1178.Q: Difference in Prophecy and Biblical Basis (KSM 218) 🛡️

❓ ప్రశ్న: విలియం బ్రెన్హామ్ గారు లాస్ ఏంజిల్స్ శిక్ష గురించి చెప్పినదానికీ, మీరు మీ ‘యుగాంతం’ గ్రంథంలో అమెరికా గురించి చెప్పినదానికీ ఉన్న ప్రధాన వ్యత్యాసం ఏమిటి? కేవలం అగ్ని ప్రమాదాలే జరుగుతాయని చెప్పడానికి మీరు తీసుకున్న వాక్యాధారం ఏమిటి? (0:05:13)

YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి


దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (05m 30s)

  • 🛡️ లాస్ ఏంజిల్స్ వర్సెస్ అమెరికా: లాస్ ఏంజిల్స్‌ని శిక్షిస్తాడు అని ఆయన (బ్రెన్హామ్) చెప్పారు కానీ.. అగ్ని ప్రమాదాలే (Fire accidents) అవుతాయి అనే సంగతి నేను చెప్పడానికి తీసుకున్నటువంటి ఆధారం ఎహెజ్కేలు 39:6. స్పెసిఫిక్ గా అగ్ని ప్రమాదాలే జరుగుతాయని బ్రెన్హామ్ గారు చెప్పలేదు. ఆయన లాస్ ఏంజిల్స్ అనే ఒక్క పట్టణం పేరు చెప్పారు. కానీ నేను ‘యుగాంతం’ గ్రంథంలో హోల్ అమెరికన్ కాంటినెంట్ (Whole American continent) గురించి అన్నాను.
  • 🧱 ద్వీపముల మీదికి అగ్ని: వాక్యంలో “ద్వీపములలో నిర్విచారముగా నివసించు వారి మీదికిని అగ్ని పంపెదను” అని ఉంది. ద్వీపములు అంటే అమెరికా.. ఉత్తర మరియు దక్షిణ అమెరికా ఖండాలు ద్వీపముల్లాగానే ఉంటాయి, చుట్టూ నీళ్లు ఉంటాయి. కనుక నేను అమెరికా అంతటి గురించి మాట్లాడాను. ఆయన అమెరికా అంతటి గురించి మాట్లాడలేదు, కేవలం లాస్ ఏంజిల్స్ గురించి మాట్లాడారు. అది కూడా అగ్నితోనే నష్టం అవుతుంది అని ఆయన చెప్పలేదు.
  • ⚖️ ప్రవచన నెరవేర్పు ప్రారంభం: నేను చెప్పిన ప్రవచనంలో ఇదొక ప్రారంభం మాత్రమే. అగ్ని ప్రమాదాలే కాదు.. భూకంపాలు వస్తాయి, వరదలు వస్తాయి. అనేకమైన ఉపద్రవాల వల్ల అమెరికా మొత్తం నిర్వీర్యం అయిపోతుంది. రష్యా మరియు మాగోగు వారు ఇశ్రాయేలు మీదకు దండెత్తినప్పటికల్లా అమెరికా వారు ఏమాత్రం హెల్ప్ (Help) చేయలేని పరిస్థితిలో ఉంటారు అనేది నేను చెప్పిన విషయం.
  • విశ్వసనీయత కోసమే: నేను ఇలా అమెరికాను దేవుడు శిక్షించబోతున్నాడు అని చెప్పింది నన్ను ప్రవక్తగా గుర్తించండి అని కాదు. నా ప్రవక్త స్టేటస్ కు ఇది నిరూపణగా నేను చెప్పలేదు. బైబిల్ సత్యం అని అప్పుడైనా నమ్మండి అని అన్యులకు, క్రైస్తవేతరులకు చెప్పాను. బైబిల్ యొక్క క్రెడిబిలిటీని (Credibility) ఎస్టాబ్లిష్ చేయడానికి ఆ విషయం చెప్పాను తప్ప, నేను గొప్పవాడినని చెప్పుకోవడానికి కాదు.

Detailed English Translation:

❓ Question: What is the primary difference between William Branham’s prophecy about Los Angeles and what you wrote about America in your book? What biblical evidence did you use to specifically mention fire accidents?

  • Los Angeles vs. The Continent: Branham spoke about the punishment of Los Angeles, but he did not specifically mention ‘fire accidents.’ I used Ezekiel 39:6 as my basis for predicting fire. While he named only one city, I referred to the entire American continent in ‘The End of the Present Age.’
  • Fire upon the Isles: The scripture says, “I will send fire on Magog and on those who live in security in the coastlands (islands).” Geographically, the American continent (North and South) is surrounded by water, much like islands. Therefore, I spoke about the whole continent. Branham did not speak of the entire USA, nor did he specify that the destruction would be caused by fire.
  • A Multitude of Calamities: These fire accidents are just the beginning. I predicted earthquakes, floods, and various other disasters that would weaken America. By the time Russia and Magog invade Israel, America will be in such a state of collapse that it will be unable to provide any assistance to Israel.
  • For the Credibility of the Bible: I did not share these predictions to establish my status as a prophet. In fact, in my sermons, I stated these things to non-Christians so they would realize the Bible is true. My goal was to establish the credibility of the Word of God so that people would believe and come to baptism, not to glorify myself.

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram