయకూడదని నేను వాళ్ళను సాతానుకు అప్పగించాను అని పౌలు భక్తుడు తిమోతికి రాస్తున్నాడు. సాతానుకు అప్పగించడం అంటే ఏంటి? చాలా భయంకరమైన శిక్ష ఇది. ఇది కేవలం మాటలతో చెప్పేది కాదు, ఆత్మీయ అధికారంతో చేసే పని.
- 🧱 దైవిక కంచె తొలగింపు: దేవుని బిడ్డలకు దేవుని కాపుదల ఉంటుంది. కీర్తన 34:7 – “యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును.” అయితే ఎవరైనా సత్యాన్ని వదిలేసి, దేవుణ్ణి దూషిస్తూ, విశ్వాస ఘాతకులుగా మారితే.. అపోస్తలులకు ఒక అధికారం ఉంది. వాళ్ళ మీద ఉన్న దేవుని ప్రొటెక్షన్ (Protection) ను తీసేయడం.
- ⚖️ సాతాను అధికారం: ఎప్పుడైతే ఆ దైవికమైన కంచె తీసేస్తారో, సాతాను గాడు వస్తాడు. వాడు వచ్చి రోగాలతోటో, కష్టాలతోటో, నానా రకాల ఇబ్బందులతోటో వాళ్ళను కుమ్మేస్తాడు. ఎందుకు అలా చేయాలి అంటే – ఆ దెబ్బలకైనా వాళ్ళు భయపడి, దైవదూషణ చేయకుండా మారుమనస్సు పొందుతారేమో అని.
- ✨ శరీర నాశనము – ఆత్మ రక్షణ: అంటే బాడీని డెస్ట్రాయ్ (Destroy) చేయడానికి సాతానుకు పర్మిషన్ ఇచ్చేయడం. కానీ ఆత్మను రక్షించడానికి అది ఒక అవకాశం. కొరింతి సంఘంలో కూడా ఒక వ్యక్తి విషయంలో పౌలు ఇదే చెప్పాడు. దేవుని సేవకులకు వ్యతిరేకంగా ఉండి, సత్యాన్ని వక్రీకరించే వారిని దేవుని కాపుదల నుండి దూరం చేయడమే ‘సాతానుకు అప్పగించడం’. ఇది చాలా సీరియస్ మేటర్ (Serious Matter).
Detailed English Translation:
❓ Question: In 1 Timothy 1:20, Apostle Paul mentions that he ‘delivered Hymenaeus and Alexander to Satan.’ What does it mean to deliver someone to Satan? What are the consequences when divine protection is removed from a believer?
- A Terrible Punishment: Paul wrote to Timothy that he delivered Hymenaeus and Alexander to Satan so they would learn not to blaspheme. What does it mean to deliver someone to Satan? This is a terrifying punishment. It is not just a verbal statement but an act performed with spiritual authority.
- Removal of the Divine Hedge: God’s children enjoy His protection. Psalm 34:7 says, “The angel of the Lord encamps all around those who fear Him and delivers them.” However, if someone abandons the truth, blasphemes God, and becomes a traitor to the faith, apostles have the authority to remove that divine protection.
- The Dominion of Satan: Once that divine hedge is removed, Satan takes over. He afflicts them with diseases, hardships, and various troubles. The purpose behind this severe measure is discipline—hoping that through these afflictions, they might fear God, cease their blasphemy, and reach a state of repentance.
- Destruction of the Flesh – Salvation of the Soul: This means giving Satan permission to destroy the physical body while providing an opportunity for the soul to be saved. Paul mentioned a similar instance regarding an individual in the Corinthian church. To distance those who oppose God’s servants and distort the truth from divine protection is what ‘delivering to Satan’ means. It is a very serious spiritual matter.
