1170.Q: The Seven Foundation Stones of the Church (KSM 219) 🧱

❓ ప్రశ్న: ఎఫెసీ 2:20 మరియు హెబ్రీ 6:1-3 ప్రకారం సంఘానికి దేవుడు వేసిన ఏడు పునాది రాళ్లు ఏమిటి? గతంలోని గొప్ప బోధకులు కూడా రెండవ రాకడ (Second Coming) సిద్ధాంతం విషయంలో ఎందుకు పొరపడ్డారు? ఈ పునాదులను మరమ్మత్తు చేయాల్సిన అవసరం ఏమిటి? (0:36:30)

YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి


దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (09m 00s)

  • 🛡️ ఏడు పునాదులు: సంఘానికి దేవుడు ఏడు పునాది రాళ్లు వేశాడు. ఎఫెసీ 2:20 ప్రకారం క్రీస్తు యేసు ముఖ్యమైన మూల రాయి ఉండగా.. మొదటి మూల రాయి అనేది ‘వ్యక్తి రూపక రాయి’. మిగతా ఆరు వ్యక్తులు కాదు, సిద్ధాంత రూపక పునాదులు. అపోస్తలులు, ప్రవక్తలు వేసిన ఈ పునాదుల గురించి హెబ్రీ 6:1-3 వచనాల్లో వివరించబడింది.
  • 🧱 ఆరు సిద్ధాంత రూపక పునాదులు: యేసు ప్రభువు అనే ముఖ్యమైన మూలరాయి కాకుండా మిగతా ఆరు ఇవి:
    1. నిర్జీవ క్రియలను విడిచి మారుమనస్సు పొందుట,
    2. దేవుని యందలి విశ్వాసము,
    3. బాప్తిస్మములను గూర్చిన బోధ,
    4. హస్త నిక్షేపణము,
    5. మృతుల పునరుద్ధానము,
    6. నిత్యమైన తీర్పు.
      మొత్తం ఈ ఏడు కలిసి పరిపూర్ణమైన పునాది అవుతుంది.
  • ⚖️ గత బోధకుల పొరపాట్లు: ఇందులో చివరి రెండు (మృతుల పునరుద్ధానం, నిత్యమైన తీర్పు) రెండవ రాకడ సిద్ధాంతాలు. నాకు ముందు వచ్చిన బోధకులు – స్టాంటన్ గారు, బ్రెనహం గారు, అపోజిల్ పి.ఎం. సమయేల్ గారు, భక్త్ సింగ్ గారు, గుంటూరు రాజారావు గారు, ఆర్.ఆర్.కె. మూర్తి గారు, ఫాదర్ ముంగమూరి దేవదాస్ అయ్య గారు.. వీళ్ళందరూ ఇక్కడ పప్పులో కాలేశారు. వారి సమాచారం అంతా కరెక్టే కానీ, “శ్రమల కాలానికి ముందే సంఘం వెళ్ళిపోతుంది” అని రాంగ్ ల్యాండింగ్ (Wrong Landing) చేశారు.
  • పునాదుల మరమ్మత్తు: కొత్త నిబంధన సంఘ పునాదులు మరమ్మత్తు చేయాలి. బాప్తిస్మములను గూర్చిన బోధ, మారుమనస్సు, విశ్వాసం, హస్త నిక్షేపణం.. ఇవన్నీ సరిచేయాలి. ఐదు, ఆరు రాళ్లు (రెండవ రాకడ బోధ) కూడా మరమ్మత్తు చేయాలి. ఈ పని చేయడానికే దేవుడు నన్ను పంపాడు. మిగతా బోధకులు తమ జ్ఞానాన్ని కలిపి కొత్త సిద్ధాంతాలు (దుర్బోధలు) తయారు చేసి పునాదులను పాడు చేశారు. వాటన్నిటినీ వాక్యానుసారంగా దిద్దడమే నా పరిచర్య ఉద్దేశం.

Detailed English Translation:

❓ Question: What are the seven foundation stones God laid for the Church according to Ephesians 2:20 and Hebrews 6:1-3? Why did great preachers of the past err regarding the doctrine of the Second Coming? Why is there a need to repair these foundations?

  • The Seven Foundations: God laid seven foundation stones for the Church. According to Ephesians 2:20, Jesus Christ is the chief cornerstone, representing the ‘Personal Foundation.’ The remaining six are not persons but ‘Doctrinal Foundations’ laid by apostles and prophets, as described in Hebrews 6:1-3.
  • Six Doctrinal Foundations: Besides the cornerstone of Jesus Christ, the six foundations are: 1. Repentance from dead works, 2. Faith toward God, 3. The doctrine of baptisms, 4. Laying on of hands, 5. Resurrection of the dead, and 6. Eternal judgment. Together, these seven form the perfect foundation.
  • Errors of Past Preachers: The last two—Resurrection of the dead and Eternal judgment—pertain to the Second Coming. Many great preachers before me, including Stanton, Branham, P.M. Samuel, Bakht Singh, Guntur Raja Rao, R.R.K. Murthy, and Mungamuri Devadas, made a mistake here. While their information was mostly correct, they made a ‘wrong landing’ by teaching that the Church would be raptured before the Great Tribulation.
  • Repairing the Foundations: The foundations of the New Testament Church need repair. Repentance, faith, baptism, and the laying on of hands—all need to be set right. Especially the fifth and sixth stones regarding the Second Coming must be corrected. God sent me to perform this restoration. Other preachers often blended God’s word with their own human wisdom, creating false doctrines. My mission is to align these foundations strictly with the Word of God.

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram