1186.Q: Faith in Times of Tragedy – Viral Video Response (KSM 217) ⚖️

❓ ప్రశ్న: చర్చికి వెళ్లే ఒక పెద్దావిడ కుమారుడు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. “దేవుడు నీ కొడుకును కాపాడలేదు కనుక ఆ మతాన్ని వదిలేయ్” అని కొందరు మాట్లాడుతున్న వీడియో వైరల్ అవుతోంది. ఇలాంటి సంఘటనలను చూసి మతం మారాలని చెప్పడం సరైనదేనా? ఆపదలు వచ్చినప్పుడు భక్తుల వైఖరి ఎలా ఉండాలి? (0:06:27)

YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి


దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (06m 10s)

  • 🛡️ మతోన్మాదం కాదు – మానవత్వం: మరణం సంభవించినప్పుడు దేవుణ్ణి ఎవరూ వదిలిపెట్టరు. మూర్ఖులు మాత్రమే అలా మాట్లాడతారు. హిందువులలో అన్నమయ్య, త్యాగరాజు, తులసీదాసు, కబీర్ దాసు, వివేకానంద వంటి శ్రేష్టమైన భక్తులు ఉన్నారు. వాళ్ళు అసలైన హిందువులు. వాళ్ళ దగ్గర మనం భక్తిని నేర్చుకోవాలి. అలాంటి వాళ్ళు ఇలాంటి విషాద సంఘటనలను చూసి హర్షించరు.
  • 🧱 గాయాలు తగిలినప్పుడు భక్తి: భక్తి ఉన్నతమైన శిఖరానికి వెళ్ళినప్పుడు.. దేవుడు ఎందుకో నాకు ఈ గాయం చేశాడు అని ఇంకా ఆయననే అల్లుకుపోతారు. ఒక చిన్న బిడ్డకు గాయం తగిలితే, అమ్మే కొట్టినా సరే ఆ అమ్మ కాళ్ళనే వాటేసుకుని ఏడుస్తుంది. భక్తులు కూడా అంతే. దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు అనుకుంటారు తప్ప దేవుణ్ణి వదిలేయరు.
  • ⚖️ యోబు మాదిరి: బైబిల్ లో యోబు కూడా అంతే కదా! పదిమంది కొడుకులు, కూతుర్లు ఒక్క రోజే చనిపోయినా – “యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక” అన్నాడు తప్ప భక్తిని వదలలేదు. ఇలాంటి భక్తులు అన్ని మతాల్లోనూ ఉన్నారు. కుటుంబ సభ్యులు చనిపోయినా, ఆర్థిక ఇబ్బందులు వచ్చినా భగవంతుడు పరీక్షిస్తున్నాడని భావిస్తారు.
  • మతోన్మాదులు – మూర్ఖులు: “దేవుడు కాపాడలేదు గనుక బైబిల్ అబద్ధం” అని చెప్పేవాడు మనిషి కాదు, వాడు మూర్ఖుడు. వాడిని పోల్చడానికి ఈ భూమి మీద జంతువు కూడా లేదు. వాళ్ళంతా పిశాచులు. కేవలం విషం కక్కడానికి సంఘ పరివార్ వాళ్ళు ఇచ్చే జీతాల కోసం పని చేసే ‘పెయిడ్ ఆర్టిస్టులు’ (Paid artists). మానవత్వం అనేది దేవుని ప్రతిబింబం. మతోన్మాదులకు ఉన్మాదం మాత్రమే ఉంటుంది, మతం ఉండదు. బాధలో ఉన్న తల్లికి అన్ని మతాల వారు సానుభూతి తెలుపుతారు తప్ప ఇలా అవమానించరు.

Detailed English Translation:

❓ Question: A viral video shows people telling an elderly woman who lost her son in an accident to leave Christianity because God didn’t save him. Is it right to talk like this? How should a devotee react in times of personal tragedy?

  • Humanity Over Fanaticism: Only fools speak like that in the face of death. True Hindu devotees like Annamayya, Tyagaraja, and Swami Vivekananda, who reached the heights of spirituality, would never rejoice in someone’s pain or use it to target their faith.
  • Devotion through Wounds: When a true devotee suffers, they cling closer to God, believing He is testing them. Just as a child who gets scolded by its mother clings only to her legs while crying, a devotee turns to God for comfort even in suffering.
  • The Example of Job: In the Bible, Job lost all ten of his children in one day, yet he said, “The Lord gave and the Lord has taken away; may the name of the Lord be praised.” Devotees like him exist in every religion; they don’t abandon God during tragedies.
  • Paid Fanatics: Those who mock faith because of an accident are not human; they are demonic. They are paid artists acting out of pure hatred, often funded by organizations to spread venom. Religion should be about humanity—the reflection of God. Fanatics have no religion, only insanity.

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram