1181.Q: Respect for Saints vs. Doctrinal Integrity (KSM 218) 🛡️

❓ ప్రశ్న: గతంలోని గొప్ప భక్తులైన దేవదాస్ అయ్యగారు, పి.ఎం. సమయేల్ గారు, భక్త సింగ్ గారు, ఆర్.ఆర్.కె. మూర్తి గారు వంటి వారిని మీరు ఎంతో గౌరవిస్తారు. మరి అదే సమయంలో, రెండవ రాకడ సిద్ధాంతం విషయంలో మాత్రం వారు చెప్పింది తప్పు అని, వారు పప్పులో కాలేశారని ఎందుకు ఖండితంగా చెబుతున్నారు? మీ దగ్గర ఉన్న ఆ ప్రత్యేకమైన స్పష్టత వెనుక మర్మం ఏంటి? (0:19:38)

YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి


దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (25m 30s)

  • 🛡️ సత్యము – అసత్యము మధ్య నిలబడటం: ఏ భక్తుడు కూడా మొత్తం తప్పు చెప్పలేదు, ఏ భక్తుడు కూడా 100% ట్రూత్ (Truth) చెప్పలేదు. ప్రతి భక్తుని బోధలో చాలా వరకు సత్యం ఉంటుంది, ఏదో ఒక విషయంలో అసత్యం ఉంటుంది. సత్యము ఎవరు చెప్పినా నేను నేర్చుకోవాలి, అసత్యము ఏ ఎంత గొప్ప భక్తుడు చెప్పినా దాన్ని ఖండించి సత్య బోధ కొరకు పోరాడాలి అనే ఒక స్టాండ్ (Stand) దేవుడు నాకు ఇచ్చారు. అది దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యక్షత.
  • 🧱 నేర్చుకున్న భక్తులు – వారి పొరపాట్లు: భక్త సింగ్ అయ్య గారిని నేను ఎన్నో సార్లు ఆదర్శ భక్తునిగా చెప్పుకుంటా, కానీ ఆయన పరిశుద్ధాత్మ అన్యభాషలు ఒప్పుకోలేదు, అది దయ్యం పట్టింది అనేవారు. పి.ఎం. సామ్యూల్ గారు మాకు తండ్రితో సమానం, కానీ రెండవ రాకడ సమయం (Time of Second Coming) విషయంలో ఆయన మొత్తం తప్పు. వీళ్ళందరూ క్లారెన్స్ లర్కిన్స్ గారి ‘డిస్పెన్సేషనల్ ట్రూత్’ (Dispensational Truth) ఫాలో అయినారు. భక్తులను గౌరవిస్తూనే, వారి రచనలలో ఎక్కడ పొరపాటు తప్పటేశారు అనేదాన్ని నేను వాక్యాధారాలతో తెలుసుకున్నాను.
  • ⚖️ వైటమ్మ గారి ప్రభావం: సెవెంత్ అడ్వెంటిస్ట్ స్థాపకురాలు ఎల్.ఎన్.జి వైట్ అమ్మ గారిని గూర్చి కూడా నేను చెప్పాను. ఆమెకున్న బైబిల్ పరిజ్ఞానము, వాక్చాతుర్యము చూస్తే ఏ మగోడు ఆమె ముందు పనికిరాడు. ఆమెలో నుండి నేను ఎంతో నేర్చుకున్నాను, కానీ ఆమెను అంతగా అభిమానించి కూడా సెవెంత్ అడ్వెంటిస్ట్ ఎందుకు కాలేదు? ఎందుకంటే ఆమె చెప్పిన శనివారపు ఆరాధన ‘నీడ’ (Shadow) మాత్రమే అని స్టాండ్ తీసుకున్నాను. కొలస్సి 2:16 ప్రకారం అది నిజస్వరూపం కాదు.
  • 🛡️ బాబ్ క్రో (Bob Crow) తో అనుబంధం: బాబ్ క్రో (రాబర్ట్ క్రో) గారు నాకు ఎంత క్లోజ్ అంటే.. నేను బ్రహ్మచారిగా ఉన్నప్పుడు నా కొరకు పెళ్లి సంబంధాలు కూడా చూశారు. ఆయన ‘ద లాస్ట్ టుమారో’ (The Last Tomorrow) అనే పెద్ద గ్రంథం రాశారు. ఆయన మిడ్-ట్రిబ్యులేషన్ రైట్ ఏమో అనిపించింది కానీ, “We cannot be judgmental” అని కాన్ఫిడెంట్ గా (Confidently) చెప్పలేకపోయాడు. నేనైతే – ఇది తప్ప ఇంకేది నమ్మినా ఎజబేలు బోధే, దయ్యము బోధే అని అంత దూకుడుగా, కాన్ఫిడెన్స్ తో చెప్పాను.
  • 🧱 కొత్త నిరూపణలు – నా స్వంత లైన్: ప్రతి సిద్ధాంతాన్ని కనీసం రెండు జంట వచనాలతో (జతపక్షుల సిద్ధాంతము) నిరూపించుకోవాలని చెప్పింది నేనే. నెఫీలులు అంటే ఎవరు అనేది 40 ఏళ్ల కిందటే ఖచ్చితమైన నిరూపణతో చెప్పాను. మహోన్నతుడు వేరు, సర్వశక్తుడు వేరు అని చెప్పింది నేనే. ఎవరిదో కాపీ కొట్టిన వానికి ఇంత టఫ్ స్టాండ్ (Tough stand) ఎలా వస్తుంది? పౌలు చెప్పిన రెండు సాక్ష్యాలు రైటే – ప్రవక్తలు చెప్పినవి కాక కొత్తగా ఏం చెప్పటం లేదు, కానీ కొత్త కోణంలో ఫైనల్ కంక్లూజన్ (Final conclusion) నేరుగా పైనుండి పొందుకున్నాను.
  • గర్జించిన బోధకుడు: ఈ వారం మధ్యలో ఎత్తబడటం తప్ప ఏది నమ్మినా అబద్ధములకు జనకుడైన సైతాను తెచ్చిపెట్టిన బోధ. మీరు రెండవ రాకడకు సిద్ధపడాలంటే మిగతావన్నీ తీసి పారేయండి, ఇదే రైట్ అని గర్జించిన బోధకుడు ఎవడు? ఒంటరి పోరాటం చేశాను. భక్తులందరూ నాకు గురువులే, కానీ విశ్వగురువైన యేసుని అందరికంటే పైన పెట్టాను. ఎవరైనా తప్పు కావడానికి అవకాశం ఉంది కానీ బైబిల్ లో యేసయ్య చెప్పింది తప్పు కావడానికి అవకాశం లేదు.

Detailed English Translation:

❓ Question: You deeply respect past saints like Devadas Ayya, P.M. Samuel, Bakht Singh, and R.R.K. Murthy. Why then do you firmly state that they were wrong regarding the doctrine of the Second Coming? What is the secret behind the absolute clarity you claim to possess?

  • Truth vs. Falsehood: No saint spoke 100% truth or 100% error. I learn truth from anyone, but I must oppose error even if it comes from a beloved saint. This is a stand God gave me through vertical revelation.
  • Identifying Errors in Great Men: I admire Bakht Singh, yet he called speaking in tongues demonic. P.M. Samuel was like a father, but he followed Clarence Larkin’s flawed timeline for the Second Coming. I respect these men, but I used the Scriptures to pinpoint where they stepped into error.
  • Respect for Ellen G. White: I said no man could stand before Ellen G. White’s biblical knowledge and eloquence. I learned much from her, yet I refused to become a Seventh-day Adventist because her Saturday Sabbath teaching is a ‘shadow,’ not the substance of Christ, according to Colossians 2:16.
  • Relationship with Bob Crow: Robert Crow (Bob Crow) was so close to me that he brought marriage proposals for me when I was a bachelor. He wrote ‘The Last Tomorrow’ and assessed mid-tribulation as likely correct, but he said, “We cannot be judgmental.” I, however, declared with absolute confidence that anything other than mid-tribulation rapture is the doctrine of Jezebel and demons.
  • New Proofs – My Own Outline: I am the one who established the ‘Doctrine of Pairs,’ requiring at least two sets of verses for any teaching. 40 years ago, I gave the definitive proof regarding the Nephilim. I distinguished between the Most High and the Almighty. How could someone who merely copies others possess such a tough stand? Like Paul, I state nothing outside the prophets, yet I received the final conclusion directly from above.
  • The Roaring Preacher: Any teaching other than the rapture in the middle of the week is from the father of lies. Who else has fought this battle alone and roared with such confidence? All these saints are my teachers, but I place Jesus, the Universal Teacher, above all. While any man can be wrong, Jesus and the Bible can never be wrong.

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram